For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Lack of romance: భాగస్వామితో రొమాన్స్ చేయట్లేదా.. కష్టాలు, నష్టాలు తప్పవు

రొమాన్స్ చేయడం ఓ కళ. ఆ కళ అబ్బాలంటే రొమాంటిక్ గా ఆలోచించాలి. వాటిని శృంగారంగా మలిచి, కలయిక వరకు తీసుకు వెళ్లాలి. చాలా మందికి పెళ్లికి ముందు రొమాన్స్ అంటే చాలా ఇష్టం ఉండి.. తర్వాత క్రమంగా తగ్గుతోందని పలు పరిశోధనల్లో తేలిం

|

Lack of romance: దాంపత్య జీవితంలో శృంగారానికి కీలక పాత్ర. వ్యక్తం చేయలేనంత ప్రేమ ఉంటే దానిని శృంగారం ద్వారా వెల్లడించవచ్చని అంటారు రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్. రొమాన్స్ లేకపోతే కపుల్స్ మధ్య బంధం బలోపేతం అవ్వదు. అలసి సొలసిన శరీరానికి, మనసుకు గొప్ప సాంత్వన ఇస్తుంది శృంగారం. భార్య భర్తల మధ్య లైంగిక జీవితం బాగుంటే వారు అన్యోన్యంగా ఉంటారు. అలాంటి శృంగారాన్ని నిర్లక్ష్యం చేస్తే అది దాంపత్య జీవితంలో సమస్యలను తెచ్చిపెడుతుంది.

Effects of lack of romance in relationship in telugu

రొమాన్స్ చేయడం ఓ కళ. ఆ కళ అబ్బాలంటే రొమాంటిక్ గా ఆలోచించాలి. వాటిని శృంగారంగా మలిచి, కలయిక వరకు తీసుకు వెళ్లాలి. చాలా మందికి పెళ్లికి ముందు రొమాన్స్ అంటే చాలా ఇష్టం ఉండి.. తర్వాత క్రమంగా తగ్గుతోందని పలు పరిశోధనల్లో తేలింది. వారికి కనీసం 2 నుండి 3 సార్లు అయినా కలయిక జరగకపోతే అది దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు సైకియాట్రిస్ట్ లు. దాంపత్య జీవితంలో శృంగారం లేకపోతే సమస్యలు వస్తాయట అవేంటి అంటే..

ఇద్దరి మధ్య బంధం

ఇద్దరి మధ్య బంధం

భార్య భర్తల మధ్య రొమాన్స్ దే కీలక పాత్ర. శృంగారం లేని దాంపత్య జీవితం అసలు జీవితమే కాదని అంటారు నిపుణులు. శృంగార సమయంలో దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది. రహస్యాలు దాచుకోవడం అనేది అన్యోన్య దాంపత్యంలో ఉండదు. దంపతుల మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. శృంగారం లేకపోతే భార్యభర్తల మధ్య సఖ్యత ఉండని అంటారు.

డిప్రెషన్

డిప్రెషన్

శృంగారానికి ఎక్కువ రోజులు దూరం ఉంటే అది డిప్రెషన్ కు దారి తీస్తుంది. రొమాన్స్ లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ఒత్తిడికి శృంగారం, కలయిక గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. ఈ సమస్య తలెత్తక ముందే జాగ్రత్త పడాలని అంటారు నిపుణులు. దంపతులు ఇద్దరూ ఒత్తిడిగా ఫీల్ అయితే వాటిని కాసేపు పక్కన పెట్టి రొమాన్స్ ను ఎంజాయ్ చేయమంటున్నారు.

నిద్ర సమస్యలు

నిద్ర సమస్యలు

మంచి కలయిక తర్వాత దంపతులు ఇద్దరూ గాఢ నిద్రలోకి జారుకుంటారు. శృంగారం చేస్తే శరీరంలో ఎనర్జీ అంతా పోతుంది. కండరాలు అలసిపోతాయి. చెమట పడుతుంది. వ్యాయామం చేసిన తర్వాత కలిగే భావన కలుగుతుంది. శృంగారం చేస్తున్నప్పుడు ఇద్దరిలోనూ హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి చక్కని నిద్ర పోయేందుకు సహకారిస్తాయి.

