మీ జంట ఎంత రొమాంటిక్ గా ఉంటారో ఈ చ‌ర్య‌లే చెబుతాయి!

By: sujeeth kumar
Subscribe to Boldsky

అటు మాన‌సికంగా, ఇటు శారీర‌కంగా మ‌న‌కు ఎక్కువ‌గా సంతృప్తినిచ్చేది ఏదంటే రొమాన్స్ అని చెప్పొచ్చు. అంతులేని సంతోషాన్నిచ్చేది ప్రేమ మాత్ర‌మే. ప్రేమ‌, రొమాన్స్ ఈ రెండింటి గురంచి ఇప్పుడు మాట్లాడుకుందామా...

చూడ‌టానికి ఈ రెండు మాట‌లు చాలా సింపుల్‌గా అనిపిస్తాయి. కానీ, లోలోప‌ల వేల రియాక్ష‌న్ల‌ను పుట్టిస్తాయి. ఇద్ద‌రి మ‌ధ్య బంధం పెర‌గ‌డానికి ఇవి బ‌లంగా ఉంటే చాలు. వీటి ప‌రిణామాలు మాత్రం చాలా గ‌మ్మ‌త్తుగా ఉంటాయి.

ఈ 10 లక్షణాలు మీ సంబంధ బాంధవ్యాల్లో ఉంటే గనుక మీలో 'శృంగార కళ' ఉందని అర్ధం

things couples can relate to

ప్రేమ పంచ‌డం ఒక్క‌టే రొమాన్స్‌లో భాగం కాదు. రొమాన్స్ అనేది బెడ్రూమ్‌లోనే పుట్ట‌దు. చాలా ర‌కాలుగా అనుకోని సంఘ‌ట‌న‌ల్లో రొమాన్స్ పుట్టొచ్చు. రొమాన్స్‌, ప్రేమ కురిపించ‌డం పైకి చాలా చిన్న‌గా అనిపించినా ఇద్ద‌రి మ‌ధ్య బంధాన్ని దృఢ‌ప‌ర్చ‌గ‌ల‌గ‌డంలో ఏమాత్రం తీసిపోవు. బంధం శాశ్వ‌తంగా నిలిచిపోయేందుకు స‌ర‌సం, ప్రేమ‌లే దోహ‌దం చేస్తాయి.

ఈ మ‌ధ్యే కొత్త‌గా రిలేష‌న్‌షిను ప్రారంభించినా, కొత్తగా పెళ్ల‌యినా కొన్ని రొమాంటిక్ సంద‌ర్భాలు ఎదుర‌య్యే ఉంటాయి. మ‌రి మీకు ఇలాంటి సంద‌ర్భాలు ఎదుర‌య్యాయో లేదో చెక్ చేసుకోండి...

వాద‌న మ‌ధ్య‌లోనే...

వాద‌న మ‌ధ్య‌లోనే...

మీరు తీవ్రంగా వాదించుకొంటూ పోట్లాడుతున్నార‌నుకుందాం. స‌డెన్‌గా న‌వ్వుతారు. మీరు చిన్న‌దానికి కొట్లాడుతున్నార‌ని అర్థ‌మై ప‌డీ ప‌డీ న‌వ్వుతారు. ఆ త‌ర్వాత ఒక‌రి కౌగిలిలో ఒక‌రు ఒదిగిపోతారు. ఇలాంటి సంద‌ర్భ‌మేదైనా మీకెదురైందా! ఒక్కోసారి తీవ్రంగా పోట్లాడే సంద‌ర్భాలు కూడా ఒక్క న‌వ్వుతో క్ష‌ణంలో మాయ‌మ‌వుతుంది. రొమాన్స్ అంటే ఇదేనేమో!

బిగి కౌగిలిలో...

బిగి కౌగిలిలో...

అన్ని కౌగిలింత‌లు ఒక్క‌టి కావు. కొన్ని సార్లు మీ పార్ట‌న‌ర్‌ను గ‌ట్టిగా కౌగిలించుకుంటారు. త‌నెక్క‌డ దూర‌మ‌వుతుందో అన్నంతలా బిహేవ్ చేస్తారు. అచ్చం రెండు అయ‌స్కాంతాలు అతికిన‌ట్టే ఉంటారు. ఇలాంటి ప్రేమానురాగాల‌ను ప్ర‌తి జంట ఏదో ఒక సంద‌ర్భంలో ఎదుర్కొనే ఉంటారు.

