For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమలో పడిన అమ్మాయిలు వారి అలవాట్లను ఎందుకు మార్చుకుంటారు ?

|

అమ్మాయిలైన మనము, మనల్ని ప్రేమలోకి దించే ఆ ప్రత్యేకమైన వ్యక్తిని కలిసేందుకు గాను తరచుగా అన్వేషిస్తూ ఉంటాము. ఎవరైతే మనల్ని అర్థం చేసుకొని, మన మాటలను వినే ఆ వ్యక్తి కోసం.

మనలో చాలామంది, అలాంటి ప్రేమ కథకు సంబంధించిన ఖచ్చితమైన ఆలోచన కోసం, మన చిన్నప్పటి నుండి లెక్కలేనన్ని బాలీవుడ్ సినిమాలను చూస్తూ ఉంటాము. అలాంటి సరైన వ్యక్తిని అనుకోకుండా కలుసుకొని, తొలిచూపులోనే వారితో ప్రేమలో పడితే - అనేటట్లుగా అమ్మాయిలు చాలామంది కలలను కంటూ ఉంటారు.

ప్రేమలో పడటం అనేది చాలా అద్భుతమైన భావన. మీ ప్రియుడిని చూసిన ప్రతిసారీ కలిగే అనేక భావనలతో కలసిన అనుభవాలను తరచుగా ఆస్వాదిస్తారు. ఉదాహరణకి అవి :- 1) మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, 2) మీ కడుపులోని సీతాకోకచిలకలు ఉన్నట్లుగా మరియు 3) మీ చేతిలో ఉన్న పనుల మీద సరైన దృష్టిని పెట్టలేరు. పగటికలలు చాలా ఎక్కువగా పెరుగుతాయి మరియు, ఆలోచనలను కోల్పోయిన వారిగా మిమ్మల్ని - మీ సన్నిహితులు గుర్తిస్తారు. కానీ ఇలాంటి భావనలు వెనుక ఒక శాస్త్రీయ కారణం దాగి ఉందని మీకు తెలుసా ?

why do girls change their habits after they fall in love | signs that shows a girl is in love

ప్రేమలో పడటం వల్ల మెదడులో క్రియాశీలక కేంద్రంగా పనిచేసే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు అనేవి కొకైన్ వ్యసనం వంటి సాధారణమైన సంబంధాలను కలిగి ఉంటాయని అధ్యయనంలో తేలింది. ఈ కారణంగానే ప్రేమనేది వ్యసనంతో కూడిన భావనగా చెబుతున్నారు. మనము ప్రేమలో ఉన్నప్పుడు, మన శరీరంలో ఆక్సిటోసిన్ - సంతోషకరమైన హార్మోన్లు, అడ్రినలిన్ - ఉత్సాహాన్ని ప్రేరేపించే హార్మోను మరియు వాసోప్రెసిన్ - ప్రాదేశిక హార్మోను వంటి రహస్య హార్మోన్లు ప్రభావితం చెందుతాయి. ప్రేమలోని అన్ని భావనలతో కూడిన రకరకాల అనుభూతులకు ఈ హార్మోన్లే కారణం.

అయితే అమ్మాయిలు ప్రేమలో ఉన్నప్పుడు మాత్రం వేరొక ప్రపంచంలో ఉంటారు. ప్రేమ అనేది అన్నింటినీ మారుస్తుందని వి వారు తరచుగా చెబుతుంటారు. ప్రేమలో ఉన్న అమ్మాయిలు వారిలో చాలా వరకూ వచ్చే మార్పులను చూస్తూ ఉంటారు. ఆ మార్పులకు కారణం, వారి యొక్క భాగస్వామి కోసం వారు పొందే రకరకాల భావోద్వేగాలే ! మీరు కూడా ప్రేమలో ఉన్నట్లయితే ఈ మార్పులకు సంబంధయితే ఈ మార్పులకు సంబంధించిన అనుభవాన్ని మీరు కూడా కలిగి ఉంటారు. ముందు చెప్పిన వ్యక్తుల వలె మీరు కూడా ఉన్నట్లయితే, అలాంటి భావనలే మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తాయి. చింతించకండి - మీరు మార్చ బడలేదు. ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీ జీవితంలోనికి ఎదురైనప్పుడు మీ ప్రవర్తనలో కలిగే చిన్న మార్పులు సర్వ సాధారణమైనవి.

