For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశుల వారికి రొమాన్స్ పై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుందట...! మీ రాశి కూడా ఉందేమో చూడండి...

|

యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అలాంటి కోరికలు ఉండటం అనేది అత్యంత సహజం. ప్రతి మనిషిలో అనేక రకాల భావోద్వేగాలు ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరిలో తమ లైఫ్ పార్ట్ నర్ తో రొమాంటిక్ ఫీలింగ్స్ పంచుకోవాలనే కోరిక ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ కోరికలు అనేవి ఒక్కొక్కరిలో ఒక్కోలా కలుగుతుంటాయి.

అలా కోరికలు కలగడంలోనూ అనేక మందిలో అనేక తేడాలుంటాయి. అయితే కొందరిలో ఇలాంటి రొమాంటిక్ కోరికలు అమితంగా ఉంటే, మరికొందరిలో చాలా తక్కువగా ఉంటాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రకమైన కోరికలు ఎవరెవరికి ఏయే స్థాయిలో ఉంటాయనే ప్రశ్నలు కొంతమందికి విచిత్రంగా అనిపించవచ్చు. ఇది చాలా మంది నమ్మకపోవచ్చు.

కానీ రాశి చక్రాన్ని బట్టి.. వారు పుట్టిన తేదీని బట్టి వారిలోని కోరికల పట్ల అనేక మార్పులు ఉంటాయని చెబుతున్నారు జ్యోతిష్యశాస్త్రం పండితులు. మీ ప్రవర్తనకు రాశి చక్రాలతో ఎంత సంబంధం ఉంటుందో.. అదే స్థాయిలో రొమాంటిక్ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయట. అందుకే అలాంటి కోరికల గురించి కొందరు ఏ మాత్రం మోహమాటం లేకుండా బహిరంగంగా మాట్లాడుతూ ఉంటారు.

మరికొందరు మాత్రం అలాంటి కోరికలంటే చాలా రహస్యంగా భావిస్తారు. వాటి గురించి బయటి వ్యక్తులతో మాట్లాడేందుకు అస్సలు ఆసక్తి చూపరు. ఇంకా కొంత మంది అయితే బయట మాట్లాడేందుకు ఇష్టపడకపోయినా.. పడకగదిలో మాత్రం చాలా చురుకుగా ఉంటారట. ఈ నేపథ్యంలో ఏయే రాశుల వారికి కోరికలు.. అలాంటి ఉద్రేకాలు ఎక్కువగా ఉంటయో ఈ స్టోరీని పూర్తిగా చూసి తెలుసుకోండి...

షాక్! ఆ మోజులో పడి కట్టుకున్న వారినే మోసం చేస్తున్నారట! వీరిలోనూ భార్యా బాధితులే ఎక్కువగా ఉన్నారట...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు మిగిలిన రాశుల వారి కంటే కొంచెం భిన్నంగా కనిపిస్తారు. ఇతరులను తమ వైపు ఆకర్షించడం మరియు వారిలో మోజును పెంచడంలో ఈ రాశి వారు మంచి నైపుణ్యం కలవారు. పడక గదిలో సైతం తమ భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించడం అంటే వీరికి చాలా ఇష్టం. ఇలాంటి మనస్తత్వం మరే ఇతర రాశుల వారికి ఉండదు. పడకగదిలో వీరికి మూడొస్తే.. వీరి భాగస్వాములు మంచి ఆనందాన్ని పొందుతారట.

కోరికలు తగ్గవు..

కోరికలు తగ్గవు..

పెళ్లయిన కొత్తలో ఎక్కువగా ఉండే ఫీలింగ్స్ రోజులు గడుస్తున్న కొద్దీ పెరుగుతాయే తప్ప ఏ మాత్రం తగ్గవట. రొమాన్స్ విషయంలోనే కాదు భాగస్వామితో సాధారణ సందర్భాల్లోనూ చాలా జోవియల్ గా ఉంటారట. అయితే వీరికి రొమాంటిక్ కోరికలు ఎక్కువగా ఉండటం వల్ల చాలా సార్లు భాగస్వామితో కలయిక తర్వాత వీరు నిరాశకు లోనయ్యే అవకాశాలుంటాయట.

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు రొమాన్స్ పట్ల చాలా ఎక్కువగా ఆసక్తి చూపుతారు. వీరి ప్రవర్తనను బట్టే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందట. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటంలో వీరికి చాలా ప్రత్యేకత ఉంటుందట. వీరు తమ భాగస్వామిని టచ్ చేస్తే చాలు.. వారికి వెంటనే మూడ్ వచ్చేస్తుందట. అంతేకాదు వీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తే.. అవతలి వ్యక్తిలోనూ ప్రేమ పుట్టించడంలో చాలా ప్రావీణ్యం చూపుతారట. వీరికి ఫోర్ ప్లే అంట ఎక్కువ ఇష్టమట.

తాజా సర్వే..! లైంగిక జీవితం పట్ల నిరాశకు గురవుతున్న మహిళల్లో మన దేశమే నెంబర్ 1...!