అధ‌ర చుంబ‌నం

అధ‌ర చుంబ‌నం

మామూలుగా ముద్దు వేరు లిప్ లాక్ కిస్ వేరు. మీ భాగ‌స్వామి అధ‌రాల‌తో మీ పెద‌వులు చుంబించే స‌న్నివేశ‌మే లిప్ లాక్ కిస్‌. రెండు పెదాల‌ను ఎవ‌రో గ‌మ్ పెట్టి అతికించిన‌ట్టుగా మార‌తాయి. ఒక్కోసారి పెద‌వుల‌ను విడ‌దీయాల‌ని అనిపించ‌దు. అంత‌లా మ‌మేక‌మై పోతారు. అంత ప‌వ‌ర్ ఉంటుంది. లిప్ లాక్ కిస్‌కు. కొంద‌రు జంట‌లు గంట‌ల‌పాటు చుంబించుకుంటూనే ఉంటారు.

స్వ‌రంలో తేడా గ‌మ‌నించి

స్వ‌రంలో తేడా గ‌మ‌నించి

మీరు ప‌నిలో బిజీగా ఉన్నారు. అప్పుడే స‌డెన్‌గా మీ భాగ‌స్వామి ఫోన్ చేసి మాట్లాడుతుంది. మెల్ల‌గా మాట‌ల్లో మాధుర్యం, చిలిపిత‌నం పెరుగుతాయి. అదేంటో మీరు గుర్తుప‌డ‌తారు. గుస‌గుస‌గా మాట్లాడ‌టం మొద‌లుపెడుతుంది. అప్పుడు మీకు టెన్ష‌న్ మొద‌లైపోతుంది. గుండె వేగం పెరిగిపోతుంది. అప్ప‌డే మీ బాస్ మీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు. ప్ఛ్ ! పెంచుకున్న వేడి అంతా చ‌ల్లారిపోతుంది. కాల్ లో సంభాష‌ణ మామూలుగా అయిపోతుంది. ఇలాంటి సంద‌ర్భం ఎప్పుడో ఒక‌సారి ఎదురై ఉంటుంది. పైకి చెప్ప‌రు కానీ మీరు ఇలా చేసి ఉంటారు.

అందానికి మాట త‌డ‌బ‌డి

అందానికి మాట త‌డ‌బ‌డి

ఏదో విష‌య‌మై అప్‌సెట్ అయి ఇంటికి వ‌స్తారు. మీ భార్య‌కు ఆ విష‌యం చెప్పాల‌ని సీరియ‌స్‌గా అనుకుంటారు. ఏదో చెప్పాల‌ని మొద‌లుపెట్ట‌గానే స‌డెన్‌గా మీ భాగ‌స్వామి అంద‌చందాల‌కు ముగ్ధులైపోతారు. అస‌లేం చెప్పాలో కూడా మ‌ర్చిపోయి త‌దేకంగా చూస్తూనే ఉంటారు. మీలో కొంటెత‌నం బ‌య‌ట‌కి వ‌స్తుంది. చెప్ప‌రు కానీ ఇలా మీకూ జ‌రిగే ఉంటుంది.

మీ రాశిని బట్టి మీరు ఎంత రొమాంటిక్ గా ఉంటారో తెలుసా ??

త‌ల‌నొప్పి మాయం చేస్తాన‌నే నెపంతో

త‌ల‌నొప్పి మాయం చేస్తాన‌నే నెపంతో

మీ భార్య ఇంటికి వ‌స్తూనే త‌ల‌నొప్పి అని అంటే ప్రేమ‌గా ద‌గ్గ‌ర‌కి తీసుకొని హెడ్‌ మ‌సాజ్ చేయ‌డం మొదలుపెడ‌తారనుకుందాం. అంత‌టితో ఊరుకుంటారా! మెల్ల‌గా మీ చేతులు మెడ‌చుట్టూ గిల్లిక‌జ్జాలు ఆడ‌తాయి. ఆ త‌ర్వాత తాక‌రాని చోట‌ల్లా తాకే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ! ఇందులో కూడా అంత‌ర్లీనంగా రొమాన్స్ దాగి ఉంది. ఆమె మీ వైపు కోపంగా చూస్తే అప్పుడు మీరు చిన్న‌గా న‌వ్వి భావ‌ప్రాప్తి కూడా త‌ల‌నొప్పిని మాయం చేయ‌గ‌ల‌దని చెప్పి కన్నుగీటి ప్రేమ‌గా మాట్లాడే అవ‌కాశాన్ని క‌ల్పించుకుంటారు.

పొగ‌డ్త‌లతో...

పొగ‌డ్త‌లతో...

