For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజిటేబుల్ లెమన్ పెప్పర్ సూప్

|

డైటింగ్ చేసేవారు కొంత సమయం వరకూ ఆకలి కాకుండా ఓపిగ్గా ఉంటారు. కానీ రోజంతా ఆహారం లేకుండా డైట్ ఫాలో అవ్వాలంటే చాలా కష్టం . స్ట్రిట్ డైట్ ఫాలో అయ్యేవారికి రోజు మద్యలో ఆకలి కాకుండా ఉండాలంటే హెల్తీగా ఒక సూప్ తాగేయండి..!వెజిటేబుల్ లెమన్ పెప్పర్ సూప్ ఒక బెస్ట్ ఆప్షన్. ఇది టేస్ట్ గా మాత్రమే కాదు, హెల్తీ సిరఫ్ కూడా...

వెజిటేబుల్ పెప్పర్ లెమన్ సూప్ లో వివిధ రకాల ఫ్లేవర్స్ మిక్స్ చేయడం వల్ల అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. ఈ సూప్ పిల్లలు కూడా ఇష్టంగా తీసుకుంటారు. ఈ హెల్తీ డ్రింక్ ను ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు,. మరి హెల్తీ వెజిటేబుల్ పెప్పర్ లెమన్ జ్యూస్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

stay away from food

కావల్సిన పదార్థాలు:
క్యారెట్ - 1 cup (Chopped)
ఉల్లిపాయలు -1 cup (Chopped)
క్యాప్సికమ్-1 cup (Chopped)
స్ప్రింగ్ ఆనియన్స్ - 1 cup (Chopped)
క్యాబేజ్ -1 cup (Chopped)
వెల్లుల్లి- 1/4 Teaspoon
అల్లం - 1/4 Teaspoon (Chopped)
కార్న్ ఫ్లోర్ - 3 Teaspoon
పెప్పర్ - 1/2 Teaspoon
లెమన్ జ్యూస్- 2 Teaspoon
వెజిటేబుల్ స్టాక్- 2 Cups(వెజిటేబుల్స్ ఉడకించిన నీళ్ళు)
నూనె: తగినంత
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
2. తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ మరియు స్ప్రింగ్ ఆనియన్స్ వేసి 10 నిముషాలు వేగించుకోవాలి.
3. వేజిటేబుల్స్ వేగిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్ స్టాక్ పోయాలి .
4. ఇప్పుడు అందులోనే పెప్పర్ మరియు సాల్ట్ కూడా వేసి మొత్త మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
5. మీడియం మంట మీద ఉడికించాలి. ఉడుకుతన్నప్పుడు అందులో కార్న్ ఫ్లోర్ ను కొద్దిగా నీటిలో వేసి మిక్స్ చేసి ఉడికే మిశ్రమంలో పోయాలి .
6. తర్వాత నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ 10 నిముషాలు, మీడియం మంట మీద ఉడికించాలి.
7. చివరగా కొత్తమీర తరుగు చిలకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే వెజిటేబుల్ పెప్పర్ లెమన్ సూప్ రెడీ...

English summary

Vegetable Pepper And Lemon: A Diet Soup Recipe

If you are dieting and meanwhile finding it really hard to stay away from food, then we have good news for you.! For those who are on diet, the best option for them is to take a sip of the vegetable lemon and pepper soup. This soup not only tastes great but it is a very healthy soup.
Story first published:Tuesday, June 7, 2016, 17:55 [IST]
Desktop Bottom Promotion