పెళ్ళైన వ్యక్తులు వినడానికి విసుగు చెందే ఈ విషయాల గురించి మీకు తెలుసా ?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

చాలా మంది వ్యక్తులు పెళ్ళైన వ్యక్తులను లేదా పెళ్లిచేసుకోబోయే వ్యక్తుల ప్రణాళికలను తెలుసుకోవడానికి వారి దగ్గరకు వెళ్ళి విభిన్న రకాల ప్రశ్నలు సంధిస్తుంటారు. ఇలా ప్రశ్నలు అడిగేవారి మనస్సులో ఎటు వంటి చెడు ఉద్దేశ్యం లేకపోయినా లేదా ఎదుటివారిని నొప్పించాలని అనుకోకపోయినా కానీ, వారు ప్రశ్నలు అగిడే విధానం లేదా వాళ్ళు వ్యక్తపరిచే భావాలు ఎదుటి వ్యక్తులను బాధిస్తాయి.

ఇప్పుడు మనం పెళ్ళైన వ్యక్తులను ఏ ఏ ప్రశ్నలను అడిగితే వాళ్ళు విసుగు చెందుతారు లేదా సమాధానం చెప్పడానికి అయిష్టతను వ్యక్తం చేస్తారు అనే వాటి గురించి తెలుసుకుందాం....

భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడాలంటే..

1.

1. " మీరు ఎప్పుడు పిల్లలని కనాలని అనుకుంటున్నారు ? "

ఈ ప్రశ్నను మాములుగా కుటుంబంలోని పెద్ద వాళ్ళు తరచూ పెళ్ళైన వాళ్ళను అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్న అడగటం వెనుక ఎటువంటి చెడు ఉద్దేశ్యం ఉండదు. అలా సాధారణంగా అలవాటులో భాగంగా అడిగేస్తుంటారు. ఈ ప్రశ్న అడగడం ద్వారా మీరు వారి పట్ల మంచిగా వ్యవహరిస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా కొంతమంది అడుగుతుంటారు.

2. మీకు పెళ్లయిపోయింది ! ఇప్పుడు మీరు ఏమి తింటే వేరేవాళ్లకి ఏమి సంబంధం ?

2. మీకు పెళ్లయిపోయింది ! ఇప్పుడు మీరు ఏమి తింటే వేరేవాళ్లకి ఏమి సంబంధం ?

సాధారణంగా పెళ్లి కాని మీ స్నేహితులు ప్రతిరోజూ మిమ్మల్ని కలిసినప్పుడు మరియు ప్రతి సందర్భంలో వీలైనంత వరకు ఒక మాట అనేస్తుంటారు. వాళ్ళు అడిగే విధానం అలానే ఉంటుంది. ఏమంటారంటే పెళ్ళైన వాళ్లకు జీవితం అనేది ఉండదు, ఉండబోదు అన్నట్లు మాట్లాడుతుంటారు. ఇది విన్నప్పుడు చాలా మందికి ఎదుటి వ్యక్తి యొక్క ముఖం పై గుద్దాలనిపిస్తుంది.

3. మీ భర్త లేక భార్య ఎక్కడున్నారు ?

3. మీ భర్త లేక భార్య ఎక్కడున్నారు ?

మాములుగా సమాజంలో ఏదైనా ప్రదేశానికి లేదా వేడుకకు పెళ్ళైన తర్వాత వెళితే, భార్య భర్తలు ఇరువురు వెళ్లాలని అందరూ ఆశిస్తుంటారు. పెళ్లయింది గనుక ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ ప్రతి ఒక్క దగ్గరికి ఖచ్చితంగా జీవితంలో కలిసే వెళ్ళాలి అని చాలా మంది భావిస్తుంటారు. కానీ, పెళ్ళైనంత మాత్రాన ఇద్దరూ ముడేసుకున్నట్లు కాదు అనే విషయాన్ని ఈ ప్రజలు ఎప్పుడు గుర్తిస్తారో.