సాధార‌ణంగా మీరు ఏ విష‌యాన్ని అంత ఈజీగా మెచ్చుకోరు. అయితే కొన్ని సార్లు మీ భార్య‌ను ఏ కార‌ణం లేకుండానే మెచ్చుకుంటారు. ఒక్కోసారి మీకే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. ఎందుకు అంత‌గా ఆమెను పొగుడుతున్నార‌ని . ఆమె అందంపై క‌విత్వాన్ని అప్ప‌టిక‌ప్పుడే అల్లేస్తుంటారు. అదేమిటంటే మీరు బాగా హార్నీగా మారిపోయి ఉండ‌వ‌చ్చు. మీలో విప‌రీత‌మైన శృంగార‌ వాంఛ పెరిగిపోతుండొచ్చు. మీలో చెల‌రేగిన ఆ అల‌జడి మిమ్మ‌ల్ని అలా మాట్లాడేలా చేస్తుంది.

ట‌వ‌ల్ అడిగిన‌ప్పుడు

ట‌వ‌ల్ అడిగిన‌ప్పుడు

మీ భార్య ట‌వ‌ల్ తీసుకోకుండానే బాత్రూమ్‌కు వెళ్లింద‌నుకుందాం. స్నానం చేశాక కానీ తెలీదు ట‌వ‌ల్ మ‌ర్చిపోయాయ‌ని. అప్పుడామె చిన్న‌గా తలుపు తెరిచి .. ఏవండి కాస్త ట‌వ‌ల్ ఇస్తారా అని అడుగుతోంది. అదే అద‌నుగా మీరు ట‌వ‌ల్ ఇవ్వ‌బోయి బాత్రూమ్ లోప‌లికి దూరాలనుకుంటారు. ఆమె అంద‌చందాల‌న్నీ త‌నివి తీరా చూడాల‌నుకుంటారు. ఆమె అదేమీ గ‌మ‌నించ‌కుండా ఆమె ముఖం మీదే త‌లుపు వేసే ప్ర‌య‌త్నం చేస్తే స‌డెన్‌గా మీ వేలు త‌లుపు సందులో ఇరుక్కుందా! అయ్యో ఇలాంటి ప‌రిస్థ‌తి మీలో ఒక్క‌రికైనా ఎదురై ఉంటుంది.

ఆమె ఒంట‌రిగా ఉన్నాన‌ని బాధ‌ప‌డుతుంటే..

ఆమె ఒంట‌రిగా ఉన్నాన‌ని బాధ‌ప‌డుతుంటే..

మీరు ప‌నిలో ఉండ‌గా మీ భార్య కాల్ చేసి తాను ఒంట‌రిగా ఫీల్ అవుతున్నాని బాధ‌ప‌డుతుంటే మీరు ఆమెను స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేస్తారు క‌దూ! అప్పుడు మీరు ఒక డార్క్ చాకొలెట్ తీసుకొని దాన్ని మిమ్మ‌ల్ని త‌ల్చుకుంటూ నాక‌మ‌ని చెబితే ఆమెకు ఏదో గుర్తొచ్చి ప‌డీ ప‌డీ న‌వ్వుతుంటే దాన్ని క‌వ‌ర్ చేసుకోవ‌డానికి మీరు చాక్లెట్ తింటే మెద‌డు చురుకుగా త‌యార‌వుతుంద‌ని చెప్పి క‌న్విన్స్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. రొమాన్స్ ఇలా కూడా ప్రారంభ‌మ‌వుతుంది.

మీరు ప‌డుకున్న‌ప్పుడు...

మీరు ప‌డుకున్న‌ప్పుడు...

మీరు ప‌డుకున్న‌ప్పుడు స‌డెన్‌గా మేలుకొని చూస్తే ఎదురుగా మీ భాగ‌స్వామి మిమ్మ‌ల్నే క‌న్నార్ప‌కుండా చూస్తున్నాడ‌ని తెలుసుకొని సిగ్గుప‌డ‌తారు క‌దా! ఇలా ఎప్పుడైనా జ‌రిగింది?

ఇలా కొన్ని సంద‌ర్భాలు ప్ర‌తి జంట త‌మ‌కు అనుకూలించుకోవ‌చ్చు. కొత్త జంట అనోన్యంగా ఉండి త‌ర్వాతి ద‌శ‌కు త‌మ మాధుర్య‌పు బంధాల‌ను తీసుకెళ్ల‌గ‌లిగితే వివాహ జీవితం మ‌ధుర‌మ‌యం అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

జ్యోతిష్యశాస్త్రంలో ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ సెక్షన్ ను ఫాలో అవండి.

Image Source

English summary

Romantic Situations Every Couple Can Relate To!

If you have started a new relationship recently or if you have married recently, you will be able to relate to certain examples of real life romantic situa
Subscribe Newsletter