అశ్లీల దృశ్యాలకు అలవాటు

అశ్లీల దృశ్యాలకు అలవాటు

భాగస్వామితో శృంగారం దూరం అయితే కొన్ని రోజులకు శృంగారం చాలా ఎక్కువగా కావాలన్న కోరిక పుడుతుంది. అది భాగస్వామి నుండి దొరక్కపోతే వేరే దారులు వెతుక్కుంటారు. రొమాన్స్ చేయలేక.. అలాంటి వీడియోలను చూడటం మొదలు పెడతారు. వాటిని చూస్తూ భావ ప్రాప్తి పొందుతారు. ఇది క్రమంగా అలవాటుగా మారుతుంది. రోజూ అలాంటి వీడియోలను చూడకుండా నిద్రపోలేని పరిస్థితి వస్తుంది. తర్వాత వాటికి అడిక్ట్ అయిపోతారు.

సంతోషం కోసం వేరే దారులు

సంతోషం కోసం వేరే దారులు

దంపతుల మధ్య సఖ్యత లేకపోతే ఆ కోరికలు తీర్చుకునేందుకు వేరే దారులు వెతుక్కుంటారు దంపతులు. కొత్త పరిచయాలు చేసుకుంటూ తద్వార సంతోషం పొందుతుంటారు. మరికొందరు డేటింగ్ యాప్స్ ను ఆశ్రయిస్తున్నారు. వాటిల్లో కొత్త వారితో పరిచయం ఏర్పరచుకుని కోరికలు తీర్చుకుంటారు. సోషల్ మీడియాలో అలాంటి పేజీలను ఫాలో అవుతుంటారు. ఎలాంటి పరిచయం లేని వారితో ఛాటింగ్ లు చేస్తుంటారు. అలాంటి ఫోటోలు, వీడియోలు పంపించుకుంటూ తమకు నిజ జీవితంలో దూరమైన దానిని అలా పొందుతారు.

అక్రమ సంబంధాలు

అక్రమ సంబంధాలు

భాగస్వామి ద్వారా సంతృప్తి లేకపోతే మరొకరి ద్వారా ఆ సంతోషం పొందాలని అనుకుంటారు. దాని కోసం వేరే వారితో ఆ సంబంధం పెట్టుకుంటారు. ఇంట్లో కూర వండుకోలేక పోతే రెస్టారెంటుకు వెళ్లి తిన్నట్టుగా ఉంటుంది. దంపతుల మధ్య మంచి శృంగారం లేకపోవడం వల్లే.. వాళ్లు పక్క చూపులు చూస్తున్నారని పలు అధ్యయనాల్లో తేలింది.

డైవర్స్

డైవర్స్

దాంపత్య జీవితంలో శృంగారం లేకపోతే సఖ్యత లేనట్లే. సఖ్యత లేని దాంపత్యం ఎక్కువ కాలం నిలవదు. అది విడాకులు తీసుకునేందుకు దారి తీస్తుంది. అందుకే జీవితంలో శృంగారానికి అత్యంత ముఖ్య పాత్ర ఇవ్వాలని అంటారు నిపుణులు. అది లేకపోతే ఏ దాంపత్య బంధం కూడా బలోపేతం కాలేదని అంటుంటారు. శృంగారానికి సమయం చూడవద్దు. మీకు పరిస్థితులు అనుకూలిస్తే ఎప్పుడైనా దానిని ఎంజాయ్ చేయవచ్చు. మనలో కోరికలు రగిలినప్పుడు భాగస్వామిలోనూ మూడ్ వచ్చేలా చేయాలి. ఇది ఇద్దరి మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది.

పరిస్థితులను చక్కదిద్దడం ఎలా

పరిస్థితులను చక్కదిద్దడం ఎలా

* నిజాయితీ, భాగస్వాములతో నిజాయితీగా ఉండాలని అంటారు నిపుణులు. వారిని ఎట్టిపరిస్థితుల్లో అవమానించకూడదు.

* భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి.

* తప్పు ఎవరిది అనేది చర్చించి తెలుసుకోవాలి. ఎక్కడ తప్పు జరుగుతుందో చర్చించాలి.

* సమస్యలు పరిష్కరించలేనంత పెద్దగా ఉంటే.. ఇతరుల సహాయం తీసుకొండి. లేదా దానికి కొంత సమయం ఇవ్వండి. ఏ సమస్యకైనా కాలం గొప్ప పరిష్కారాన్ని చూపుతుంది. మనసుకు తగిలిన గాయాలను కూడా కాలం నయం చేస్తుంది.

* సమస్యల గురించి ఆలోచించకుండా, పరిష్కారాన్ని కనుక్కోవాలని చెబుతున్నారు నిపుణులు.

English summary

Effects of lack of romance in relationship in telugu

read on to know Effects of lack of romance in relationship in telugu
Story first published:Monday, August 1, 2022, 14:59 [IST]
Desktop Bottom Promotion