4. పెళ్లి జీవితం ఎలా ఉంది చిట్కాలు లేదా సూచనలు ఏవైనా ఉన్నాయా ?

4. పెళ్లి జీవితం ఎలా ఉంది చిట్కాలు లేదా సూచనలు ఏవైనా ఉన్నాయా ?

పెళ్లికాని మీ స్నేహితులందరూ తరచూ, కొద్దిగా గుచ్చుకునే విధంగా ప్రశ్నలు అడుగుతుంటారు, మీరు ఎప్పుడైనా వారి దగ్గర మీ పెళ్ళికి సంబంధించిన ఏదైనా మధురానుభూతిని పంచుకుంటే. వాళ్ళు ఎల్లప్పుడూ మీకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటారు లేదా ఏవైనా అవరోధాలు లేదా ప్రమాదాలు ఎదుర్కోబోతున్నారా అని ముందుగా చూసే ప్రయత్నం చేస్తారు.

5. ఇక జీవితాంతం ఒకే వ్యక్తితో ఎలా జీవిద్దాం అనుకుంటున్నావు ?

5. ఇక జీవితాంతం ఒకే వ్యక్తితో ఎలా జీవిద్దాం అనుకుంటున్నావు ?

ఇది ఒక అపరిపక్వతతో కూడిన ప్రశ్న. ఈ ప్రశ్నను గనుక ఎవరైనా పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అడుగుతున్నట్లైతే అతడి పై అతనికి నమ్మకం లేనట్లు అర్ధం. ఈ ప్రశ్న గనుక ఎవరైనా అడిగితే దానర్ధం ఏమిటంటే ఆ వ్యక్తి తన జీవితంలో తన భాగస్వామిగా సరైన వ్యక్తిని ఇంకా ఎంచుకోలేదు.

6. మీరు గర్భవతా ?

6. మీరు గర్భవతా ?

మీరు ఎప్పుడైనా మంచి రుచికరమైన ఐస్ క్రీమ్ లను లేదా తినుబండారాలను తినాలని తాపత్రయపడితే, మీ సహచరులు లేదా స్నేహితులు తప్పకుండా ఈ ప్రశ్నలు అడుగుతుంటారు. మీకు పెళ్లయింది గనుక మీరు పిల్లల గురించి తప్ప ఇంకే విషయం గురించి ఆలోచించకూడదు అన్నట్లు వ్యవహరిస్తుంటారు కొంత మంది. మీరు ఏదైనా తీపి పదార్ధం లేదా ఐస్ క్రీమ్ తినాలని భావించినట్లైతే మీ లోపల బిడ్డ పెరుగుతున్నదని, ఆ బిడ్డ తీపి పదార్ధాలు తినాలని ఉవ్విళూరుతున్నట్లు వెటకారిస్తుంటారు.

7. మీది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా ?

7. మీది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా ?

ఈ ప్రశ్న ఎవరైనా అడిగితే ఆ వ్యక్తి వైపు చూసి, కళ్ళు పెద్దవి చేసి, ఒక వికారమైన నవ్వుతో, ఆ ప్రశ్న అడిగినందుకు ఆ వ్యక్తిని చంపేద్దామా అన్నంత కోపం వస్తుంది. ముఖ్యంగా మిమ్మల్ని ఏ వ్యక్తులైతే మీకు పెళ్లి జరిగిందని నమ్మరో, అటువంటి వ్యక్తులు ఇటువంటి ప్రశ్నలను అడుగుతుంటారు. మీరు ఎటువంటి వ్యక్తి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇలా ప్రశ్నిస్తుంటారు. మీ జీవితం ఎంత బాగుందో తెలుసుకోవడానికి కూడా ఇలాంటి ప్రశ్నలను సంధిస్తుంటారు.

మ్యారేజ్ అయ్యాక మొదటి ఏడాదికి ఎందుకంత ప్రాధాన్యత ?

