Latest Updates
-
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి -
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు! -
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.!
ప్రియుడున్నాడు... ఐనా కొలీగ్ పైన మనసు మళ్లింది!
లైఫ్‌లో చాలా విషయాలు మన కంట్రోల్‌లో ఉండవు. అలాంటివాటిలో ఫీలింగ్స్ ఒకటి. ఎవరితోనైనా ప్రేమలో పడడం, ద్వేషించడం మన చేతుల్లో లేదు. ఒక వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే వీటిని మనం కంట్రోల్ చేయలేం. ఇలాంటి సంఘటనే నాకు ఎదురైంది. నాకు ప్రియుడున్నాడు. మేమిద్దరం కొంతకాలంగా కమిటెడ్‌గా ఉన్నాం. మా ఇద్దరికీ భవిష్యత్ ప్రణాళికలున్నాయి. మాది చూడముచ్చటైన జంట అని స్నేహితులంతా పొగుడుతుంటారు. ఐతే ఇది ఎలా మలుపు తిరిగిందో చూద్దాం..

అలా మొదలైంది...
కొంత కాలంగా ఆఫీసులో పని ఒత్తిడి బాగా పెరిగిపోయింది. లేట్ నైట్స్ చాలా కామన్ అయిపోయాయి. ఎక్కువ సేపు కొలీగ్స్‌తోనే గడపాల్సి వచ్చేది. ఆఫీసు రెండో ఇంటిలా మారిపోయింది. దీంతో మా టీమ్‌లోని వాళ్లం మంచి స్నేహితులమైపోయాం.

ఓ మై ఫ్రెండ్
ఆఫీసులో ఒక స్నేహితుడు దొరికాడు. ఒత్తిడినంతా పోగొట్టి పని వేళలను హుషారెత్తించేవాడు. లంచ్, డిన్నర్, కాఫీ బ్రేక్ ఎప్పుడైనా సరే అతడితో కలిసి వెళ్లిపోయేదాన్ని. ఆఫీసు అయిపోయాక కూడా వర్క్, లైఫ్ గురించి ఇద్దరి మధ్య సంభాషణ కొనసాగేది. అతడు కేవలం స్నేహితుడు. దీంట్లో తప్పేముంది!

ప్రేమలో పడ్డానా
మూడు నెలల పాటు ఆఫీసులో అతడితో గడిపాక వీకెండ్స్‌లోనూ అతడితోనే టైమ్ స్పెండ్ చేయాలనిపించింది. స్పీడ్ డయల్ లిస్ట్‌లో అతడి పేరు ఉండేది. లైఫ్‌లో చల్లని గాలిలా అతడు అనిపించేవాడు. ప్రేమలో పడ్డానేమో అనిపించింది.

మోసం చేస్తున్నానా?
ఆ తర్వాత కొన్ని రోజులకు గిల్టీగా అనిపించింది. నాకు ఆల్రెడీ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అతడితో పెళ్లి చేసుకోబోతున్నాను. మరి ఆఫీసు కొలీగ్‌తో ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్న ప్రేమ సంగతి? నా ప్రియుడితో ఈ విషయం చెప్పాలా? నేను మోసం చేస్తున్నానేమో అనిపించింది. చెప్పకుండా ఆఫీసు కొలీగ్‌తోనే ఎక్కువ సమయం గడుపుతుంటే నా ప్రియుడితో సంబంధం మాటేంటి? ఇలాంటి ఆలోచనలు ప్రతి క్షణం వేధించేవి.

ఏం చేశానంటే..
ఒక రోజు దీర్ఘంగా శ్వాస తీసుకొని బాగా ఆలోచించాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క విషయం మాత్రం క్లియర్‌గా అర్థమైంది. నా కొలీగ్‌తో నాకున్న బంధం కేవలం ఆకర్షణే అని తేలిపోయింది. ఆన్‌లైన్‌లోనూ ఇలాంటి కథనాలు చదివాను. ఒకరితో సంబంధంలో ఉండగా మరొకరిపై క్రష్ కలగడం సహజమేనని అనిపించిది. ఐతే దీనికి హద్దులంటూ గీసుకోవాలి అని అర్థమైంది.

100% లవ్ మాది
ప్రేమకు, ఆకర్షణకు మధ్య సన్నని గీతుంటుంది. అది తెలుసుకునే సమయం వస్తుంది. ఆఫీసు కొలీగ్ పైన గౌరవ భావం ఉంది అయితే మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాను. నా ప్రియుడితో సరైన సమయం గడపలేకపోయినందుకే ఇలాంటి ఆలోచనలన్నీ చుట్టుముట్టాయని అనిపించింది. మధ్యలో కలిగే ఇలాంటి ఆకర్షణలన్నీ తాత్కాలికమే అనిపించింది.

ఈ రోజు ఇలా...
నా ప్రియుడితో అనుబంధాన్ని మరింత బలపర్చాలనుకున్నాను. అతడితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాను. ఆ తర్వాత పరిస్థితులు మామూలుగా అయిపోయాయి. ఒకరిపైన క్రష్ ఏర్పడిందన్న సంగతి కూడా కొద్ది రోజులకే మర్చిపోయాను. అయితే ఈ విషయం మా ప్రియుడితో చెప్పానా? అంటే కాదు. ఇప్పుడు తను ప్రశాంతంగా ఉన్నాడు. ఆ విషయాలన్నీ చెప్పి లేనిపోని అపోహలు తీసుకురావడం దేనికని ఆగిపోయాను.
లైఫ్‌లో ఇలాంటివి జరుగుతుంటాయి. శాశ్వతమైన ప్రేమను గుర్తించి ముందుకు వెళ్లడమే మనలోని వివేకాన్ని తెలుపుతుంది.



Click it and Unblock the Notifications