For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మసాలా కాకరకాయ

|

Bitter Gourd Masala...
కాకరకాయ అంటేనే చేదుకి నిదర్శనం అనుకుంటాంగానీ ఆ చేదులో ఉండే ఔషధ విలువలెన్నో...!డయాబెటిస్ వ్యాది తో బాధ పడే వారికోసం కాకరకాయ ఎంతో ముఖ్యమయిన ఔషదం. దీనిని ఇంగ్లీష్ లో "Bitter Gourd" అంటారు. షుగర్ లేదా డయాబెటిస్ వ్యాధి మరియు టాక్సిమియా వ్యాధి ఉన్నవారు దీని రసం ఒక గ్లాస్ తీసుకుని తాగినట్టయితే అది ఒక ఇన్సులిన్ ఇంజెక్షన్ తో సమానం. డాక్టర్స్ కూడా కాకరకాయ రసం తాగమని చెప్తారు. ఎటువంటి వ్యాధి లేని వారు కూడా మంచి షుగర్ లెవెల్స్ సరిగ్గా ఉంచుకోవటం కోసం మరియు ఆరోగ్యాన్ని బాగా చూస్కోవటం కోసం కాకరకాయని తిస్కోవాలి. ఇందులో ఐరన్ బాగా ఎక్కువగా ఉండటం వలన మరియు కేలోరిస్ తక్కువగా ఉండటం వలన రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. రసం తాగటం కష్టమే అందువలన రకరకాల కూరలు చేసుకొని తినొచ్చు. మధుమేహ రోగులకు ఎంతో మేలు చేసే కాకరకాయతో ఎన్నో రకాల వంటలు చేసుకోచ్చు. అద్బుతమైన రుచిని తనివితీరా ఆస్వాదించవచ్చు. మీరూ ట్రై చేసి చూడండి.

కావలసిన పదార్థాలు:
కాకరకాయలు: 1/2kg
చింతపండు: నిమ్మపండంత
మెంతులు: 1tsp
జీలకర్ర: 1tsp
ఉల్లిపాయ: 2
టమోటో: 2
అల్లం ముక్క: చిన్నది
వెల్లుల్లి రెబ్బలు: 4-8
నువ్వుల పొడి: 3tsp
వేరుశెనగపప్పు పొడి: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కారం: తగినంత
ధనియా పొడి: 1tsp
గరంమసాలా : చిటికెడు
ఎండుకొబ్బరి తురుము: 1tbsp
నూనె: 1/2cup

తయారు చేయు విధానం:
1 ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడిగి, వాటికి నాలుగు గాట్లు పెట్టి, బౌల్లో నీళ్ళు పోసి అందులో వేసి కొద్దిగా ఉప్పు చేర్చి సగం ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. అరగంట ముందే చింత పండును నానబెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయను కాల్చి పెట్టుకోవాలి.
3. తర్వాత మిక్సీ జార్ లో ఎండుకొబ్బరి తురుము, అల్లం, వెల్లుల్లి, కాల్చి పెట్టుకొన్న ఉల్లిపాయ, నువ్వులపొడి, ఉప్పు, కారం, ధనియాపొడి, వేరుశెనగ పప్పు, కొత్తిమీర నానబెట్టుకొన్న చింత పండు వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ముద్దుగా ఉడికించి పెట్టుకొన్న కాకరకాయల్లో ఈ మసాలా ముద్దను నింపాలి.
4. స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి, వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, టమోటో ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. అందులోనే పసుపు కూడా వేసి వేయించాలి. కొద్దిసేపటి తర్వాత మసాలా ముద్ద నింపి పెట్టుకొన్న కాకరకాయల్ని వేసి వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చాక జీలకర్ర, మెంతి పొడి, నువ్వుల పొడి, గరం మసాలా వేసి బాగా కలియ తిప్పి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి. అంతే మసాలా కాకరకాయ రెడీ.. వేడి వేడి అన్నం, రాగి ముద్ద లోని చాలా రుచికరంగా ఉంటుంది.

English summary

Bitter Gourd Masala... | మసాలా కాకరకాయ

Bitter Gourd Masala recipe...It is very ... Crispy and Tasty side dish for rice...Try this tasty stuffed bittergourd masala and enjoy ur meal with steamed rice and yoghurt.
Story first published:Friday, June 8, 2012, 14:14 [IST]
Desktop Bottom Promotion