Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
రాఖీ స్పెషల్ కాలా జామున్..లొట్టలేసుకుంటూ తింటారు..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
రక్షా బంధన్ లేదా రాఖీ పూర్ణిమ సోదర,సోదరిల అనుబంధానికి ప్రతీక. ఈ ఏడాది రాఖీ పండుగను ఆగస్టు 9న జరుపుకుంటారు. ఈ పండుగ రోజున సోదరి ప్రేమతో కట్టే రాఖీకి ప్రతిఫలంగా సోదరుడు ఇచ్చే బహుమతులు, మిఠాయిల పంపిణీ ఒక సంప్రదాయం. ఈ సందర్భంలో ఇంటిలో తయారు చేసుకునే రుచికరమైన మిఠాయిలలో కాలా జామున్ ప్రత్యేకమైనది. సాధారణ గులాబ్ జామున్ కి ఇది ఒక భిన్నమైన రకం. దీనిని తయారు చేయడం కొంచెం కష్టమే అయినప్పటికీ దాని రుచి అద్భుతంగా ఉంటుంది. రాఖీ సందర్భంగా మీ ఇంట్లోనే ఈ రుచికరమైన కాలా జామున్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి
కాలా జామున్ తయారీకి కావలసిన పదార్థాలు
-పచ్చి కోవా
-మైదా పిండి
-కార్న్ ఫ్లోర్
-జాపత్రి పొడి
-ఆయిల్
-జాజికాయ పొడి
-ఆరెంజ్ ఫుడ్ కలర్
-పాల పిండి
కాలా జామున్ తయారీ విధానం
-ముందుగా పాకం తయారుచేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అరకేజీ చక్కెర, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి ఆముదం లాంటి జిగురు పాకం వచ్చేదాకా కలుపుతూ మరిగించి దించేయాలి. దీనికి సుమారు 12-15 నిమిషాలు పడుతుంది.
-తర్వాత ఓ బౌల్ లో పావు కేజీ పచ్చి కోవా, 50 గ్రాముల మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, పావు టీస్పూన్ జాపత్రి పొడి, 1 టేబుల్ స్పూన్ పాల పండి, కొద్దిగా జాజికాయ పొడి, చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ లో 1 టీస్పూన్ నీళ్లు వేసి కరిగించిన నీరు వేసి మొత్తం కలిసేలా వత్తుకోవాలి.
-పిండి ముద్ద దగ్గరకి చేరిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ చొప్పున కోవా ముద్దను తీసుకొని పగుళ్లు లేకుండా నున్నగా రోల్స్ చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని చేసుకోవాలి.
-తర్వాత గులాబ్ జాములు మునిగేంతవరకు నూనె పోసి వేడి చెయ్యాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటను సిమ్ లో పెట్టి రెడీ చేసుకున్న పిండి ముద్దలను వేసి వేయించాలి. అవి బంగారు రంగులోకి మారిన తర్వాత మంటను పెంచి చాక్లెట్ కలర్ లోకి వచ్చుదాకా వాటిని వేయించుకోవాలి. జామూన్స్ పైకి తేలేదాకా గరిట పెట్టకూడదు..లేకుంటే విరిగిపోతాయ్.
-చాక్లెట్ బ్రౌన్ కలర్ లో వేగిన జామూన్స్ ని బాండీలో నుంచి తీసి రెడీ చేసుకున్న పాకంలో వేసి లైట్ గా కలిపి ఒక గంట సేపు వదిలేయాలి. అప్పుడు అవి సిరప్ ను బాగా పీల్చుకుని, మరింత రుచికరంగా తయారవుతాయి. అంతే కాలా జామున్ రెడీ.
-పండుగ రోజున ఇంటిలో తయారు చేసిన కాలా జామున్ తినడం మనసుకి సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











