ఆమె నాకు సర్వం సమర్పించింది.. కానీ నా జీవితాన్ని సంకనాకిచ్చింది - My Story #50

Written By:
Subscribe to Boldsky

నాన్నతో పాటు నాకు అనురాధ కూడా ఒక మరుపురాని జ్ఞాపకం. నాన్న కోసం నేను ఏం చేసిన తక్కువే. నాకు జీవితాన్ని ఇచ్చాడు. జీవితంలో ఎలా బతకాలో నేర్పాడు. చిన్నప్పుడు తప్పటడుగులు వేయకుండా చూశాడు. పెద్దగయ్యాక నేను వేసిన ప్రతి అడుగు విజయం వైపు దూసుకెళ్లాలా నాకు అండగా నిలిచాడు. నా కథ మొదలైంది నాన్నతోనే... నా కథ పూర్తయ్యేది కూడా నాన్న జ్ఞాపకాలతోనే.

పుట్టినప్పటి నుంచే

పుట్టినప్పటి నుంచే

నా పేరు ఖాసిం. అందరూ కాశీ అంటారు. మా నాన్న మా ఊరి దర్గాలో మొక్కుకున్నందుకు పుట్టడంతో నాకు ఆ పేరు పెట్టాడు. పుట్టినప్పుడు మనకు ఏ ఆస్తులు లేకున్నా కూడా తల్లిదండ్రుల ప్రేమతో మనం చాలా ఆనందంగా ఉంటాం. కానీ నాకు పుట్టినప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి.

చిన్నచిన్న సరదాలు

చిన్నచిన్న సరదాలు

ప్రతి ఒక్కరు ఒకవైపు పీకల్లోతు కష్టాలతో ఇబ్బందులుపడుతున్నా మరో వైపు ఏదో చిన్నచిన్న సరదాలతో గడుపుతుంటారు. నేను కూడా అంతే. నా జీవితం కూడా ప్రతి క్షణం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నా.. చిన్నచిన్న ఆనందాలతో సంతోషపడేవాణ్ని.

ఆమె నన్ను కంటతడిపెట్టించింది

ఆమె నన్ను కంటతడిపెట్టించింది

నా స్కూల్ లైఫ్ మొత్తం కూడా ఏదో అలా తెలియకుండా గడిచిపోయింది. నాకు ఇద్దరు అక్కలు. ఒక అన్న. నన్ను మొట్టమొదట కంట తడిపెట్టించింది మా పెద్ద అక్క. పెద్ద అక్క అంటే ప్రాణం.

నా ప్రాణం అడ్డువేసేవాణ్ని

నా ప్రాణం అడ్డువేసేవాణ్ని

నన్ను చిన్నప్పుడు నా కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకునేది. నాకు గోరుముద్దలు తినిపించేది. నా కంట్లో కన్నీరు రాకుండా చూసుకునేది. నాకప్పుడు ఊహ తెలియకపోవొచ్చు కానీ.. మా అక్క తన కష్టాన్ని నాతో చెప్పి నా ప్రాణం అడ్డువేసుకునిగానీ కాపాడుకునేవాణ్ని.

జ్ఞాపకం వస్తే కన్నీరు ఆగదు

జ్ఞాపకం వస్తే కన్నీరు ఆగదు

మా అక్క అత్తారింటి ఆరళ్లకు తట్టులేకపోయింది. మా నాన్న ఒక్కమాట గట్టిగా మాట్లాడితేనే కన్నీరు కార్చేది.. అలాంటి అక్కను అత్తారింట్లో ఏమన్నారో నాకు తెలియదు కానీ ఇప్పటికీ అక్క జ్ఞాపకం వస్తే కంట్లో కన్నీరు సుడులు తిరుగుతుంది. ఇప్పటికీ ఆ బాధ మొత్తాన్ని నా గుండెల్లోనే ఉంచుకున్నాను.