8. మనం ఎప్పుడు మీ భాగస్వామిని కలవబోతున్నాం ?

8. మనం ఎప్పుడు మీ భాగస్వామిని కలవబోతున్నాం ?

నాకు పెళ్లయింది అని చెప్పిన మరు క్షణం, చాలామంది వ్యక్తులు మీ భాగస్వామిని కలవాలని విపరీతంగా తాపత్రయ పడుతుంటారు. అలా వాళ్ళు అడుగుతున్నప్పుడు, అది చూడటానికి ముచ్చటవేస్తుంది. కానీ, కొన్ని సందర్భాల్లో వాళ్ళు అడిగే విధానం ఎలా ఉంటుందంటే, మన వైవాహిక జీవితంలో రహస్యాలు ఏవో తెలుసుకోవాలని అడుగుతున్నట్లు స్పష్టం గా అర్ధం అవుతుంది.

9. పెళ్లి చేసుకోవడం వల్ల లాభం ఏమిటి ?

9. పెళ్లి చేసుకోవడం వల్ల లాభం ఏమిటి ?

మీరు ఎప్పుడైనా భోజనం ఇంటి నుండి తెచ్చుకోకపోయినా లేదా ఇంటికి కొద్దిగా ఆలస్యంగా వెళ్లినా, చాలామంది మీ చుట్టూ ఉన్న వ్యక్తులు వెటకారంగా మాట్లాడుతుంటారు. ఇంకా ఎందుకు ఇంటికి వెళ్ళలేదు ? ఈ మాత్రం దానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు ? పెళ్లి చేసుకున్నా కూడా ఇంకా వేరే వారిపై ఎందుకు ఆధారపడుతున్నారు? ఇలా ఎన్నో మాటలు అంటుంటారు. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్లకు ఇష్టం అయినట్లు ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోతుంటారు. మీ భాగస్వామికి వేరే ప్రపంచం ఏది ఉండకూడదు మీరు తప్ప అన్నట్లు మాట్లాడుతుంటారు. అంతేకాకుండా మీ భాగస్వామి లేకుండా మీరు జీవించలేరా అన్నట్లు మాట్లాడుతారు.

10. మీరు వంట చేస్తారా లేదా మీ భర్త నిజంగానే వంట చేస్తారా ?

10. మీరు వంట చేస్తారా లేదా మీ భర్త నిజంగానే వంట చేస్తారా ?

పెళ్ళైన వారిని దృష్టిలో ఉంచుకొని చాలా మంది ఎన్నో ఊహాగానాలు చేస్తుంటారు. ఎవరి వైవాహిక జీవితం వాళ్లకు నచ్చినట్లు ఉంటుంది. వారిద్దరికీ ఇష్టమైన విధంగా వాళ్ళు బ్రతుకుతారు. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త వంట చేస్తే ఏమవుతుంది లేదా భార్య కార్ ని డ్రైవ్ చేస్తే ఏమవుతుంది. అది వాళ్ళ ఇష్టం కదా అని వదిలేయవచ్చు. కానీ, కొంతమంది మాత్రం ఇదేదో జరగరానిది జరిగిపోయింది అన్నట్లు కొద్దిగా ఆశ్చర్యానికి లోనైపోయి, మీరెందుకు అలా చేస్తున్నారు ? వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని విచిత్ర ప్రశ్నలు అడుగుతుంటారు.

పెళ్లైన జంటలు దీనిని చదివితే గనుక వీటితో మీరు ఏకిభవిస్తారా ? ఇంకా మీరేవైనా ఎదుర్కొన్న ప్రశ్నలు ఉంటే వాటిని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.

English summary

Things Married People Are Tired Of Hearing!

Things Married People Are Tired Of Hearing!Often we run into married people or even people who are about to tie the knot and we ask these questions about their plans. And even though we may have no intentions of hurting them, the way we ask the questions or phrase them, has the tendency to annoy them. So just so you know here are some of the things married people are tired of answering:
Subscribe Newsletter