For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  రెండో ప్రపంచం యుద్ధానికి సమరానికి ఉన్న సంబంధం ఏమిటి? సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం గురించి నిజాలు

  |

  డాక్టర్ సమరం ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అందరికీ తెలుసు. ఇక గతంలో ఒక వీక్లీలో సెక్సాలజిలో ఆయన కాలమ్ చదివేవారికి ఈయనొక దేవుడు. ఆ వీక్లీ మ్యాగజైన్ ను కేవలం ఈయన కాలమ్ కోసమే కొనే వాళ్లు కూడా చాలామందే ఉండేవారు.

  ఆ పేజీలను చింపుకుని మరీ దాచిపెట్టే జనం కూడా ఉండేవారు. సమరం కేవల సెక్స్ కు సంబంధించిన సలహాలు ఇవ్వడంలో మాత్రమే ఎక్స్ ఫర్ట్ అనుకుంటే పొరపాటు. సమరం గురించి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాఫిక్స్ ఉన్నాయి. అతని పేరు సమరం అని పెట్టడానికి కూడా కారణం ఉంది.

  ఆసుపత్రి చూస్తే షాక్

  ఆసుపత్రి చూస్తే షాక్

  డాక్టర్‌ సమరానికి ఒక హాస్పిటల్‌ ఉంది. సమరం అంటే తెలుగు రాష్ట్రాల్లో అంత ఫేమస్ కదా... అతని ఆసుపత్రి కూడా కార్పొరేట్‌ స్టయిల్లో ఉంటుందనుకుంటే మాత్రం పొరపాటే. కనీసం సెక్యూరిటీ గార్డు కూడా హాస్పిటల్ దగ్గర కనిపించరు.

  సెక్స్ విషయాల్లో చైతన్యం

  సెక్స్ విషయాల్లో చైతన్యం

  సెక్సాలజీ అనే పేరు కూడా తెలియని కాలం నుంచీ నేటి ఇంటెర్నెట్‌ యుగం దాకా... దాదాపుగా 50 ఏళ్లుగా ఆయన సెక్స్‌ విషయాల్లో తీసుకొస్తున్న చైతన్యం, అవగాహన గురించి అందరికీ తెలుసు.

  సమరంలో గోరా

  సమరంలో గోరా

  డాక్టర్ సమరం తండ్రి గోరా. దేశ స్వతంత్ర సమరంలో గోరా కూడా పాల్గొన్నారు. సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాడుతున్న కాలంలో గోరాకు పుట్టిన మగబిడ్డే ఇతను. అందుకే తనకొడుకుకు సమరం గోరా పేరు పెట్టారు.

  అందరివీ ప్రేమ వివాహాలే

  అందరివీ ప్రేమ వివాహాలే

  డాక్టర్ సమరంతో మరో ఎనిమిది మంది సంతానం గోరాకు కలిగారు.

  వారందరివీ కులాంతర, మతాంతర వివాహాలే. గోరా సంతానం, మనవలు, మునిమనవలు కలిపి.. మొత్తం అయిదు తరాల్లో దాదాపు ఎనభై మంది ఉన్నారు. అందరివి ప్రేమ వివాహాలే.

  చిన్నప్పటి నుంచి అలవాటు

  చిన్నప్పటి నుంచి అలవాటు

  గోరా నాస్తికులు. ఎద్దు, పంది మాంసాలతో విందులు ఇచ్చేవారు. అప్పట్లో ఉన్న అంటరానితనం మీద పోరాటం చేసేవారు. గోరా ఇంట్లో ఎప్పుడూ ఉద్యమ వాతావరణమే ఉండేది. ఆయన నాస్తికులు. దాంతో డాక్టర్ సమరానికి కూడా ప్రతీది సైంటిఫిక్‌గా ఆలోచించటం, ప్రశ్నించటం... చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యింది. చిన్నప్పుడే డాక్టర్‌ అవ్వాలని సమరానికి అనిపించింది.

  సెక్సాలజిస్ట్ గా మారడానికి..

  సెక్సాలజిస్ట్ గా మారడానికి..

  సమరం జనరల్‌ డాక్టర్‌ అయినప్పటికీ సెక్సాలజిస్ట్‌గా మారడానికి కొన్ని కారణాలున్నాయి. 1960 ప్రాంతంలో సెక్సాలజీ పట్ల అవగాహన ఎవరికీ లేదు. సమరానికి కూడా లేదు. ఒకసారి గుడివాడ ఏఎన్‌ఆర్‌ కాలేజీలో చదువుతున్న ఒక కుర్రాడిని అతని లెక్చరర్స్‌ గోరా దగ్గరకి తీసుకువచ్చారు. అతనికి పెళ్ళికి ముందు హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఉండేదట.