ఓపిక పోయాక ఊపిరి వీడింది

ఓపిక పోయాక ఊపిరి వీడింది

మా పెద్ద అక్క అప్పటికే మూణ్నెళ్ల గర్భిణీ. మరికొన్ని రోజులుంటే పండంటి బిడ్డకు జన్మనిచ్చేది. అత్తగారింటి వేధింపులను తన ఓపిక ఉన్నంత వరకు మౌనంగా భరించింది. ఓపిక పోయాక.. తన గోడు ఎవ్వరికి చెప్పలేక ఊపిరి వీడింది. మా పెద్ద అక్క ఆత్మహత్య చేసుకుంది. తనకు ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకునే శక్తి లేని నాకు.. తనే దూరమై గుండె నిండా దుఖాన్ని మిగిల్చింది.

మనస్సు నవ్వి ఊరుకుంటుంది

మనస్సు నవ్వి ఊరుకుంటుంది

ఆ తెలియని బాధ ఇప్పటికీ నా గుండెల్లో అలాగే గూడుకట్టుకుని ఉంది. చిన్నప్పుడు సరదాలు ఏమి తెలియవు. కష్టాలు మాత్రం ప్రతి రోజు పలకరించేవి. చిన్నతనంలో ఏ ఒక్కరోజైనా సంతోషంగా ఉన్నానా? అని నేను ప్రశ్నించుకుంటే నా మనస్సు నవ్వి ఊరుకుంటుంది. అలా గడిచింది నా చిన్ననాటి జీవితం.

కళ్లలో కన్నీరు ఇంకిపోయింది

కళ్లలో కన్నీరు ఇంకిపోయింది

నాకు ఊహ తెలిశాక కూడా మళ్లీ ఎదురుదెబ్బే. మా కుటుంబానికి అండగా ఉన్న నాన్న మా అందరికీ దూరం అయ్యాడు. అప్పుడు నా కళ్లలో నుంచి కన్నీరు రాలేదు. ఎందుకంటే రోజూ ఏడ్చి ఏడ్చి నా కళ్లలో కన్నీరు ఇంకిపోయింది. నాన్న చనిపోయినా.. ఆయన నేర్పిన విలువలతో నేను ధైర్యంగా బతుకుతున్నా. సమాజంలో నాకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునేందుకు నాన్న నేర్పిన పాఠాలే నాకు ఆదర్శం.

కంటికి రెప్పలా చూసుకున్నా

కంటికి రెప్పలా చూసుకున్నా

ఏదైనా కష్టం వస్తే అన్నతో చెప్పుకుంటాం.. కానీ నాకు నా అన్ననే కష్టాలు తెచ్చేవాడు. ప్రతి క్షణం అతన్ని కంటికి రెప్పలా చూసుకునేందుకు కంటినిండా నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపానో నాకు తెలుసు.

నచ్చిన అమ్మాయితో పెళ్లి

నచ్చిన అమ్మాయితో పెళ్లి

మా అన్నకు నచ్చిన అమ్మాయితో మొదట పెళ్లి చేశాం. మా వదినను మేమంతా మా ఇంటి ఆడపడుచులా చూసుకున్నాం. కానీ ఆమెకు మా అమ్మ నచ్చలేదు. మా అమ్మ వ్యవహరించే తీరు అస్సలు నచ్చలేదు. కానీ ఆమె.. మేమందరం అండగా ఉన్న విషయాన్ని కూడా మరిచిపోయి అందరికీ దూరంగా అనంతలోకాలకు వెళ్లింది. మా ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది.

వాడి కంట్లో మాత్రం కన్నీరురాకుండా

వాడి కంట్లో మాత్రం కన్నీరురాకుండా

వదిన దూరమైనప్పుడు నేను ఎవర్ని నిందించాలో నాకు అర్థంకాలేదు. మా అన్న, మా మొదటి వదినలకు ఒక బాబు. వాడి కంట్లో మాత్రం కన్నీరురాకుండా చూసుకోవాలనుకుని ఆ రోజే నిర్ణయించుకున్నాను. నాకు నేనే మాట ఇచ్చుకున్నాను. ఈ రోజుకు అదే మాటపై కట్టుబడి ఉన్నా.

