For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డేటింగ్ చేయడానికి ముందు మహిళలకోసం కొన్ని సూచనలు

డేటింగ్ చేయడానికి ముందు మహిళలకోసం కొన్ని సూచనలు

|

ఒకప్పుడు పెళ్లికాని ఆడ, మగా కలిసి మాట్లాడుకుంటుంటేనే నోరు వెళ్లబెట్టి చూసే కాలానికి ఏనాడో కాలం చెల్లింది. పెళ్లికాకుండానే ఒకే ఇంటిలో సంవత్సరాల తరబడి ఉంటున్న వారినిచూసి, ఓహో... వారు సహజీవనం చేస్తున్నారా...ఈ రోజుల్లో ఇవన్నీ సర్వసాధారణమే అనుకునే రోజులకు మన నాగరికత ఎదిగింది.(?) విదేశాలలో ఉండే ఈ సంస్కృతి మనదేశంలోకి ప్రవేశించి అన్ని మెట్రో నగరాలతో పాటు ఓ మోస్తరు పట్టణాలకు కూడా వేగంగా విస్తరించింది. మనం ఆహ్వానించిన ఈ విచిత్ర సంబంధానికి సుప్రీంకోర్టుకూడా ఆమోదం తెలుపడంతో ఈ బంధం మరింత బలపడింది. సుధీర్ఘ కాలం జంటలు కలిసి ఉన్నట్లయితే అలాంటి బంధం వివాహంతో సమానమేనని కోర్టు తీర్పునిచ్చింది. అయితే, ఇలాంటి బంధాలు కలకాలం నిలవలేని పరిస్థితులు నేడు ఏర్పడుతున్నాయి.

జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు వాళ్ళు తమకు తగినవారో కాదో వివాహానికి ముందే తెలుసుకునేందుకు పాశ్చాత్య దేశాల్లో ఎప్పటినుంచో డేటింగ్ విధానం ప్రాచుర్యంలో ఉంది. మనదేశంలోనూ ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తోందీ డేటింగ్ మాట. టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిల్లోనూ ఈ ధోరణి ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే అమ్మాయిల విషయంలో డేటింగ్ కు సిద్దపడే వారు, ఒక వ్యక్తితో డేటింగ్ చేయాలని నిర్ణయించుకొనే వారు, తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటంటే...

మీ గురించి చర్చించకండి

మీ గురించి చర్చించకండి

ప్రతి ఒక్కరు వారి ఇష్టానికి అనుగుణంగా అభిరుచులను, అనుభవాలను కలిగి ఉంటారు వీటిని డేట్ కోసం వెళ్ళే వ్యక్తితో పంచుకోవటం వలన డేట్'లో సమస్యలు కలిగే అవకాశం ఉంది. మీ పూర్వపు బాయ్ ఫ్రెండ్'తో గడిపిన సమయం, అతడితో గడిపిన రాత్రులు గురించి డేట్'కి వెళ్ళిన వ్యక్తి దగ్గర ప్రస్తావించకండి. ఒకవేళ డేట్'కి వెళ్ళిన వ్యక్తి ఇవి తెలుసుకోవటంలో ఆసక్తి చూపటం లేదా వాటి గురించి అడిగితే ''వాటి గురించి చర్చించటం ఇష్టం లేదు'' అని నిక్కచ్చిగా చెప్పేయండి.

ఎక్కువ ఉత్సాహవంతంగా ఉండకండి

ఎక్కువ ఉత్సాహవంతంగా ఉండకండి

డేట్ పట్ల అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి. అతడికి కాస్త సమయం ఇవ్వండి మరియు అతడి సెల్ ఫోన్ నంబరు, ఇ-మెయిల్ వంటి వాటిని అడిగి ఉక్కిరి బిక్కిరి చేయకండి. "ఎల్లపుడు మీ గురించి అడిగే విధంగా ప్రయత్నించండి"

సరైన సమయం మరియు సందర్భం

సరైన సమయం మరియు సందర్భం

డేట్'కు సిద్ధంగా లేని సమయంలో ఇతర వ్యక్తులతో డేట్'కు వెళ్ళుటకు ప్రయత్నించకండి. సిద్దంగా లేని సమయంలో డేట్'కి వెళ్ళటం వలన అతడి పైన ఉద్వేగ పూరితమైన భావాలకు గురయ్యే అవకాశం ఉంది. కావున సరైన సమయంలో, సందర్భంలో మాత్రమె డేట్'కు వెళ్ళండి

అతడిని అభినందించండి

అతడిని అభినందించండి

అతడు చేసే చిలిపి పనులకు, మిమ్మల్ని ఆనందింపచేసే విషయాలకు అభినందించండి. అభినందనల వలన మీ ఇద్దరిలో మంచి భావనను కలిగించే హార్మోన్'లు ఉత్పత్తి చెందుతాయి.

ఇతర వ్యక్తుల గురించి ప్రస్తావించకండి

ఇతర వ్యక్తుల గురించి ప్రస్తావించకండి

మగువలు మాత్రమె కాకుండా పురుషులు కూడా వాటి పూర్వపు గర్ల్ ఫ్రెండ్'ల గురించి కానీ, వారితో గడిపిన సమయం, డేట్'ల గురించి కానీ ప్రస్తావించుటకు ఇష్టపడరు. కావున మీరు కూడా మీ పూర్వపు చరిత్రల గురించి కానీ, పాత జ్ఞాపకాల గురించి గానీ చర్చించకండి

అందంగా తయారు అవండి

అందంగా తయారు అవండి

అందమైన జుట్టు మరియు ఆకర్షణీయమైన ఎర్రటి లిప్ స్టిక్, అతడిని అన్నిటికి ఒప్పుకునేలా చేస్తాయి. మీరు ఇంట్లో నుండి భయటకు వెళ్ళటానికి ముందుగానే ఇవన్ని చెక్ చేసుకోండి. ఇలా చేయటం వలన అతడు మీతో జీవితకాలం ఉండేలా చేసుకోవచ్చు. మీతో డేట్'కు వచ్చే ఎవరైనా మిమ్మల్ని అందంగా చూడటానికి ఇష్టపడతారని మరవకండి.

తక్కువ సమయం

తక్కువ సమయం

డేట్'లో ఎక్కువ సమయం కేటాయించకండి. తక్కువ సమయం అతడితో గడపటం వలన మీపై ప్రేమ ఎక్కువ అవుతుంది మరియు మీతో ఎక్కువ సమయం గడపాలని ఆశిస్తాడు. తక్కువ సమయం వలన అన్ని విధాల లాభం పొందుతారని గుర్తుపెట్టుకోండి

అతడిచే కట్టించండి

అతడిచే కట్టించండి

మొదటి సారి డేట్'కి వెళ్ళినపుడు, బిల్లును భాగస్వామితో కట్టించటం వలన ఎలాంటి నష్టం జారగదు. బిల్లు కట్టించటం వలన మీరు మాత్రమె కాకుండా అతడు కూడా సంతోషంగా ఫీల్ అవుతాడు అంతేకాకుండా బిల్లు కట్టమని ఎక్కువ బలవంత పెట్టడం కూడా అంత మంచిది కాదు. బలవంత పెట్టడటం వలన మీపై చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది.

English summary

Dating Advice for Women

There are times in all romantic relationships when things don't run smoothly and can be difficult to understand--even in the most ideal of circumstances. Although relationships have their ups and downs, there are things you can both do that can minimize problems.
Desktop Bottom Promotion