  భార్య కాళ్ల మీద పడ్డాడు

  భార్య కాళ్ల మీద పడ్డాడు

  మొదటి రాత్రి రోజున అతను, భార్య కాళ్ళ మీద పడిపోయి.. నన్ను క్షమించు, నాకు హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఉంది. నేను పెళ్ళికి పనికిరాను అని ఆమెకి చెప్పేసి, రెండెకరాలు పొలం రాసిచ్చి, విడాకులు తీసుకున్నాడట.

  గోరా దగ్గరకి తీసుకొచ్చారు

  గోరా దగ్గరకి తీసుకొచ్చారు

  పైగా ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసినందుకుగాను ఆ కాలేజ్‌ ముందు సైకిల్‌ షాప్‌ పెట్టి పంక్చర్లు వేయటం, గాలి కొట్టడం మొదలుపెడితే... లెక్చరర్లు గోరా దగ్గరకి అతన్ని తీసుకొచ్చారు. గోరా అప్పుడు హ్యావెలాక్‌ ఎల్లిస్‌ రాసిన పుస్తకం తీసి, అతనికి చూపించి, తొంభై శాతం మగవారు హస్తప్రయోగం చేసుకుంటారనీ, అదేమీ తప్పు కాదనీ వివరించారట.

  పిల్లలు పుట్టారు

  పిల్లలు పుట్టారు

  తర్వాత అతనికి పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు. ఇదంతా అప్పట్లో సమరానికి మైండ్ లో నిలిచిపోయింది. ఆ తర్వాత సమరం మెడిసిన్‌ లో జాయిన్‌ అయ్యాడు. సమరం మెడిసిన్‌ ఫైనల్‌ ఇయర్లో ఒక సంఘటన జరిగింది.

  వీర్యం పోయింది

  వీర్యం పోయింది

  సమరం వాళ్ల ప్రొఫెసర్‌ సత్యనారాయణగారు ఒకసారి క్లాస్‌కి లేట్‌గా వచ్చారు. ‘నేనెందుకు లేట్‌గా వచ్చానో తెలుసా? నా దగ్గరకి ఒక ఐఏఎస్‌ ఆఫీసర్‌ వచ్చాడు. త్వరలో పెళ్ళి కాబోతోందట. రాగానే నా కాళ్ళు పట్టేసుకుని, ... నన్ను మీరే కాపాడాలి, నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది, చాలా వీర్యం పోయింది... అని ఏడ్చేశాడు. ' అట.

  ఐఏఎస్ ఆఫీసర్

  ఐఏఎస్ ఆఫీసర్

  ‘ఐఏఎస్‌ ఆఫీసర్.. చదువుకున్నాడు కానీ, వాడి గురించి వాడేం చదువుకోలేదు. ఇలాంటి వాళ్ళందరికీ మీరు రేపు చదువు చెప్పాలి' అని ప్రొఫెసర్ చెప్పాడట. జనాలు కనీస విజ్ఞానం లేక జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఇలాంటి విషయాల వల్ల అనిపించింది.ఈ రెండు ఘటనలు సమరం జనరల్‌ ఫిజీషియన్‌ నుంచి సెక్సాలజిస్ట్‌గా మారటానికి ప్రధాన కారణాలు.

  స్నేహితులు డౌట్స్ అడిగేవారు

  స్నేహితులు డౌట్స్ అడిగేవారు

  1970 మార్చి 4న సమరం ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. మొదట్లో తన స్నేహితులు, పరిచయం ఉన్న కుర్రాళ్ళు అంగం సైజ్‌, స్వప్న స్కలనాలు, హస్తప్రయోగం తాలూకు అనుమానాలు అడిగేవారు. అప్పటిదాకా నాకు ప్రజలకి ఇంత అవగాహన లోపం ఉందని కానీ.. ఇవి సీరియస్‌గా చెప్పాల్సిన అంశాలు అని కానీ సమరానికి అనిపించలేదు.

  రేడియాలో టాక్ షో

  రేడియాలో టాక్ షో

  సమరం దగ్గరకి సెక్స్‌ సంబంధించిన అపోహలతో వచ్చేవారి వారి సంఖ్య బాగా పెరిగింది. దానితో 1974 ఫిబ్రవరి, మార్చి టైమ్‌లో ఒకసారి విజయవాడ ఆలిండియా రేడియోలో.. ‘సెక్స్‌ గురించి కొన్ని అపోహలు' అని ఒక టాక్‌ షో చేశారు.