ఆమె కూడా పెద్ద వదినిలా కాకూడదని

ఆమె కూడా పెద్ద వదినిలా కాకూడదని

మా అన్నకు రెండో పెళ్లి చేశాం. ఆమె అందంగా లేదని.. ఆమెతో తాను కాపురం చేయలేనన్నాడు. మా మొదటి వదిన మాదిరిగా తన జీవితం కాకూడదని ఆమెతో విడాకులు ఇప్పించాం. మళ్లీ ఇంకో అమ్మాయితో మా అన్న వివాహం జరిపించాం. ఆమె ఉండగానే మా అన్న మరో అమ్మాయితో మా అన్న తన ప్రేమయాణం సాగించేవాడు.

అను అలా వచ్చింది

అను అలా వచ్చింది

ఎప్పుడు కష్టాలు.. కన్నీళ్లు మాత్రమే నన్ను పలకరించేవి. కానీ మొట్టమొదటి సారిగా ఒకసారి ఒక అమ్మాయి నన్ను పలకరించింది. ఆమె పేరు అనురాధ. ఆమె కూడా సమస్యతోనే నా దగ్గరకు వచ్చింది. మా చెల్లెల్ని మీ అన్న ప్రేమిస్తున్నాడు.. మీ అన్నకు పెళ్లయ్యింది కదా.. మళ్లీ మా చెల్లెలు ఎందుకంటూ ప్రశ్నిస్తూ.. రోదిస్తూ నా ముందు చేరింది.

అమ్మాయిలు జీవితంతో ఆడుకోకు

అమ్మాయిలు జీవితంతో ఆడుకోకు

ఆమె తన చెల్లెల్ని గోడు చెప్పుకునేందుకు నా వద్దకు వచ్చింది. నేను ఆమె గోడు విని మా అన్నతో మాట్లాడాను. అన్నా.. నీకు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఇక అమ్మాయిల జీవితంతో ఆడుకోకు అని చెప్పాను. ఇందులో ఏ మాత్రం నువ్వు నా మాట వినకున్నా నేను సహించను అన్నాను. మా అన్న కూడా అప్పుడు నా మాట విన్నట్లు నటించాడు. మళ్లీ అమ్మాయి జోలికి వెళ్లలేదు.

అప్పుడప్పుడు నుంచి ఎప్పుడెప్పుడు దాకా

అప్పుడప్పుడు నుంచి ఎప్పుడెప్పుడు దాకా

తర్వాత అనురాధ మా షాప్ కు వచ్చింది. తన చెల్లి విషయంలో నేను చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పింది. తను నా ఫోన్ నంబర్ ఎలాగో సంపాదించిందో తెలియదు. నాకు గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపింది. తర్వాత ఎవరా అని నేను కాల్ చేస్తే అనురాధ మాట్లాడింది. మొదట్లో ఆమె అప్పుడప్పుడు కాల్ చేసేది.. తర్వాత ఆమె ఎప్పుడు కాల్ చేస్తుందా అని ఎదురు చూసేలా నేను తయారయ్యాను.

పరిచయం ప్రేమ

పరిచయం ప్రేమ

నా జీవితంలో నేను కాస్త సంతోషంగా గడిపింది.. ఆనందంగా ఉండడం ప్రారంభమైనది తన పరిచయంతోనే. అప్పటి వరకు సమస్యలతోనే నేను సరదగా గడిపేవాణ్ని.. ఫస్ట్ టైమ్ నా లైఫ్ లోకి తను సరదాలు తీసుకొచ్చింది. నన్ను తన ప్రేమతో సంపేసింది. అలా మా పరిచయం.. కాస్త ప్రేమగా మారింది.

సంతోషాలు తీసుకొచ్చింది

సంతోషాలు తీసుకొచ్చింది

ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం అని మా మనస్సులకు తెలిసిపోయింది. ఒకరం లేకుంటే ఇంకొకరం బతకలేమని మా గుండె లయలు అర్థం చేసుకున్నాయి. నా జీవితంలోకి సంతోషాలు తీసుకొచ్చిన తనకోసం నేను ఏదైనా చెయ్యడానికి సిద్ధమయ్యాను.

వేరే అబ్బాయితో..

వేరే అబ్బాయితో..

