For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాన‌సికంగా బ‌లంగా, దృఢంగా ఉండ‌టం ఎందుకు క‌ష్టమంటే...

By Sujeeth Kumar
|

బ‌లంగా ఉండ‌టం మంచిదే. బ‌ల‌మంటే శారీర‌క దృఢ‌త్వ‌మే కాదు. కేవ‌లం కండ‌లు పెంచ‌డ‌మే శ‌క్తిమంతులుగా చేయ‌దు. మాన‌సికంగానూ బ‌లంగా ఉండాలి. అదే మీ వ్య‌క్తిత్వాన్ని నిర్ణ‌యిస్తుంది. తెలివిప‌రంగాను బ‌లంగా ఉన్న‌వారికే ప్రాధాన్య‌త ఉంటుంది.

శ‌క్తిమంతులు ఇత‌రుల‌తో పోలిస్తే విభిన్నంగా ఉంటారు. ఇలాంటి వారిని సులువుగా అపార్థం చేసుకునే ప్ర‌మాద‌ముంది.

శ‌క్తిమంతుల గురించి మాట్లాడుకునేట‌ప్పుడు ఇగో క‌లిగి ఎక్కువ యాటిట్యూడ్ చూపించేవారి గురించి మాట్లాడుకోవ‌డం లేదు. ఇలాంటి వారితో వేగడం నిజంగా క‌ష్ట‌మే. ఉదాసీన‌తో వ్య‌వ‌హ‌రిస్తూనే బలంగా ఉండేవారి గురించే ఇప్పుడు చ‌ర్చ‌. ఇలాంటివారి గురించి అంచనా వేయ‌డం కాస్త క‌ష్ట‌మే. అదెందుకు ఇప్పుడు తెలుసుకుందాం...

బ‌ల‌మైన వారికి ప్ర‌త్యేక‌మైన అభిప్రాయాలుంటాయి.

బ‌ల‌మైన వారికి ప్ర‌త్యేక‌మైన అభిప్రాయాలుంటాయి.

1. బ‌ల‌మైన వారికి ప్ర‌త్యేక‌మైన అభిప్రాయాలుంటాయి. ప్ర‌జ‌ల ప‌ట్ల‌, జీవితం ప‌ట్ల వారి శైలే వేరు. వారిని బాగా అర్థం చేసుకోగ‌లిగితే వారితో వ్య‌వ‌హ‌రించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.

శ‌క్తిమంతులు దేన్నీ సులువుగా వ‌దులుకోరు.

శ‌క్తిమంతులు దేన్నీ సులువుగా వ‌దులుకోరు.

2. శ‌క్తిమంతులు దేన్నీ సులువుగా వ‌దులుకోరు. క‌ష్ట‌కాలంలోనూ బ‌లంగా ఉంటారు. వారికి ప‌నులు ఒక రీతిలో వెళ్లాల‌ని ఉంటుంది. 2. శ‌క్తిమంతులు దేన్నీ సులువుగా వ‌దులుకోరు. క‌ష్ట‌కాలంలోనూ బ‌లంగా ఉంటారు. వారికి ప‌నులు ఒక రీతిలో వెళ్లాల‌ని ఉంటుంది.

బ‌లంగా ఉన్న‌వారికి క‌నీళ్లు రావ‌ని, భావోద్వేగానికి గురికార‌ని అనుకుంటాం.

బ‌లంగా ఉన్న‌వారికి క‌నీళ్లు రావ‌ని, భావోద్వేగానికి గురికార‌ని అనుకుంటాం.

3. బ‌లంగా ఉన్న‌వారికి క‌నీళ్లు రావ‌ని, భావోద్వేగానికి గురికార‌ని అనుకుంటాం. వారి మ‌న‌సు రాయి అని చెప్పుకుంటాం. వాస్త‌వానికి ఇలాంటి వారు అన్ని ర‌కాల ఒడిదొడుకుల‌ను చూసి ఉంటారు. అందుకే భావోద్వేగాల‌ను అదుపులో ఉంచుకోగ‌ల‌గుతారు.

 బ‌ల‌మైన వారు ఎప్ప‌టికీ స‌రైన రీతిలో ఉండాల‌నుకుంటారు.

బ‌ల‌మైన వారు ఎప్ప‌టికీ స‌రైన రీతిలో ఉండాల‌నుకుంటారు.

4. బ‌ల‌మైన వారు ఎప్ప‌టికీ స‌రైన రీతిలో ఉండాల‌నుకుంటారు. అందుకే ఏ వాగ్వాదంలోనూ వెన‌క‌డుగు వేయ‌రు. అందుకే వీరిని తొంద‌ర‌గా అపార్థం చేసుకుంటాం.

దృఢంగా ఉండేవారు ఎంతో చేసి ఎదుటివారిలోనూ అదే స్థాయిలో ఆశిస్తారు

దృఢంగా ఉండేవారు ఎంతో చేసి ఎదుటివారిలోనూ అదే స్థాయిలో ఆశిస్తారు

5. దృఢంగా ఉండేవారు ఎంతో చేసి ఎదుటివారిలోనూ అదే స్థాయిలో ఆశిస్తారు. అందుకే ఏదైనా సంబంధంలో వారు డిమాండింగ్‌గా క‌నిపిస్తారు.

 స్ట్రాంగ్‌గా ఉన్న‌వారు ఎదుటివారి ప‌ట్ల చాలా శ్ర‌ద్ధ తీసుకుంటారు

స్ట్రాంగ్‌గా ఉన్న‌వారు ఎదుటివారి ప‌ట్ల చాలా శ్ర‌ద్ధ తీసుకుంటారు

6. స్ట్రాంగ్‌గా ఉన్న‌వారు ఎదుటివారి ప‌ట్ల చాలా శ్ర‌ద్ధ తీసుకుంటారు. అంతే శ్ర‌ద్ధ ఆశిస్తారు.

శ‌క్తిమంతుల‌కు తేజ‌స్సు ఎక్కువ‌గా ఉంటుంది.

శ‌క్తిమంతుల‌కు తేజ‌స్సు ఎక్కువ‌గా ఉంటుంది.

7. శ‌క్తిమంతుల‌కు తేజ‌స్సు ఎక్కువ‌గా ఉంటుంది. వారి ఎదుట ఉన్న‌వారు త‌మ గుర్తింపును కోల్పోతారు. అందుకే సాధార‌ణంగా ఉండేవారు వారితో క‌లిసేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు.

చూశారుగా! బ‌లంగా, దృఢంగా ఉండ‌టం ఎంత క‌ష్ట‌మో! మీకూ అలాంటి స్నేహితులు ఉంటే కామెంట్స్ సెక్ష‌న్‌లో వారి పేర్లు పేర్కొని వారితో ఈ క‌థ‌నం షేర్ చేయండి.

English summary

Are Strong People Difficult In Relationships | Are Strong People Overpowering | Are Strong People Compatible

Are strong people difficult in relationships? Are strong people overpowering? Read on to find the answers…
Story first published:Wednesday, February 7, 2018, 16:16 [IST]
Desktop Bottom Promotion