For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నా మరదలిని పెళ్లి చేసుకోబోయే అతడికి అసలు విషయం చెప్పా, తాళి కట్టకుండా వెళ్లిపోయాడు..

|

నా మరదలితో నా ప్రేమ కథల గురించి mystory317(ఇక్కడ క్లిక్ చేయండి), #mystory319 (ఇక్కడ క్లిక్ చేయండి) చదివితే మీకు ఇప్పుడు నేను చెప్పబోయే కథ అర్థం అవుతుంది.

నా మరదలు గౌరీకి వాళ్ల నాన్న నిశ్చితార్థం పూర్తి చేశాడు. పెళ్లికొడుకు యూఎస్ కు వెళ్లానున్నాడని తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత మా అమ్మ చాలా బాధపడింది. మా అన్నయ్యకు ఇప్పటికీ నాపై కోపం తగ్గలేదనుకుంటా.

నేను చేసిన తప్పుకు

నేను చేసిన తప్పుకు

అప్పుడు నేను చేసిన తప్పుకు ఇప్పుడు నువ్వు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుందంటూ ఏడ్చింది. అమ్మ చెక్కిళ్లపై ఉన్న కన్నీటీ చుక్కలను తుడుస్తూ.. నువ్వు ఏమీ బాధపడకమ్మా.. మామయ్యను ఒప్పించే నేను ఈ పెళ్లి చేసుకుంటానన్నాను.

గౌరీ మొబైల్ స్విచ్ఛాప్

గౌరీ మొబైల్ స్విచ్ఛాప్

ఎలా రా.. ఆల్రెడీ ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీ మామయ్య అస్సలు తన నిర్ణయం మార్చుకోడు అంది. నా ప్రేమ స్వచ్చమైనది.. కచ్చితంగా గెలుస్తుంది అని చెప్పాను. గౌరీ మొబైల్ స్విచ్ఛాప్ వచ్చింది. నాకు ముందే తెలుసు తన నుంచి వాళ్ల నాన్న మొబైల్ లాక్కుని ఉంటారని.

గౌరీ వాళ్ల ఊరికెళ్లాను

గౌరీ వాళ్ల ఊరికెళ్లాను

అదే రోజు రాత్రి నా ఫ్రెండ్ తో కలిసి బైక్ పై గౌరీ వాళ్ల ఊరికెళ్లాను. ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి గౌరీ రూమ్ లోకి వెళ్లాను. కానీ గౌరీ అక్కడ లేదు. అంతా వెతికి చూశాను. ఎక్కడా కనపడలేదు. ఎక్కువ సేపు అక్కడే ఉంటే మా మామయ్యకు దొరికిపోతానని అనిపించింది.

గౌరీ ఫ్రెండ్ కు ఫోన్ చేశా

గౌరీ ఫ్రెండ్ కు ఫోన్ చేశా

వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి రిటర్న్ బయల్దేరాను. మరుసటి రోజూ గౌరీ ఫ్రెండ్ కు ఫోన్ చేశాను. తను అన్ని డిటేల్స్ చెప్పింది. గౌరీని వాళ్ల అమ్మమ్మ వాళ్ల ఊరికి పంపించారు పెళ్లి అయ్యేంత వరకు తను అక్కడే ఉంటుందని చెప్పింది. ఆ ఊరి డిటేల్స్ మొత్తం తెలుసుకుని అక్కడికి బయల్దేరాను. ఉదయం పూట అంతా రిక్కీ నిర్వహించాను.

Most Read :బావ అని పిలవగానే నరనరాల్లో కరెంట్ పాస్, మేనమామ కూతురితో ముద్దుల దాకా యవ్వారం #mystory317

అర్ధరాత్రి గౌరీ వాళ్ల అమ్మమ్మ ఇంట్లోకి

అర్ధరాత్రి గౌరీ వాళ్ల అమ్మమ్మ ఇంట్లోకి

అర్ధరాత్రి గౌరీ వాళ్ల అమ్మమ్మ ఇంట్లోకి వెళ్లాను. గౌరీ వాళ్ల సొంత ఇళ్లు అయితే నాకు తెలుసు కాబట్టి లోపలకి ఈజీగా వెళ్లగలిగాను. కానీ వాళ్ల అమ్మమ్మ ఇంట్లోకి దొంగదారిన ఎలా వెళ్లాలో నాకు తెలియకపోవడంతో చాలా ఇబ్బందులుపడ్డాను. అందులో ఆ ఇళ్లు ఒక పెద్ద కోటలాగా ఉంది.

నోరును గట్టిగా మూశాను

నోరును గట్టిగా మూశాను

మొత్తానికి చాలా ఇబ్బందులుపడి గౌరీ బెడ్రూమ్ లోకి వెళ్లగలిగాను. గౌరీని నిద్రలో నుంచి లేపాను. తను షాక్ అయ్యింది. దొంగ అనుకుని భయపడింది. తన నోరును గట్టిగా మూశాను. తర్వాత తను నన్ను గుర్తిపట్టిన తర్వాత అసలు విషయం చెప్పాను.