జీవితాంతం తనే నా జీవితం అనుకున్నాను. తనను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మా ప్రేమ గురించి నేరుగా వెళ్లి వాళ్ల ఇంట్లో చెప్పాను. వాళ్ల నాన్ను పెళ్లికి ఒప్పుకోలేదు. నన్ను బెదిరించాడు. మరుసటి రోజే తనకు వేరే అబ్బాయితో సంబంధం నిశ్చయించారు.

నాకు అను కావాలి

నాకు అను కావాలి

అనురాధకు ఆ పెళ్లి ఇష్టం లేదు. తనకు నేనంటే ప్రాణం. నాతోనే జీవితాంతం ఉండాలనుకుంది. మళ్లీ వాళ్ల ఇంటికి వెళ్లాను. తనును గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను... తనను నాకిచ్చి పెళ్లి చెయ్యండని అడిగాను. కానీ అనురాధ నాన్న నన్ను ఏకంగా చంపేస్తానన్నాడు. మళ్లీ తన ఇంట్లోకి అడుగుపెడితే కాలు నరికేస్తా అన్నాడు. అయినా పర్వాలేదు.. నాకు అను కావాలి.. తనతోనే జీవితం అని చెప్పాను.

బాధను నా గుండెల్లో దాచుకోలేకపోయాను

బాధను నా గుండెల్లో దాచుకోలేకపోయాను

అనురాధకు కూడా నేనంటే ప్రాణం. నేను జీవితంలో మొట్టమొదటి సారిగా ఆశలు పెంచుకున్నది అనురాధపైనే. అంతవరకు నా వాళ్లు ఎంతమంది నా నుంచి దూరమైనా ఆ బాధను అలాగే గుండెల్లో దాచుకున్నాను కానీ.. అనురాధ దూరం అయితే మాత్రం నా బాధను నా గుండెల్లో దాచుకోలేకపోయాను. తన కోసం ఏదైనా చెయ్యాడనికి రెడీ అయ్యాను.

తట్టుకోలేకపోయాను

తట్టుకోలేకపోయాను

తను నాకు దక్కకుంటే నా జీవితమే వ్యర్థం అనిపించింది. తను నా నుంచి దూరం అవుతుంది.. మరో ఎవరితోనే తన జీవితాన్ని అర్పిస్తుందనే మాటను నేను తట్టుకోలేకపోయాను. ఆ క్షణంలో నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇంటికి వెళ్లాను ఎంతకూ నిద్రరావడం లేదు.

తాగే అలవాటు లేదు

తాగే అలవాటు లేదు

నాకు అప్పటికీ మందు తాగే అలవాటు లేదు. బయటకు వెళ్లి

నిద్రమాత్రలు తెచ్చుకున్నాను. ఒకపక్క నిద్రరావాలని.. మరో పక్క నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందని నిద్రమాత్రలు మింగుతూనే ఉన్నాను. ఆ సమయంలో నేను ఎన్ని మాత్రలు వేసుకున్నానో కూడా నాకు తెలియదు. అలాగే మత్తులోకి వెళ్లిపోయాను.

ఆమె జ్ఞానపకాలే

ఆమె జ్ఞానపకాలే

నాకు ఆ మత్తులోనూ ఆమె జ్ఞానపకాలే వెంటాడుతున్నాయి. నాకు స్పృహ లేదు. నన్ను నా ఫ్రెండ్స్ తీసుకెళ్లి హాస్పిటల్ లో జాయిన్ చేశారట. మా కుటుంబంలోని వారంతా నా బెడ్ పక్కను చేరి ఏడుస్తూనే ఉన్నారట. కానీ వారి రోదనలు ఏవి నాకు వినపడడం లేదు. డాక్టర్లు అంతా చుట్టు చేరి ఏవేవో చికిత్సలు చేస్తున్నారు.

మత్తులో ఉన్నప్పుడు జ్ఞానపకాలన్నీ గుర్తొచ్చాయి

మత్తులో ఉన్నప్పుడు జ్ఞానపకాలన్నీ గుర్తొచ్చాయి

నేను ఆ మత్తులో ఉన్నప్పుడు.. అనురాధతో నా జ్ఞానపకాలన్నీ గుర్తొచ్చాయి. ఆ రోజు అర్ధరాత్రి. వాళ్లింట్లో ఎవ్వరూ లేరని తను నాకు ఫోన్ చేసింది. నేను గోడ దూకి వాల్లింటికి వెళ్లాను. తను అప్పుడు నైటీలో ఉంది. నన్ను చూడగానే వచ్చి వాటేసుకుంది. నన్ను ముద్దుల్లో ముంచెత్తింది. నాపై ఉన్న ప్రేమ మొత్తాన్ని తన ముద్దులతో చూపించింది.

