మీరు ప్రేమించిన వ్యక్తి కోసం కూడా చేయకూడని పనులు

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీరు మీ ప్రేమను చూపించటానికి ఏం చేయడానికి సిద్ధపడతారు? మీ దగ్గర అప్పుడే లిస్టు ఉంది కదా! కానీ మీ ప్రేమ కోసం ఏం చేయకూడదో తెలుసా మీకు? ఇది ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ కొన్ని పనులు ప్రేమ కోసం కూడా చేయకూడదు. అవేంటో ఈ వ్యాసంలో చూద్దాం.

what not to do for love

దీని అర్థం మీరు మీ చుట్టూ గిరి గీసేసుకుని మీ భాగస్వామిని ప్రేమించడం మానేయమని కాదు. మీ బంధానికి రాజీపడటాలు త్యాగాలు కూడా అవసరమే కానీ దాని అర్థం మీ భాగస్వామిని సంతోషపెట్టడం కోసం మీరు అనుక్షణం బాధపడటం సరికాదు.

మీ ప్రేమ కోసం కూడా చేయకూడని విషయాలు!

అయితే, ఇదిగో మీరు ప్రేమించిన వ్యక్తి కోసం కూడా చేయకూడని విషయాలు.

వ్యంగ్య జోకులను భరించడం

వ్యంగ్య జోకులను భరించడం

ఒక సర్వే ప్రకారం 40 శాతం విడాకులు వ్యంగ్య జోకుల వల్లనే మొదలవుతాయి. అవును ఒక చెత్త జోకు కూడా కొన్నిసార్లు మీ భాగస్వామిని బాధపెడుతుంది.

కొన్నిరోజుల తర్వాత మరో సంఘటన మీ గొడవను మరింత పెంచి, వ్యంగ్య జోకులు పెరిగిన కొద్దీ జంట ఒకరినొకరు అసహ్యించుకోవటం మొదలుపెడతారు. అందుకని, మీకు ఒక వ్యంగ్యమైన జోకు నచ్చకపోతే వెంటనే వారి మొహం మీద చెప్పవచ్చని తెలుసుకోండి.

మీ జీవితలక్ష్యాలను త్యాగం చేయడం

మీ జీవితలక్ష్యాలను త్యాగం చేయడం

మీకు సంగీతం అంటే ఇష్టం. మీ భాగస్వామికి మీరు గంటలు గంటలు సంగీత సాధన, ప్రాక్టీసు చేయడం అంటే నచ్చదు. అందుకని అతనో, ఆమెనో మీరు మీ బంధం కోసం సంగీతాన్ని వదిలేయమని కోరతారు.

మీరు అది చేస్తారా? మీరు మధ్య మార్గాన్ని ఎంచుకోవడం మంచిది. మీ భాగస్వామికి మీ బంధానికి ఎక్కువ సమయం ఇస్తానని నచ్చచెప్పి, సంగీతంపై మీ ప్రేమను చంపేసుకోకుండా ఉండవచ్చు.

పోలికలను భరించడం

పోలికలను భరించడం

మీరు మౌనంగా పోలికలను భరించనక్కరలేదు. మీ భాగస్వామి మిమ్మల్ని అతను లేదా ఆమె మాజీ ప్రియులతో నిరంతరం పోలుస్తూ ఉంటే, మీకు మరొకరిలా ఉండటం ఇష్టం లేదని నేరుగా చెప్పవచ్చు.

మీ రూపం మార్చుకోవటం

మీ రూపం మార్చుకోవటం

మీరు ప్రేమించిన వారికోసం కూడా మీ రూపాన్ని ఉన్నపాటున మార్చేసుకోనక్కర్లేదు. నిజానికి, మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లయితే, వారు మిమ్మల్ని ఏదీ చేయమని బలవంతపెట్టరు. అవును, మీరు ఎలా ఉంటే అలా వారు కూడా సౌకర్యంగా ఉంటారు.

మొత్తం పని మీరే చేయటం

మొత్తం పని మీరే చేయటం

ఒక సామెత ఉంటుంది ; "చేసే గాడిదకే బరువంతా పడేస్తారు." దాని అర్థం, అన్నివేళలా కేవలం మీరే మొత్తం పని చేస్తున్నారని. మీ భాగస్వామి మిమ్మల్ని పనిచేసే సేవకులుగా భావించి మొత్తం పనిని అన్నివేళలా చేయిస్తారు! దాని బదులు మీరు మీ భాగస్వామిని నిజంగా చాలా ప్రేమిస్తుంటే, ఇద్దరూ పనులు పంచుకోవటం మంచి ఆలోచన.

దగ్గరి బంధాలను త్యాగం చేయటం

దగ్గరి బంధాలను త్యాగం చేయటం

మీ స్నేహితులు, బంధువులు కూడా మీ జీవితంలో చాలా ముఖ్యభాగం. మీ భాగస్వామి ఒకవేళ వారిని కలవొద్దన్నా, అందరితో తెగతెంపులు చేసుకోమని, దాని ద్వారా మీ ప్రేమను నిరూపించమని కోరితే మీరు అలా చేస్తారా?

సంతోషకర జీవితం కోసం, మీకు అన్నీ సరైనంత కావాల్సి ఉంటుంది. మీ భాగస్వామి ప్రేమే కాదు, స్నేహితులు,బంధువులు మరియు మీకు ఎవరు దగ్గరైతే వారందరి ప్రేమ కూడా కావాల్సి ఉంటుంది. అవును, మీ భాగస్వామి అందరికంటే ఎక్కువ. కానీ మీ భాగస్వామి మీరు ఎవర్ని కలవాలో, ఎవరికి దూరంగా ఉండాలో, ఎవరిని ప్రేమించాలో నిర్ణయించకూడదు.

ఆర్థికంగా నిర్లక్ష్యంగా ఉండటం

ఆర్థికంగా నిర్లక్ష్యంగా ఉండటం

మీ భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేసుకోవటం తప్పుకాదు. మీ భాగస్వామి మీరు సంపాయించినదంతా ఇచ్చేయమని కోరితే, అది మీకు హెచ్చరిక అవుతుంది. మీ సంపదను పంచుకోవచ్చు కానీ మీ భాగస్వామి మిమ్మల్ని దివాలా తీయించకూడదు. మీ భాగస్వామి స్వార్థంగా ప్రవర్తిస్తే, మీ డబ్బు గురించి జాగ్రత్తగా ఉండటం మంచిది.

అన్ని విషయాలలో వారితో అంగీకరించడం

అన్ని విషయాలలో వారితో అంగీకరించడం

ప్రతి ఒక్కరికీ వివిధ అభిప్రాయాలు ఉంటాయి. మీ భాగస్వామి తన అభిప్రాయాలను మీ మీద రుద్దటానికి ప్రయత్నిస్తే మీరు వెంటనే ఆ వాదనను ఆపేయవచ్చు. ప్రేమించడం అంటే ఉన్నపాటున మీ అభిప్రాయాలన్నీ మార్చేసుకుని వారి అభిప్రాయాలతో అన్ని సమయాలలో అంగీకరించడం కాదు.

English summary

Things Not To Do For Love

It doesn't mean that you have to draw lines or boundaries and stop loving your partner. Though a relationship requires some amount of compromises or sacrifices, it doesn't mean that you should suffer to keep your partner happy.So, here are some things which you don't need to do even for your beloved.
Story first published: Wednesday, December 27, 2017, 19:00 [IST]