Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
మేక పిచ్చల కూర..శక్తికి, తృప్తికి ఫర్ఫెక్ట్ రెసిపి,ఎలా చేసుకోవాలంటే..
మటన్ తో రకరకాల వెరైటీలు తయారుచేస్తుంటారు. మటన్ ఫ్రై, బోటీ, లివర్, తలకాయ, పాయ,మటన్ ముట్టీలు ఇలా ఇప్పటిదాకా అనేక రకాల వంటకాలను ఆస్వాదించి ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా మేక పిచ్చల కూర తిన్నారా? మేక పిచ్చల కూర అనేది తెలంగాణలో ఒక సాంప్రదాయ వంటకం. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మేక పిచ్చలు ప్రోటీన్, ఐరన్, విటమిన్ B12 వంటి పోషకాలకు మంచి మూలం.
రోగనిరోధక శక్తిని, శరీరానికి కావలసిన శక్తిని అందించడంలో, రక్తహీనతను నివారించడంలో,ఎముకల ఆరోగ్యానికి మేలు చేయడంలో సహాయపడే మేక పిచ్చల కూరను ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకొని ఆస్వాదించవచ్చు. మేక పిచ్చల కూర తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
మేక పిచ్చల కూర తయారీకి కావలసిన పదార్థాలు
మేక పిచ్చలు: 1 కేజీ
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
టమోటాలు: 2
పసుపు: 1/2 టీ స్పూన్
కారం: 2 టీ స్పూన్లు
ధనియాల పొడి: 1 టీ స్పూన్
గరం మసాలా: 1/2 టీ స్పూన్
నూనె: 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: కొంచెం
రంజాన్ స్పెషల్..దహీ చనా ఇలా చేసుకుంటే శరీరానికి కొత్త శక్తి,పూర్వీకుల్లా బలంగా ఉండొచ్చు
మేక పిచ్చల కూర తయారీ విధానం
-ముందుగా మేక పిచ్చలను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి.
-తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేడి చేసి, ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి చీలికలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
-తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
-సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
-పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.
-మసాలా నుండి నూనె వేరుపడే వరకు ఉడికించాలి.
- ఇప్పుడు ఉడికించిన పిచ్చల ముక్కలను మసాలాలో వేసి బాగా కలపాలి.
-తర్వాత కొద్దిగా నీరు పోసి, మూత పెట్టి 15-20 నిమిషాలు ఉడికించాలి. రుచికి తగినట్లుగా కారం, ఉప్పును సర్దుబాటు చేసుకోవచ్చు.
-నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
-చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