మూడ్ తెప్పించడంలో..

మూడ్ తెప్పించడంలో..

అందుకే ఈ రాశి వారు మంచి కలయిక గల భాగస్వామి అని అందరూ భావించేలా చేస్తారు. వీరు తమ భాగస్వామికి మూడ్ తెప్పించడంలో ఎల్లప్పుడూ ముందే ఉంటారు. కేవలం మూడ్ తెప్పించడమే కాదు. వారిని పూర్తిగా ఉత్సాహపరచడంలో కూడా మంచి సిద్ధహస్తులే..

బలమైన బంధం కోసం..

బలమైన బంధం కోసం..

ఈ రాశి వారు కేవలం శారీరక సంబంధాల గురించి మాత్రమే కాకుండా.. తమ బంధాన్ని మరింత బలంగా మరియు ఎంతో ప్రత్యేకంగా మార్చుకోవడంలోనూ ఆసక్తి చూపుతారంట. రొమాన్స్ విషయంలో కొత్త కొత్తగా ప్రయత్నించడం అనేది వీరికి పెద్దగా ఇష్టముండదట.

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు రొమాన్స్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. వీరికి సంబంధించి రొమాన్స్ అన్నది కేవలం కలయిక వంటి చర్యకు మాత్రమే పరిమితం కాదు. ఇది వీరికి భావోద్వేగాలకు సంబంధించినది. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనసు కలిగిన వారు. అందుకే వీరు రొమాన్స్ లో ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతారు. ఈ రాశి వారు తమ ఫీలింగ్స్ తమ భాగస్వామికి కనబడకుండా దాచి పెట్టుకుంటారు. అందుకే వీరు లోపల ఒకరకంగా ఉన్నా.. బయట కనిపించేది మరో రకంగా ఉంటుంది.

అనైతిక సంబంధం : మైనర్ బాలుడితో అపవిత్ర కార్యం... బిడ్డ పుట్టిన తర్వాత....

తమ భాగస్వామి కంటే..

తమ భాగస్వామి కంటే..

ఈ రాశి వారు తమ భాగస్వామి కంటే వారి ఆనందం గురించే ఎక్కువగా ఆలోచిస్తారట. వీరికి ఛాతి భాగంలో టచ్ చేస్తే వీరికి ఎక్కువగా మూడ్ వస్తుందట. ఈ రాశి వారికి ఊహాల్లో జీవించే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు ఎక్కువగా రొమాన్స్ కు సంబంధించిన కలల్ని కంటుంటారు.

సింహ రాశి : జులై 23 నుండి ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 నుండి ఆగస్టు 22

ఈ రాశి వారు చాలా రొమాంటిక్ గా ఉంటారు. వీరు చాలా రొమాంటిక్ గా కూడా కనిపిస్తారు. వీరు తమకు నచ్చిన వ్యక్తిని తమ వైపు ఆకర్షించే గుణాలను ఎక్కువగానే కలిగి ఉంటారు. వీరు చూడటానికి ఒకలా.. లోలోపలా మరోలా కనిపిస్తారట. అందుకే బయట సున్నితంగా కనిపించినా.. తమ భాగస్వామి మాత్రం తమలోని మరో యాంగిల్ ని చూపుతారట. వీరు రొమాన్స్ సమయంలో చాలా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారట. వీళ్లు తమని తాము చాాలా హాట్ అని భావిస్తారట.

రొమాన్స్ సమయంలో..

రొమాన్స్ సమయంలో..

వీరు రొమాన్స్ విషయంలో తమ భాగస్వామి నుండి ప్రతిసారీ ప్రశంసలు అందుకోవాలని భావిస్తుంటారు. అందుకే వీరు రొమాంటిక్ విషయాల్లో చాలా చురుకుగా, ఫన్నీగా వ్యవహరిస్తుంటారు. అందుకే ఇలాంటి వారి గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిపోతుంది.

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 నుండి నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 నుండి నవంబర్ 21

ఈ రాశి వారికి ఎల్లవేళలా రొమాంటిక్ కోరికలు ఉంటాయట. రొమాన్స్ విషయంలో వీరికే మొదటి ర్యాంక్ మొదలవుతుందట. వీరు ప్రేమ మరియు రొమాన్స్ అనే రెండు విషయాల్లో వీరు చాలా శ్రద్ధ చూపుతారు. వీరు రొమాన్స్ కు సంబంధించి ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారట. అందుకే తమ భాగస్వామి దగ్గర ప్రతిసారీ కొత్తగా.. రొమాంటిక్ కనిపించే ప్రయత్నం చేస్తుంటారట. రకరకాల భంగిమలను ప్రయత్నించాలనే కోరికలు వీరికి ఎక్కువగా ఉంటాయట.

English summary

These Zodiac Sign People are most active in romance

Here are these zodiac sign people are most active in romance. Read on
Story first published: Wednesday, March 4, 2020, 18:33 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more