ఎట్టి పరిస్థితిలో మీ భార్యను అడగకూడని ప్రశ్నలు

By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

మీరు ఎప్పుడూ మీ భార్యను అడగకూడని ప్రశ్నలు కొన్ని ఉంటాయి. అవును, మీరు ఇంట్లో గొడవలు సద్దుమణిగి, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అంటే, ప్రకృతికి భిన్నమైన ప్రశ్నలకు దూరంగా ఉండడం ఎంతో సురక్షితం.

కొన్నిసార్లు, చిన్నచిన్న తగాదాలు పెద్ద యుద్ధాలకు గురవుతాయి, బంధాలు తెగిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఆ చిన్నచిన్న విషయాల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా?

పెదాలతో పాటు ఈ 7చోట్ల ముద్దాడితే స్త్రీ పరవశించిపోతుంది

చిన్నచిన్న విషయాలు అనుబంధాలను ఎంత తేలికగా విడగోడుతున్నాయో మీరు చూడాలి అనుకుంటున్నారా?

మీరు మీ భార్యను అడగకూడని కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

మీ శృంగార జీవితాన్ని మార్చేసే 7 కామసూత్ర పాఠాలు

ఇంత ఎక్కువ మేకప్ అవసరమా?

ఇంత ఎక్కువ మేకప్ అవసరమా?

ఇలాంటి ప్రశ్నలు అడిగే భర్తలు తరువాత పాశ్చాత్తాప్పడతారు!! భార్యాభర్తలు ఇద్దరూ తయారయి బైటికి వెళ్ళే సమయంలో 80% తగాదాలు మొదలవుతాయని కొన్ని సర్వేలు వెల్లడించాయి. ఇది మీకే వదిలేస్తున్నాము. పార్టీ కోసం ఎలా తయారవాలి అనేది అతను నిర్ణయిస్తాడు. అంతేకాకుండా, ఆమె తయారవడానికి ఇంతసేపా అని నిలదీస్తాడు కూడా.

అందంగా కనిపించడం అనేది మంచి అనుభూతే కదా. మేకప్ మీ భార్యకు ఆనందాన్ని కలిగిస్తే ఆమెను ఆపకండి. తగాదాలు లేకుండా ఆమె తయారయ్యే వరకు ఎదురు చూడండి. అదే ఆమె ఎక్కువ సమయం తీసుకుంటే, ఆమె కోసం ఎదురు చూసే సమయంలో వీడియో గేమ్ ఆడుకోండి. సమస్య లేదు!

షాపింగ్ కి ఎంత సమయం కేటాయిస్తావు?

షాపింగ్ కి ఎంత సమయం కేటాయిస్తావు?

ఈ ప్రశ్న గొడవలకు దారితీస్తుందని అనేక అధ్యయనాలు చెప్పాయి! ఇలాంటి ప్రశ్నలు ఆనందాన్ని పాడుచేస్తాయి. షాపింగ్ సమయంలో ఆమె ఆనందం చచ్చిపోతుంది! డబ్బులు మీవైనా ఆమెవైనా, తగాదా పడకుండా ఆమె షాపింగ్ అయ్యేవరకు మాట్లాడకుండా ఉండడం తెలివైన పని.

నా ఫోను ఎందుకు చెక్ చేస్తున్నావు?

నా ఫోను ఎందుకు చెక్ చేస్తున్నావు?

ఇది మీ భార్యే కాదు, ఇతరులు కూడా చేయోచ్చు. మీ స్నేహితులను అడగండి! మీ భార్య మీ ఫోను నుండి బ్రౌస్ చేయడానికి ఇష్టపడుతుంది, అది ఆమె జన్మహక్కు. ఆమెను ఇదొక ప్రశ్నలు అడిగేకంటే, మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే అసభ్యకర చిత్రాలను, అన్ని చాట్ లను తొలగించండి. అంతేకాకుండా, మోసం చేయడం మానేయండి!

నువ్వు గర్భవతిగా ఉన్నపుడు శృంగారంలో పాల్గొందామా?

నువ్వు గర్భవతిగా ఉన్నపుడు శృంగారంలో పాల్గొందామా?

ఈ ప్రశ్న వేస్తే మీకు ఆమెపై శారీరిక వ్యామోహం ఉంది అనుకుంటుంది. మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టొచ్చు లేదా బాధపెట్టొచ్చు. దీనికి బదులుగా గర్భధారణ సమయంలో ఆమెకి ఆమె స్వతహాగా అడిగేదాకా మీ కోరికను నియంత్రించుకోవడం మంచిది!

ప్రతి వారం మీ పుట్టింటికి ఎందుకు వెళతావు?

ప్రతి వారం మీ పుట్టింటికి ఎందుకు వెళతావు?

మీరు వారి కుటుంబ సభ్యులను ఇష్టపడకపోయినా, ఇలాంటి ప్రశ్నల నుండి దూరంగా ఉండండి. ఆమె మిమ్మల్ని అసహ్యించుకోవడం ప్రారంభిస్తుంది! ఇలాంటి ప్రశ్నలు భార్యాభర్తల మధ్య దూరాన్ని తగ్గిస్తాయి.

షేవ్ చేసుకున్నావా?

షేవ్ చేసుకున్నావా?

అవాంచిత జుట్టు గురించి మాట్లాడడం చాలా సున్నితమైన విషయం. అది కాళ్ళ మీద లేదా ముఖం మీద అయినా, దాని గురించి ఎప్పుడూ మాట్లాడొద్దు, అది అనాగరికంగా చాలా ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది. ఆమె జుట్టు గురించి మీకు అనవసరం.

నేను చెడ్డ భర్తనా?

నేను చెడ్డ భర్తనా?

ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారు? ఆమె అవును అంటే ఏమవుతుంది? ఇలాంటి సంభాషణలు మొదలు పెడితే మీకు నిద్ర ఉండదు. వినడానికి కష్టంగా ఉండే ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ అడగొద్దు. ఇలాంటి కొన్ని ప్రశ్నలు భర్తలు భార్యలను అడగకూడదు.

English summary

Questions Not To Ask Your Wife

There are some things you should never ask your wife. Yes, if you wish to avoid conflicts at home read this!
Subscribe Newsletter