For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలేజీలో స్టార్టయిన లవ్.. కడదాకా నిలిచిన ప్రేమ కథలు మీ కోసం...

|

పదో తరగతి పూర్తయ్యాక ప్రతి ఒక్కరూ కాలేజీలో అడుగుపెడతారు. అలా కాలేజీలో అడుగుపెట్టే వారంతా స్నేహితులతో కలిసి చేసే అల్లరి.. చేసిన చిలిపి పనుల గురించి ఎప్పటికీ మరిచిపోరు.

అందులోనూ ముఖ్యంగా కాలేజీ లైఫ్ లో ప్రేమ కథలు మనందరికీ జీవితాంతం గుర్తుండిపోతాయి. అయితే కొందరి కాలేజీ ప్రేమ కథలు పరిణయం దాకా వెళ్తే..

మరికొందరివి కాలేజీలోనే బ్రేకప్ అవుతుంటాయి. అలా కాలేజీలో మొదలైన కొన్ని అద్భుతమైన ప్రేమ కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

'నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా.. కానీ తన స్నేహితులతో తప్పుగా ప్రవర్తిస్తోంది...''నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా.. కానీ తన స్నేహితులతో తప్పుగా ప్రవర్తిస్తోంది...'

ప్రేమంటే నమ్మకం..

ప్రేమంటే నమ్మకం..

‘నేను కాలేజీలో చేరిన నాటి నుండి నాకు అమ్మాయిలను చూడలన్నా.. వారితో మాట్లాడాలన్నా భయం, సిగ్గు ఉండేది. అంతేకాదు నాకు ప్రేమ విషయంలో పెద్దగా నమ్మకం కూడా ఉండేది కాదు. కానీ నా స్నేహితుడు ‘మన కోసం ఎవరో ఒకరు అమ్మాయిని దేవుడు పంపుతాడని.. మనం ఎంత వద్దనుకున్నా వారితో మన బంధం ఏర్పడుతుందని చెబుతుండేవాడు'.అలా చెప్పిన కొద్ది రోజులకే నాకు తెలియకుండానే ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది.

లైబ్రరీలో కలిశాం..

లైబ్రరీలో కలిశాం..

నేను ఎక్కువగా చదువులపై ఫోకస్ పెట్టేవాడిని. అందుకే నేను ఎక్కువగా లైబ్రరీలో గడిపేవాడిని. అలా నేను నిత్యం కొత్త కొత్త పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. అక్కడే అనుకోకుండా తను పరిచయం అయ్యింది. కానీ తను వేరే గ్రూప్. మా గ్రూపులు వేరే కాబట్టి మేమిద్దరి ఏడాది వరకు అసలు ఒకరినొకరు చూసుకోలేదు. కానీ లైబ్రరీలో పుస్తకాలు వెతుకుతున్న సమయంలో తనను చూశాను. చూడగానే నాకెంతగానో నచ్చింది.

పరిచయం కాస్త స్నేహంగా..

పరిచయం కాస్త స్నేహంగా..

ఆ తర్వాత జరిగిన కాలేజీ ఫంక్షన్లో తొలిసారిగా మేమిద్దరం పరిచయం చేసుకున్నాం. మా ఇద్దరికి ఉండే ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మా ఇద్దరి మధ్య పరిచయం కాస్త స్నేహంగా మారింది. అంతే ఆ వెంటనే ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. అంతేకాదు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లకు రిక్వస్ట్ పెట్టడం.. వెంటనే యాక్సెప్ట్ అవ్వడం వెంట వెంటనే జరిగాయి.

ప్రతిరోజూ కబుర్లు..

ప్రతిరోజూ కబుర్లు..

అప్పటి నుండి తనతో ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడటం.. అర్థరాత్రి సమయంలో చాటింగ్ చేస్తూ ఉండేవాళ్లం. అప్పుడే నేను ప్రేమలో పడ్డానేమో అనిపించింది. నా ఫ్రెండ్స్ కూడా నన్ను ప్రేమ అని చెబుతుండేవారు. అప్పటి నుండి తనకు తెలియకుండా తన ఫీలింగ్స్ తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడిని.

ప్రపోజ్ చేశాక..

ప్రపోజ్ చేశాక..

అయితే నేను తనతో ప్రేమ గురించి తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా తను మాత్రం బయటపడేది కాదు. దీంతో నాకు చాలా భయంగా ఉండేది. ఇలా కొన్ని రోజుల తర్వాత ఏదైతే అది జరుగుతుందని తనకు ప్రపోజ్ చేశాను. ఆరోజు నేను ఎంతో రిలీఫ్ గా ఫీలయ్యాను. అంతే తను కూడా ఓకే చెప్పేసింది.

మూడేళ్లు ప్రేమించుకున్నాం..

మూడేళ్లు ప్రేమించుకున్నాం..

ఆ తర్వాత మేమిద్దరం మూడేళ్ల పాటు ప్రేమించుకున్నాం. అప్పటి నుండి రెగ్యులర్ గా పార్కులు, సినిమాలకు, షాపింగులకు వెళ్లేవాళ్లం. కాలేజీ ఎడ్యుకేషన్ అయిపోయాక తనకు మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. నాకు కూడా ఓ జాబ్ వచ్చింది. అంతే ఇంకేముంది తన ఇంట్లో పెద్దలతో మాట్లాడి ఒప్పించాను. మా ప్రేమ నిజాయితీని గుర్తించి మా కుటుంబ సభ్యులు మా పెళ్లి జరిపించారు' అని ఓ ప్రేమికుడు తన లవ్ స్టోరీని మాతో షేర్ చేసుకున్నాడు. నిజమైన ప్రేమకు నా కథే ఓ ఉదాహరణ అని చెబుతున్నాడు.

అచ్చం సినిమాలాగా..

అచ్చం సినిమాలాగా..

మీ అందరికీ హ్యాపీడేస్ సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో జూనియర్స్.. సీనియర్స్ ర్యాగింగ్ లవ్ స్టోరీ అద్భుతంగా ఉంటుంది కదా. అలాంటిదే నా జీవితంలో కూడా జరిగిందని చెబుతున్నాడు ఓ ప్రేమికుడు. నేను నా స్నేహితులతో కలిసి జూనియర్లను పరిచయం చేసుకోవడానికి ప్రయత్నించాను. అప్పుడు ఓ అమ్మాయి భయం భయంగా చాలా నెమ్మదిగా తన పేరు చెప్పింది.

తన చూపులో..

తన చూపులో..

తను కళ్లు చిన్నవిగా చేస్తూ పేరు చెప్పడం చూస్తే నాకు భలే నవ్వొచ్చింది. అప్పటినుండి నా చూపు తిప్పుకోలేకపోయా. ఆ మరు క్షణం నుండే తనంటే నాకు ఇష్టం పెరిగిపోయింది. ఆ తర్వాత మేమిద్దరం రెగ్యులర్ గా కాఫీ, స్నాక్స్ కోసం కలిసేవాళ్లం. అలా మా ఇద్దరికీ తెలియకుండా మా ఇద్దరి మధ్య ప్రేమ చేరిపోయింది. మా మనసులు కూడా బాగా కలిశాయి. అలా ప్రేమ కథ మొదలైందని.. మా ప్రేమ పరిణయం దాకా ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిందని మరో ప్రేమికుడు చెప్పాడు.

English summary

Great Love Stories From College Life in Telugu

Here are the great love stories from college life in telugu. Have a look