మన లాంటి అమ్మాయిలు ప్రేమలో ఉన్నప్పుడు, కొన్ని మార్పులు అనేవి చాలా సాధారణమైనవి. మీరు ఇంతకుముందు ఇష్టపడిన వాటిని ప్రస్తుతము ఇష్టపడలేరు. నటనా పరమైన సినిమాలను చూసేవారు కాస్త రోమాంటిక్ సినిమాలో వైపుకి ఆకర్షితులవుతారు. మీరు పూర్తి బిజీగా ఉన్న రోజుల్లో కూడా లాంగ్ డ్రైవ్కి వెళ్లే ఆలోచనని కలిగి ఉంటారు. మీ భాగస్వామిని కలుసుకోవడానికి ఉత్తమమైన సమయం రాత్రుళ్లు కాబట్టి ఆ రాత్రంతా మీరు మెలకువగానే గడుపుతారు. మీ భాగస్వామికి తగిన విధంగా మీ ప్రాధాన్యతలను నెమ్మదిగా మార్చుకుంటారు. అయితే ఇవన్నీ కూడా మీ భాగస్వామితో సత్సంబంధాలను మెరుగుపరచుకొని, మీ మధ్య సర్దుబాట్లను - అవగాహనను పెంచుకొని మీ బంధాన్ని మరింత దృఢంగా చేయటం కోసం.

ఇవన్నీ కూడా వాస్తవం నుండి మిమ్మల్ని ఎక్కడికో తీసుకు వెళ్ళే చిన్న మార్పులుగా ఉంటాయి, కానీ అవి నిజానికి మీరు ప్రేమలో ఉన్నప్పుడు కలిగే అనుభూతులు మాత్రమే. మీ జీవితంలో గడిపే ప్రతిక్షణం ఆ ప్రత్యేకమైన వ్యక్తితోనే ఉండేటట్లుగా కలలను కంటూ ఉంటారు. అలాంటి చాలా భావోద్వేగాలు మన మెదడులో చాలానే తిరుగుతూనే ఉంటాయి.


ఈ క్రింది చెప్పబడిన మార్పులు మీలో గాని ఉన్నట్లయితే,

"కంగ్రాచ్యులేషన్స్" మీరు నిజంగానే ప్రేమలో ఉన్నారు !!


1. రోమాంటిక్ సాంగ్స్ను ఎక్కువగా వింటారు :

1. రోమాంటిక్ సాంగ్స్ను ఎక్కువగా వింటారు :

మీరు ప్రేమలో ఉన్నప్పుడు ఎక్కువగా రొమాంటిక్ సాంగ్ ను ఎందుకు వింటారు అని ఆలోచిస్తున్నారా ? ఎందుకంటే మనము ఉన్న పరిస్థితిని ప్రతిబింబించేలా ఈ పాటలు ఉంటాయి. అందువల్ల, మనము వాటిని తరచుగా వినడానికి ఇష్టపడతాము.

2. పగటి కలలు :

2. పగటి కలలు :

ప్రేమలో ఉన్నవారికి ఈ అనుభవం సర్వసాధారణమైనది. మీరు చేసే పనిమీద ఎక్కువ దృష్టిని కలిగి ఉన్న వారైతే, మీకు కావలసిన వ్యక్తి గురించి తరచుగా పగటి కలలు కనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా జరగడానికి కారణం ఏమంటే, మనం తరచుగా ఆ వ్యక్తిని గూర్చి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఈ పగటి కలలకు దారితీసే అవకాశం ఉంటుంది.

3. సామాజిక మాధ్యమాలకు / స్నేహితులకు దూరంగా ఉండటం :

3. సామాజిక మాధ్యమాలకు / స్నేహితులకు దూరంగా ఉండటం :

మీరు మీ స్నేహితులతో సమావేశమవ్వడానికి తగిన సమయాన్ని కలిగి ఉంటారు, కానీ ఇప్పట్నుంచే మీ భాగస్వామితో కొంత సమయాన్ని గడపాలని కోరుకుంటారు. మీ గ్రూపులో మీరే చలాకీ వ్యక్తిగా వుంటూ, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళే అన్ని రకాల ప్లానింగ్స్ ను మీరే చూసుకునే వారైతే - మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా మిస్సవుతాన్నారు, అలాగే మీ ఫ్రెండ్స్ కన్నా - మీ భాగస్వామికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని కూడా వారంతా భావిస్తుంటారు.

4. అధికముగా ఇష్టాన్ని కలిగి ఉండటం :

4. అధికముగా ఇష్టాన్ని కలిగి ఉండటం :

మీరు ప్రేమలో ఉన్నప్పుడు, మీ భాగస్వామి మీతోనే ఉండాలని, మీ కోసమే ఆలోచిస్తూ ఎక్కువ శ్రద్ధను కలిగి వుండాలని మీరు కోరుకుంటారు. మన కోసమే తప్ప ఇంకెవరి కోసం ఆలోచించాలన్న ఆలోచనను మనము కలిగి ఉంటాం. ఈ రకమైన భావన కొత్తగా అనిపించినా ప్రేమలో ఉన్నవారికి ఇలా అనిపించటం సర్వసాధారణం.

