For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోకొనట్ - టమోటో చట్నీ రిసిపి

|

సౌత్ ఇండియన్ డిషెష్ లో చట్నీలు చాలా ఫేమస్. తప్పనిసరిగా సైడ్ డిష్ లలో చట్నీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా టిఫిన్స్ ఇడ్లీ, దోస, మరియు వడ వంటి వాటికి చట్నీలు తప్పని సరిగా ఉండాలి.

వివిధ రకాల చట్నీలను వివిధ రకాల పదార్థాలతో తయారుచేస్తారు. టమోటో, చింతపండు, కొబ్బరి, కొత్తిమీర, మరియు ఎండుమిర్చి మరియు మరికొన్ని ఇతర పదార్థాలతో చట్నీలను తయారుచేస్తారు. ఈ పదార్థాలను సౌత్ ఇండియన్ చట్నీలన్నింటిలో దాదాపు అన్నింటిలో ఉపయోగిస్తారు. ఇక్కడ ఒక సింపుల్ కొబ్బరి టమోటో చట్నీని అందివ్వడం జరిగింది. ఈ చట్నీ రిసిపి దోస, ఇడ్లీ, రైస్ మరియు రోటీలకు మంచి కాంబినేషన్ మరి, ఈ చట్నీ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Coconut Tomato Chutney Recipe

కావల్సిన పదార్థాలు:
కొబ్బరి తురుము: ½cup
టమోటా : 3 (సన్నగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 2 (సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం: 1 అంగుళం (తురిమినది)
వెల్లుల్లి రెబ్బలు: 3(సన్నగా తరిగినవి)
ఎండుమిర్చి: 2-4
కరివేపాకు : కొద్దిగా
శెనగపప్పు : 2tbsp
ఉద్దిపప్పు: 1tbsp
ఆవాలు: 1tsp
నూనె: 2tsp
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో కరివేపాకు, ఆవాలు, శెనగపప్పు మరియు ఉద్దిపప్పు వేసి ఒక నిముషం తక్కువ మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
2. తర్వాత అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మిక్స్ చేయాలి. మీడియం మంట మీద ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకూ వేగించుకోవాలి.
3. తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న టమోటో ముక్కలు మరో 2-3నిముషాలు మీడియం మంట మీద వేగించాలి. టమోటో మెత్తగా ఉడుతున్నప్పుడు, మ్యాషర్ తో మ్యాష్ చేయాలి . ఇప్పుడు అందులో కొబ్బరి తురుము వేసి స్టౌ ఆఫ్ చేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రైయింగ్ మిశ్రం మొత్తం చల్లారే వరకూ పక్కన పెట్టుకోవాలి.
4. మొత్తం మిశ్రమం చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి రుచికి సరిపడా ఉప్పు, అవసరం అయితే నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకొన సర్వింగ్ బౌల్లోనికి తీసుకోవాలి.
5. తర్వాత డీప్ ఫ్రైయింగ్ పాన్ మరికొద్దిగా నూనె వేసి, కాగిన తర్వాత అందులో కరివేపాకు, కొద్దిగా ఆవాలు, వేసి చిటపటలాడిన తర్వాత దీన్ని తీసి చట్నీలో మిక్స్ చేయాలి. అంతే కోకనట్ టమోటో చట్నీ రెడీ.

English summary

Coconut Tomato Chutney Recipe

Chutney is a typical South-Indian side dish that is best enjoyed with idlis, dosa and vadas. There are many chutney recipes that are made with special ingredients such as tomatoes, tamarind, coconut, coriander and red chillies to name a few. Coconut is a special ingredient that is used in almost all the South-Indian recipes. Lets check out the simple recipe to make ginger, coconut and tomato chutney. You can have this chutney with rice, idli, dosa and even rotis.
Story first published: Tuesday, May 6, 2014, 18:30 [IST]
Desktop Bottom Promotion