For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈజీ టేస్టీ పొటాటో-ఆనియన్ సాంబార్ రిసిపి

|

లంచ్ లేదా డిన్నర్ రైస్ కు టేస్టీ సాంబార్ డిష్ ఉండటం చాలా అవసరం. భోజనం సమయంలో సాంబార్, రసం, పెరగు ముఖ్యంగా తింటుంటారు. సాంబార్ డిష్ లలో వివిధ రకాలున్నా...ఎప్పుడూ తిన్నవే తింటుంటే బోరుకొడుతుంది కాబటి, మీకోసం ఈ రోజు ఒక స్పెషల్ టేస్టీ డిషన్ ను పరిచయం చేస్తున్నాము.

పొటాటో ఆనియన్ సాంబార్ రిసిపి. ఇది సాధారణంగా సాంప్రదాయమైన డిష్ . సాంబార్ లేకుండా భోజనం ముగియదు. సాంబార్ రిసిపి రుచిగా ఉండటం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే వాటిలో త్రుణధాన్యాలతో పాటు వివిధ రకాల వెజిటేబుల్స్ ను జోడించడం వల్ల శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్, ప్రోటీనులు అందుతాయి . మొత్తానికి సాంబార్ రిసిపి మధ్యాహ్నాభోజనం, రాత్రి డిన్నర్ కు ఎంపిక చేసుకొనే డిష్ సాంబార్ రిసిపి . మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ సాంబార్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Easy Tasty Potato Onion Sambar Recipe

కావల్సిన పదార్థాలు:

  • బంగాళదుంప - 1 cup
  • ఉల్లిపాయలు -1 cup
  • కందిపప్పు - 1 cup
  • కొబ్బరి తురుము - 1 cup
  • కారం - 3 tablespoons
  • ధనియాలు - 2 teaspoons
  • శెనగలు - 1/2 teaspoon
  • ఉద్దిపప్పు ‑ 1/2 teaspoon
  • బియ్యం - 1/2 teaspoon
  • బెల్లం - 1 teaspoon
  • చింతపండు - 5 gm or a size of a small lemon
  • కరివేపాకు - 1/4th teaspoon
  • ఉప్పు -రుచికి సరిపడా
  • నూనె తగినంత

తయారుచేయు విధానం :
1. ముందుగా ప్రెజర్ కుక్కర్లో కొద్దిగా ఉల్లిపాయలు, బంగాళదుంప ముక్కలు, కందిపప్పు, మరియు నీళ్ళు పోసి ఒకటి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత చిన్న పాన్ తీసుకొని అందులో పచ్చిబియ్యం, ధనియాలు, ఉద్దులు, శెనగలు వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి.
3. వేయించుకొన్న పదార్థాలు చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
4. అదే జార్ లో చింతపండు గుజ్జు, కొబ్బరి తురుము, బెల్లం, కారం, కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లా చేసుకోవాలి.
5. అంతలోపు కుక్కర్ చల్లబడి ఉంటుంది, ఉడికిన బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పప్పును వేరే పాన్ లోకి మార్చుకొని మరికొద్దిగా నీళ్ళు పోసి చిన్న మంట మీద ఉడికించాలి.
6. ఇప్పుడు అందులోనే మిక్సీలో గ్రైట్ చేసుకొన్న పేస్ట్, ఉప్పు కరివేపాకు వేసి 5-10 నిముషాలు ఉడికించాలి.
7. బాగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ప్లెయిన్ రైస్ విత్ గీతో పొటాటో ఆనియన్ సాంబార్ రిసిపిని సర్వ్ చేయాలి.

English summary

Easy Tasty Potato Onion Sambar Recipe

Sambar is, basically, an authentic recipe from South India. No meal can be complete without sambar. Udupi Style Sambar Recipe Sambar not only tastes good, but also has many health benefits too. As we use vegetables and lentils in the sambar, which are healthy and high on proteins. Therefore, there is an overall benefit of having sambar in your meal, preferably lunch.
Story first published: Friday, December 4, 2015, 17:14 [IST]
Desktop Bottom Promotion