For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్వే! భాగస్వామి బాడీలోని చెమటతో కోరికలు పెరగడమే కాదు... హాయిగా నిద్ర కూడా పడుతుందట..

|

ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఆకలి, నిద్ర అనేది ఎంత అవసరమో.. యవ్వనంలో ఉన్న వారికి శృంగారం అనేది కూడా అంతే ముఖ్యం.

ఎవరైనా ఈ విశ్వంలో ప్రతి రోజూ ఎలాంటి ఆందోళన లేకుండా, హాయిగా కడుపు నిండా తినేసి.. కంటి నిండా నిద్రపోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు. అయితే అనేక రకాల ఒత్తిడి, కారణాల వల్ల ప్రశాంతమైన నిద్ర అనేది చాలా మందికి దొరకదు.

ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఉద్యోగులకు ఆఫీసులో పని ఒత్తిడి.. విద్యార్థులకు విద్య, పరీక్షల గురించి ఒత్తిడి.. ఇతరులకు ఇంటి పని ఇలా రకరకాల పనుల కారణంగా చాలా మందికి కంటి నిండా నిద్ర అనేది కరువవుతోంది.

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ఆఫీసులకు వెళ్లడం తగ్గినప్పటికీ.. పని గంటలు ఏ మాత్రం తగ్గలేదు.. పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ వారికి మరింత ఒత్తిడి పెరిగింది.

దీని కారణంగా తమ భాగస్వామితో శృంగారంలో పాల్గొనేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. అంతేకాదు నిద్రపోవడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని తెలిసింది.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. అందరూ ఆశ్చర్యపోయే ఓ విషయం ఇటీవల చర్చనీయాంశమైంది. అంతేకాదు అది అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. అదేంటంటే మన శరీరం నుండి వచ్చే చెమట. దీని నుండి వచ్చే వాసన వల్ల మనం చాల చిరాకు పడుతుంటాం. కానీ అదే మనల్ని ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తోందట. అంతేకాదు.. శృంగార కోరికలు పెరిగేలా చేస్తుండటం విశేషం... ఈ సందర్భంగా అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలా కూడా రివేంజ్ తీర్చుకుంటారా? మాజీ ప్రియురాలికి గట్టి షాకిచ్చిన ప్రియుడు...

పెళ్లి జంట..

పెళ్లి జంట..

పగలంతా స్త్రీ, పురుషులు ఎంతగా కష్టపడి పని చేసినా.. చీకటి పడగానే పడక గదిలో కలిసి నిద్రపోతే.. వారి పెళ్లి జీవితం చాలా అద్భుతంగా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

సర్వేలో షాకింగ్ విషయాలు..

సర్వేలో షాకింగ్ విషయాలు..

ఇటీవల ఓ సంస్థ 150 మంది కపుల్స్ పై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో అందరూ ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి.

హాయిగా ఉంటోదట..

హాయిగా ఉంటోదట..

వారిలో చాలా మంది తమ భాగస్వామి బాడీ నుండి వచ్చే చెమట వాసన తమకు హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటోందని చెప్పడం విశేషం.

OMG : ఆత్మలతో ఆ కార్యమే కాదు... పిల్లల్ని కూడా కనాలని ఉందంట ఆమెకు...

రియాల్టీ షోలో కూడా..

రియాల్టీ షోలో కూడా..

ఇది నిజమా.. కాదా అని తెలుసుకునేందుకు, దీనిని రియాల్టీ షోలో కూడా చెక్ చేశారంట. కొందరికి వారంతా ఒకే చొక్కా ధరించాలని చెప్పారట.. వారం తర్వాత ఫ్రెష్ గా ఉతికిన టీషర్ట్ వేసుకోవాలని చెప్పారట.

హాయిగా నిద్ర పట్టిందట..

హాయిగా నిద్ర పట్టిందట..

అలా వారం రోజుల పాటు తమ చొక్కాను మార్చకుండా తమ భాగస్వామితో కలిసి పడుకున్నప్పుడు హాయిగా నిద్ర పట్టిందట. విచిత్రం ఏమిటంటే ఆ చెమట వాసనకు శృంగార కోరికలు కూడా విపరీతంగా పెరిగాయని చెప్పరు.

ఫ్రెష్ టీషర్ట్ వేసుకుంటే..

ఫ్రెష్ టీషర్ట్ వేసుకుంటే..

అయితే బాగా ఉతికిన, ఫ్రెష్ టీషర్ట్ వేసుకుని, తమ భాగస్వామితో కలిసి నిద్ర పోయినప్పుడు మాత్రం అలాంటి ఫీలింగ్స్ కలగలేదని చెప్పడం గమనార్హం.

అకస్మాత్తుగా ఆ కార్యానికి దూరమైతే ప్రమాదామా? అయితే అది ఆడవారికా? మగవారికా?

అందరికీ నచ్చకపోవచ్చు..

అందరికీ నచ్చకపోవచ్చు..

అయితే మీరు ఇక్కడ ఓ విషయాన్ని తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే అందరికీ చెమట వాసన నచ్చకపోవచ్చు. కాబట్టి, మీరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని, మీ భాగస్వామికి తగినట్టు పడకగదిలో వ్యవహరించడం మంచిది. లేదంటే మరిన్ని సమస్యలు మిమ్మల్ని చుట్టేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లైంగిక ప్రేరణ..

లైంగిక ప్రేరణ..

ఇదిలా ఉండగా..అమ్మాయిలు లైంగికంగా ప్రేరణకు గురైతే ఆ విషయాన్ని మగవారు చాలా సులభంగా పసిగట్టగలరని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆడవారికే ఎక్కువ కోరికలు..

ఆడవారికే ఎక్కువ కోరికలు..

ఈ అధ్యయనంలో పరిశోధకులు చెమటకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. అంతేకాదు మగవారి కంటే ఆడవారికే లైంగిక కోరికలు ఎక్కువగా ఉంటాయని వారు స్పష్టం చేశారు. మగవారిలో లైంగిక ప్రేరణకు కేవలం రెండు లేదా మూడు కారణాలు ఉంటే, అమ్మాయిలలో ఏకంగా 237 కారణాలు ఉంటాయని వెల్లడించారు.

కళ్ల ద్వారానే..

కళ్ల ద్వారానే..

ఆడవారిలో లైంగిక ప్రేరేపణ సంకేతాలు సున్నితంగా ఉంటాయని.. వాటిని మగవారు వెంటనే పసిగడతారని, లైంగిక ఆసక్తి అనేది కళ్ల ద్వారానే తెలుస్తుందని వారు చెబుతున్నారు.

English summary

The smell of romantic partner can improve sleep & increase the desire of intercourse

Here we talking about the smell of romantic partner can improve sleep & increase the desire of intercourse.Read on
Story first published: Friday, July 24, 2020, 15:16 [IST]