5. మీ అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ :

5. మీ అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ :

మీ సౌందర్యం పై మీకు శ్రద్ధ లేకపోయినా కూడా, ఒకసారి మీరు ప్రేమలో పడ్డాక, మీ భాగస్వామిని ఆకట్టుకోవడం కోసం మీ సౌందర్యంపై అధికమైన శ్రద్ధను చూపించేందుకు ఆసక్తిని కలిగి బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతూ వుంటారు. ఎందుకంటే, ఏ సమయంలో అయినా మీ భాగస్వామికి మీరు గొప్పగా (అందంగా) కనబడాలని మీరు కోరుకుంటారు. దీనివల్ల మీరు కోరుకునే వ్యక్తికి ఇతరుల కన్నా మీ మీద ఎక్కువ ధ్యాసను కలిగి ఉంటారు.

6. కొత్త మార్గంలో ప్రయాణించడం :

6. కొత్త మార్గంలో ప్రయాణించడం :

మీరు ఎక్కువగా ఇంట్లో ఉండే వ్యక్తి గాని అయితే, మీ భాగస్వామి సాహసోపేతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే, మీరు ఆ వ్యక్తిని సంతోషపరిచేందుకు ఏదైనా చేయాలనుకుంటారు. బయట ప్రదేశంలో మీ స్నేహితులతో మీరేప్పుడూ చెయ్యలేని సాహస కృత్యాలను - మీకు వీలున్నంత వరకు చేసేందుకు ప్రయత్నిస్తారు. మనకు అసాధ్యమైన పనులను కూడా "ప్రేమ" చేయించగలదు.

 7. దుస్తులపై ప్రత్యేక శ్రద్ధ :

7. దుస్తులపై ప్రత్యేక శ్రద్ధ :

ప్రేమలో పడిన అమ్మాయిలు, ప్రేమికుడికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని పరిశీలనగా గమనిస్తూనే ఉంటారు. మీ భాగస్వామికి, అమ్మాయిలు ధరించే వస్త్రాలంకరణ మీద ఒక ప్రత్యేకమైన అభిరుచి కలిగి ఉంటే, మీ భాగస్వామి యొక్క అభిరుచికి అనుగుణంగా మీ యొక్క దుస్తుల ప్రాధాన్యతను మార్చుకుంటారు మీ భాగస్వామి యొక్క దృష్టిని ఆకర్షించేందుకు అది చాలా సహాయపడుతుంది. దీని వల్ల మీ మధ్య బంధం సజీవంగా ఉంటూ, దీర్ఘకాలం కొనసాగటానికి అనుకూలమైన మార్గంగా ఉంటుంది.

8. మీయొక్క ఆహారం మరియు ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించడం :

8. మీయొక్క ఆహారం మరియు ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించడం :

మీరు ఒక సంబంధం లోనికి ప్రవేశించిన తర్వాత మీ ఆరోగ్యం మీద మరింత శ్రద్ధ వహిస్తూ, మీ భాగస్వామికి అందంగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సమయంలోనే మీరు మీ తీసుకునే ఆహారము పట్ల మరియు మీ బరువు గురించి మరింత అవగాహనను కలిగి ఉంటారు.

మీరు ప్రేమలో పడిన తరువాత ఇలాంటి అలవాట్లు మీకు తెలిసో - తెలియకో జరుగుతూ ఉండవచ్చు. మీరున్న విధానం బట్టే మీ భాగస్వామి మిమ్మల్ని ఇష్టపడుతారు, ఈ విషయం మీకు మీరుగా ఏవిధమైన సహాయమును చేసుకోలేరు. ఈ విధంగా మీరు మీ కోసం కంటే, అవతల వ్యక్తి కోసం ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. మీరు కోరుకునే భాగస్వామి దృష్టిలో మీరు పరిపూర్ణమైన వ్యక్తిగా కనపడాలని కోరుకుంటాము, మరియు వారికి ఇష్టపడన విషయాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం, అలా మనకున్న అలవాట్లలో కొన్ని మార్పులను చేస్తూ ఉంటాము. అదే ప్రేమకు గల శక్తి.


English summary

why do girls change their habits after they fall in love | signs that shows a girl is in love

Studies have shown that being in love activates those centers of the brain which are commonly associated with addiction to cocaine. This is why they say that love is an addictive feeling.
Story first published:Tuesday, November 28, 2017, 13:11 [IST]
Desktop Bottom Promotion