మా ఫస్ట్ నైట్ అయిపోయాక మా ఆయన మరో అమ్మాయితో రొమాన్స్ మొదలుపెట్టాడు - My Story #72

Written By:
Subscribe to Boldsky

నా పేరు నూర్జహాన్. నాకు ఐదుగురు అక్కలు. ఐదుగురు అన్నలున్నారు. మా ఇంట్లో అందరికన్నా నేనే చిన్నదాన్ని. నేనంటే మా ఇంట్లో అందరికి ప్రాణం. నాకు అందరూ బాగా చూసుకునేవారు. నేను ఇంటర్ వరకు చదివాను. తర్వాత నా చదువు బంద్ చేయించారు.

తెలిసిన అబ్బాయికిచ్చి నిఖా

తెలిసిన అబ్బాయికిచ్చి నిఖా

నాకు పెళ్లి చేస్తే ఒక పని అయిపోతుందనుకున్నారు మావాళ్లు. మా అన్నలకు తెలిసిన అబ్బాయికిచ్చి నిఖా చేశారు. అతనికి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ఒక తమ్ముడు పోలీస్. ఇంకో తమ్ముడు అప్పుడు డిగ్రీ చదువుకునేవాడు. నిఖా చాలా గ్రాండ్ గా చేశారు.

నేను అత్తగారింట్లో కాలు పెట్టగానే

నేను అత్తగారింట్లో కాలు పెట్టగానే

మా ఆయన అంతకు ముందు కాంట్రాక్ట్ జాబ్ చేసేవాడు. నా పెళ్లి అయిన మూడు రోజులకు అతని జాబ్ పర్మనెంట్ అయిపోయింది. నేను అత్తగారింట్లో కాలు పెట్టగానే అంతా మంచే జరిగిందని అందరూ సంతోషపడ్డారు.

పొంగిపోయాను

పొంగిపోయాను

పుట్టినింటి నుంచి వస్తూవస్తూ అదృష్టం కూడా తీసుకొచ్చావని మా అత్తగారింట్లో నన్ను పొగిడారు. మా ఆయన జాబ్ పర్మినెంట్ కావడంతో నేను పొంగిపోయాను. చాలా ఆనందపడ్డాను. ఇక ఏ టెన్షన్ లేకుండా జీవితం సాగిపోతుందనుకున్నాను.

ఫస్ట్ నైట్

ఫస్ట్ నైట్

ఇక మా పెద్దవాళ్లు మాకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. మా ఆయన నాపై చూపించిన ప్రేమకు నేను తట్టుకోలేకపోయాను. నిన్ను పెళ్లి చేసుకున్న మరుక్షణమే నా జీవితం పూర్తిగా మారిపోయిందని ఫస్ట్ నైట్ రోజు భలే మురిసిపోయాడు.

స్వర్గం అంచుల దాకా వెళ్లొచ్చాం

స్వర్గం అంచుల దాకా వెళ్లొచ్చాం

ఆ ప్రేమను మొత్తం రొమాన్స్ రూపంలో నాకు అందించాడు. ఆ నైట్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశాం. నన్ను ముద్దుల్లో ముంచెత్తాడు. స్వర్గం అంచుల దాకా వెళ్లొచ్చాం. తనివి తీరా నేను దాచుకున్న సొగసుల్ని మొత్తం దోచుకున్నాడు.

ఇంకో కొత్త అమ్మాయి

ఇంకో కొత్త అమ్మాయి

పెళ్లి అయి పది రోజులు కూడా కాకముందే నా జీవితం అలా తలకిందులు అవుతుందని అనుకోలేదు. పెళ్లయిన వారానికి నేను పుట్టినింటికి వెళ్లాల్సి వచ్చింది. తర్వాత రెండు రోజులకు వచ్చే సరికి మా ఇంట్లో ఇంకో కొత్త అమ్మాయి ఉంది.

ఒకరికొకరు ముద్దులుపెట్టుకుంటూ

ఒకరికొకరు ముద్దులుపెట్టుకుంటూ

ఆ అమ్మాయి ఎవరని మా ఆయనను అడిగాను. తన అత్త కూతురని చెప్పాడు. ఏదో రెండు రోజులు ఉండి పోవడానికి వచ్చిందనుకున్నాను. నేను బాత్రూమ్ లో స్నానం చేయడానికి వెళ్లాను. నేను తిరిగి వచ్చేసరికి బెడ్ రూమ్ లో మా ఆయన, ఆ అమ్మాయి ఒకరికొకరు ముద్దులుపెట్టుకుంటూ కనపడ్డారు.

నన్ను నేను తిట్టుకున్నాను

నన్ను నేను తిట్టుకున్నాను

నేను షాక్ అయ్యాను. నన్ను పెళ్లి చేసుకుని.. పెళ్లాన్ని పక్కనే ఉండగానే మా ఆయన అలా వేరే అమ్మాయితో రొమాన్స్ చేస్తుండడంతో నాకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఇలాంటి వాడినా నేను చేసుకుంది అనుకుని ఏడ్చాను. నా రాత ఇలా అయిపోయిదేమిటని నన్ను నేను తిట్టుకున్నాను.

చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నానని

చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నానని

మా ఆయనను ఆ అమ్మాయితో ఉన్న సంబంధంపై నిలదీశాను. ఆమెను చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నానని.. కాకపోతే తప్పని పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. మరి అంతగా ప్రేమిస్తే ఆమెనే పెళ్లి చేసుకోవాల్సి కదా నన్ను ఎందుకు చేసుకున్నావని ప్రశ్నించాను.

అమ్మాయి ఇంట్లో వాళ్లను ఎదురించింది

అమ్మాయి ఇంట్లో వాళ్లను ఎదురించింది

"అప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి. అందుకే నేను ఏమి చేయలేకపోయాను. నా జాబ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉండడంతో నాకు ఆ అమ్మాయిని ఇవ్వడానికి వాళ్ల ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదన్నారు. ఇప్పుడు జాబ్ పర్మనెంట్ అయ్యింది. ఆ అమ్మాయి కూడా వాళ్ల ఇంట్లో వాళ్లను ఎదురించి నా దగ్గరకు వచ్చింది." అని అన్నాడు.

నువ్వు కూడా చాలా ఇష్టం

నువ్వు కూడా చాలా ఇష్టం

"నాకు పెళ్లయిన కూడా నా దగ్గరే ఉంటానంటుంది. అంతగా నన్ను ప్రేమిస్తున్నా ఆ అమ్మాయిని నేను దూరం చేసుకోలేను. తను అంటే నాకు చాలా ఇష్టం. అలా అని నువ్వుంటే ఇష్టం లేదు అని కాదు.. నువ్వు కూడా చాలా ఇష్టం. నిన్ను కూడా ప్రేమగానే చూసుకుంటాను. " అన్నాడు.

ఇంటికి పెద్ద కోడలివి నువ్వే

ఇంటికి పెద్ద కోడలివి నువ్వే

"ఆ అమ్మాయి మనతో పాటు మన ఇంట్లోనే ఉంటుంది. ఇంటికి పెద్ద కోడలివి నువ్వే. నీకే సర్వాధికారాలుంటాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు ఏ లోటు రానివ్వను" అని అన్నాడు. ఇలాంటి మాటలను ఏ అమ్మాయి నమ్మదు.. నువ్వు నా ముందే ఇంకో అమ్మాయితో కులుకుతూ ఉంటే నేను చూడలేను అన్నాను.

అమ్మాయిని అలాగే ఉంచుకున్నాడు

అమ్మాయిని అలాగే ఉంచుకున్నాడు

అయినా నా భర్త వినలేదు. ఆ అమ్మాయిని అలాగే ఇంట్లో ఉంచుకున్నాడు. ఆ అమ్మాయి వాళ్ల అన్నలతో, తల్లిదండ్రులతో కూడా రాజీ కుదుర్చుకున్నాడు. వాళ్ల నుంచి అతనికి ఎలాంటి ప్రాబ్లం రాలేదు.

నా ముందే రొమాన్స్

నా ముందే రొమాన్స్

నా ముందే రోజు ఆమెతో రొమాన్స్ చెయ్యడం. రాత్రి తన పక్కనే పడుకోవడం.. నన్ను పట్టించుకోకపోవడం చేసే సరికి నాకు ఒళ్లు మండింది. ఇలాంటి వాడితో కాపురం నేను చెయ్యలేనని మా అన్నలకు చెప్పాను.

ఆమెను విడిచిపెట్టను

ఆమెను విడిచిపెట్టను

వాళ్లందరూ వచ్చి ముస్లిం పెద్దల దగ్గర పంచాయితీ పెట్టారు. నాకు ఇష్టం లేదు... ఆ అమ్మాయిని విడిచిపెడితేనే నేను కాపురం చేస్తాను అన్నాను. అతను నన్ను నమ్మి వచ్చిన ఆ అమ్మాయిని విడిచిపెట్టను. నా భార్యను కూడా బాగా చూసుకుంటాను అన్నాడు.

ఒక్కదాన్నే ఉంటున్నాను

ఒక్కదాన్నే ఉంటున్నాను

కానీ నేను మాత్రం అతనితో ఉండలేనని విడాకులు తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కదాన్నే ఉంటున్నాను. కానీ నా జీవితం ఇలా అవుతుందని నేను అనుకోలేదు. ఒక అబ్బాయిని నమ్మి పెళ్లి చేసుకుని అతనికే సర్వం సమర్పిస్తే నన్ను చివరకు ఇలా చేశాడని బాధ అనిపిస్తూ ఉంటుంది. నాలా ఏ అమ్మాయి జీవితం కాకూడదని కోరుకుంటున్నాను.

English summary

i am just a muslim girl i was upset hurt and disoriented

i am just a muslim girl i was upset hurt and disoriented
Story first published: Saturday, February 3, 2018, 12:00 [IST]
Subscribe Newsletter