మేనమామలు ఫ్యాక్షనిస్ట్ లు

మేనమామలు ఫ్యాక్షనిస్ట్ లు

తను నన్ను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చింది. "బావ నేను నిన్ను తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోను అంది. కానీ మా నాన్న నాకో ఇంకో సంబంధం చూశాడు.. నేను ఎక్కడ నీతో లేచిపోయి వస్తానో అని నన్ను ఇక్కడ ఉంచాడు. మా తాతయ్య కుటుంబం చాలా డేంజర్ బావ... మా మేనమామలు ఫ్యాక్షనిస్ట్ లు... దయజేసి నువ్వు ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో" అంది.

నీ పెళ్లి నాతోనే జరుగుతుంది

నీ పెళ్లి నాతోనే జరుగుతుంది

సరే గౌరీ నీ పెళ్లి ఎలా అయినా సరే కచ్చితంగా నాతోనే జరుగుతుంది. నువ్వేమీ భయపడకు. ధైర్యంగా ఉండు.. మీ బావ వస్తాడు నీ మెడలో తాళి కడతాడు అని చెప్పాను. తర్వా త అక్కడి నుంచి వచ్చేశాను.

Most Read :నా మరదలితో చాలా కెమిస్ట్రీ నడిచింది, అమ్మ లేచిపోవడంతో మామయ్యకు నచ్చలేదు, వేరొకరితోపెళ్లి #mystory319

పెళ్లి చేసుకోబోయే అతన్నే కలిశా

పెళ్లి చేసుకోబోయే అతన్నే కలిశా

ఆ తర్వాత గౌరీతో ఎంగేజ్ మెంట్ అయిన అబ్బాయి డిటేల్స్ తెలుసుకున్నాను. తనను కలిశాను. తనకు నా స్టోరీ మొత్తం చెప్పాను. తను అర్థం చేసుకున్నాడు. నువ్వు ఏమీ భయపడకు బ్రో.. మీ ప్రేమలో సిన్సియార్టీ ఉంది. మీ పెళ్లి జరిగేలా నేను చూస్తాను అని భరోసా ఇచ్చాడు.

గౌరి వాలింటికి వెళ్లా

గౌరి వాలింటికి వెళ్లా

ఆ పెళ్లి కొడుకు పెళ్లి కొన్ని రోజుల ముందే తను ఎవరికీ చెప్పకుండా అమెరికా వెళ్లిపోయాడు. దీంతో మామయ్య ఆవేశంతో ఊగిపోయాడు. తర్వత వేరే వాళ్లతో నాకు ఫోన్ చేయించి నన్ను వాళ్ల ఇంటికి పిలిపించాడు. వెంటనే నేను గౌరి వాలింటికి వెళ్లాను. మన ప్లాన్ సక్సెస్.. ఇప్పుడు మీ నాన్నను ఒప్పిద్దాం అని గౌరీకి చెప్పాను.

నువ్వే నా కూతుర్ని పెళ్లిచేసుకోవాలి

నువ్వే నా కూతుర్ని పెళ్లిచేసుకోవాలి

మామయ్యే నా దగ్గరకు వచ్చి.. అల్లుడు ఏమీ అనుకోకు. బయట వాళ్లని నమ్మి మోసపోయాను. నువ్వే నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అన్నాడు. సరే మామయ్య.. మీరు అంతగా బతిమిలాడుతుంటే నేను ఎందుకు కాదంటాను అన్నాను. అలా మా ప్రేమ గెలిచింది.

అతనే మా ప్రేమను గెలిపించాడు

అతనే మా ప్రేమను గెలిపించాడు

మొత్తానికి నేను నా మరదలు గౌరీని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మా రెండు కుటుంబాలు కలిశాయి. ఇదంతా నా గొప్పతనం నేను గౌరీకి చెప్పలేదు. నీతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న అబ్బాయి దేవుడిలా మన ప్రేమను గెలిపించాడు... అతని వల్లే మన ప్రేమ గెలిచింది అని గౌరీ అసలు విషయం చెప్పాను.

Most Read :నా భర్త ఎంత కోఆపరేట్ చేసినా ఏమీ చేయలేడు, రెండు నిమిషాలకే ఔట్, నా సీక్రెట్స్ చెప్పేసింది #mystory315

రాసి పెట్టి ఉంటేదక్కుతుంది

రాసి పెట్టి ఉంటేదక్కుతుంది

మనకు రాసి పెట్టి ఉంటే కచ్చితంగా దక్కుతుంది. లేదంటే లేదు అనే సిద్దాంతాన్ని నేను ఎక్కువగా నమ్ముతాను. నాకు గౌరీతో పెళ్లి రాసి పెట్టి ఉందని తనని చూసిన క్షణంలోనే అనిపించేది. అదే నిజమైంది. తను చేసుకున్నాక నా జీవితం మొత్తం మారిపోయింది. ఫుల్ హ్యాపీగా ఉన్నాను.

English summary

I Finally Married My True Love

I Finally Married My True Love