For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ జీర - భోజనానికి స్పెషల్ సైడ్ డిష్

|

సాధారణంగా, భోజనానికి ఏదో ఒక సైడ్ డిష్ లేనిదే కొంత మంది ముద్ద పొట్టలోకి దిగదు. గ్రేవీ లేకపోయినా సరే సైడ్ డిష్ తో కడుపు నింపేసుకుంటారు, సైడ్ డిష్ ప్రియులు. అంతే కాదు మన సౌత్ ఇండియన్ సైడ్ డిష్ లో ఎప్పుడూ తిని బోర్ కొట్టినప్పుడు నార్త్ వంటకాల మీద ప్రయోగ చేస్తే రుచికి రుచి, కొంత వంటలు ట్రై చేసాం అన్న సంతోషం ఉంటుంది.

నార్త్ ఇండియన్స్ ఎక్కువగా బంగాళదుంపలను తింటారు. బంగాళదుంపలతో వివిధ రకాల వంటకాలను వెరైటీగా వండుతారు. ఇవి నోరూరించి రుచి కలిగి, ఆకర్షనీయంగా ఉంటాయి. అటువంటి వంటకాల్లో ఆలూ జీర కూడా ఒకటి. ఇది మన వంటకాలతో పాటు, మద్యహ్నాన భోజనంలో సైడ్ డిష్ గా తయారు చేసుకోవచ్చు. రుచిగా ఉంటుంది. కడుపు నిండేట్లు చేస్తుంది. ఇండియన్ మసాలాలు (అల్లం, జీలకర్ర, ఇంగువ, పసుపు)వంటి వాటితో తయారు చేయడం వల్ల ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఈ ఆలూ జీర ఎలా తయారుచేయాలో ఒక సారి చూద్దాం....

Aloo Jeera - Special Sidedish for Lunch

కావల్సిన పదార్థాలు:

బంగాళ దుంపలు: 5(ముక్కలుగా కట్ చూసి ఉడికించుకోవాలి)
జీలకర్ర: 1 ½tbsp
హింగ్(ఇంగువ): ½tsp
అల్లం: 1tbsp(తురుముకోవాలి)
పచ్చిమిరపకాయలు: 2 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ధనియా పొడి: 1 ½tbps
పసుపు: ½tbsp
కారం: 1tbsp
Amchoor(మామిడి పొడి): 1tbsp
ఆయిల్: 2tbsp
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి, మీడియం మంట పెట్టి కాగనివ్వాలి.
2. తర్వాత నూనె వేడయ్యాక అందులో జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి.
3. తర్వాత మంట పూర్తిగా తగ్గించి అందులో ఇంగువ, అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేగించుకోవాలి .
4. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంపులను వేసి, మసాలా పోపుతో బాగా వేగనివ్వాలి. బంగాలదుంప ముక్కలకు మసాలా బాగా పట్టే వరకూ వేగిస్తుండాలి.
5. ఒక 5నిముషాల పాటు బాగా మిక్స్ చేస్తూ వేగించి స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే ఆలూ జీర స్పెషల్ సైడ్ డిష్ రెడీ.

English summary

Aloo Jeera - Special Sidedish for Lunch


 Known as Aloo Jeera, this recipe is enriched with spices and garnished with herbs. It is the best treat you can give your tummy on this festive occasion.
Story first published: Friday, August 30, 2013, 12:16 [IST]
Desktop Bottom Promotion