తనవితీరా తన కన్యత్వాన్ని దోచుకున్నా

తనవితీరా తన కన్యత్వాన్ని దోచుకున్నా

నన్ను అంత ప్రేమించే వ్యక్తి నాకు దొరకడం నా అదృష్టం. ఆ రోజు మేమిద్దరం స్వర్గం అంచుల దాకా వెళ్లాం. తను ఇంటికి పిలిపించి నాకు నిజంగానే స్వర్గం చూపింది. తన సొగసులన్నీ నాకు చూపించింది. వాటన్నింటినీ జుర్రుకుని తాగేందుకు అవకాశం ఇచ్చింది. తనవితీరా తన కన్యత్వాన్ని దోచుకోమంటూ నా కౌగిలితో వాలిపోయింది. రసక్రీడలో ఇద్దరం నాట్యం ఆడాం.

తుది శ్వాస వరకు తను నా సొంతం

తుది శ్వాస వరకు తను నా సొంతం

అందుకే తను దూరం అవుతుందంటే తట్టుకోలేకపోయింది నా తనువు. నా తుది శ్వాస వరకు తను నా సొంతం అనుకున్నాను. ఆమె మరొకరిని పెళ్లి చేసుకుని పోతుందంటే తట్టుకోలేక నిద్రమాత్రలు మింగాను. అంతవరకు నేను మత్తులోనే ఉన్నాను. నా స్వప్న సుందరి అను జ్ఞానపకాలను నా మనస్సు గుర్తు చేసుకుంటూనే ఉంది.

రెండు రోజుల తర్వాత

రెండు రోజుల తర్వాత

రెండు రోజుల తర్వాత నాకు మెలుకువ వచ్చింది. లేచి చూసేసరికి చుట్టు డాక్టర్లు. మా చిన్న అక్క రోదనలు.. మా అమ్మ తిట్ల పురాణం.. ఏమైందో నాకే అర్థం కాలేదు. రెండు రోజుల క్రితం నువ్వు నిద్రమాత్రలు మింగితే నిన్ను హాస్పిటల్ తీసుకొచ్చి గోడాడుతున్నారు మీ వాళ్లు అని డాక్టర్లు చెప్పేసరికి నాకు మళ్లీ అన్నీ గుర్తొచ్చాయి.

లిప్ టు లిప్ కిస్

లిప్ టు లిప్ కిస్

అందరూ నా చుట్టూ ఉన్నారు. అనురాధ మాత్రం లేదు. అను ఏది అని మా అక్కను అడిగా.. చెంపమీద చెళ్లుమన్పించింది. హాస్పిటల్ నుంచి బయటకు రాగానే అనురాధ కాలేజీకి వెళ్లాను. కాలేజీ బయట వందలాది మంది ఉన్నారు. అయినా వారిద్దరి ముందే లిప్ టు లిప్ కిస్ పెట్టింది.

సంకనాకిచ్చి వెళ్లింది

సంకనాకిచ్చి వెళ్లింది

కిస్ పెట్టుకుంటూ ఉంటే అందరూ మమ్మల్నే చూశాను. అవును అనురాధకు నేనంటే అంత ప్రాణం మరి. అందుకే చావు అయినా బతుకు అయినా తనతోనే అనుకున్నా. తను వదిలి బతకలేక చావు అంచుల దాకా వెళ్లి వచ్చాను. కానీ ఏం చేద్దాం... ఎన్ని చేసినా నా అను నాకు దక్కలేదు. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లింది. తను నాకు సర్వం సమర్పించింది కానీ నా జీవితాన్ని ఇలా సంకనాకిచ్చి వెళ్లింది.

English summary

i was broken after dad died but it was nothing compared to what happened next

i was broken after dad died but it was nothing compared to what happened next