  అది రికార్డ్

  అది రికార్డ్

  అప్పుడు రేడియో వారికి ఏకంగా పదివేల ఉత్తరాలు వచ్చాయి. అది ఇప్పటికీ ఒక రికార్డే. ఆ టాక్‌ షోను ఒక పత్రిక నిర్వాహకులు కూడా విన్నారు. ఆయన తన పత్రికలో సెక్స్‌ సమస్యల మీద డాక్టర్ సమర ‘కాలమ్‌' ఉండాలి అని పట్టుబట్టారు.

  నిష్ణాతుడు కాదు

  నిష్ణాతుడు కాదు

  నిజానికి అప్పుడు డాక్టర్ సమరం అవగాహన కొద్దిగా ఉందే తప్ప తానేం సబ్జెక్టులో నిష్ణాతుడు కాదు. ఆ పత్రిక నిర్వాహకులకు డాక్టర్ సమరం అదే చెప్పారు.

  మీరు రాయాల్సిందే

  మీరు రాయాల్సిందే

  ‘లేదండి, ఈ మాత్రం చేప్పేవారు కూడా లేరు. ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్‌. మీరు రాయల్సిందే. రీసెర్చ్‌కి ఏది కావాలన్నా నేను ఇస్తాను' అనటంతో సమరం ధైర్యంగా అడుగేశారు.

  స్పందన పెరిగింది

  స్పందన పెరిగింది

  ఇక డాక్టర్ సమరం ఆర్టికల్‌కి స్పందన అలా ఉంటుంది అనేది అతనే ఊహించలేదు. అప్పట్లో ఆ ప్రధాన పత్రిక వాళ్ళు పాఠకుల ఉత్తరాలు హైదరాబాద్‌ నుంచి విజయవాడకి యూరియా సంచుల్లో పంపించేవారు.

  1000 ఉత్తరాలు

  1000 ఉత్తరాలు

  సమరం అన్నేసి ఉత్తరాలు చదవలేకపోయేవారు. వారానికి ఒకసారి అనుకున్న తన ఆర్టికల్‌ వారానికి రెండుసార్లు అయింది. అయినా అదే స్థాయిలో ఉత్తరాలు! అలా దాదాపు ఏడేళ్ళు ఆ ప్రధాన పత్రికలో పని ఆర్టికల్స్ రాశారు. తర్వాత మరో పత్రికలో, తర్వాత మరో మేగజైన్ లో డాక్టర్ సమరం కాలమ్ ప్రత్యేకంగా వచ్చేది. సమరానికి రోజుకి సుమారు 1000 ఉత్తరాలు దాకా వచ్చేవి.

  సమరానికి వ్యతిరేకంగా

  సమరానికి వ్యతిరేకంగా

  సెక్స్‌ విషయంలో సనాతనులు అప్పుడూ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. దాంతో సమరానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసిన వారు చాలామందే ఉన్నారు. సమరం మీద పెద్ద పెద్ద పుస్తకాలు, కరపత్రాలు వేశారు.

  సమరానికి పిచ్చి ఎక్కింది

  సమరానికి పిచ్చి ఎక్కింది

  ‘సమరంకి పిచ్చి ఎక్కింది. నెలసరి రక్తం ఏమీ చెడు రక్తం కాదంటాడా? నెలసరిలో కూడా రతిలో పాల్గొనచ్చు అంటాడా? హస్తప్రయోగం తప్పు కాదంటాడా? ఇతనికి మతిపోయింది' అని పత్రికల్లో రాసేవారు. బెదిరిస్తూ ఉత్తరాలు రాసేవారు.

  క్లాసుల్ని అడ్డుకున్నారు

  క్లాసుల్ని అడ్డుకున్నారు

  సమరం క్లాసుల్ని అడ్డుకునేవారు. అయినాసరే.. సమరం కానీ, సమరాన్ని ఆహ్వానించిన వారు కానీ ఏనాడూ ఆగిపోలేదు. ‘ఐ డిడింట్‌ కేర్‌ ఎనీబడీ' అంటాడు సమరం. ఈ రోజుకి కూడా సమరం ఎవ్వరినీ కేర్‌ చేయరు. తాను చదువుతారు. సైంటిఫిక్‌గా చెబుతారు. కొన్ని వేల క్లాసులు సమరం తీసుకున్నారు. లక్షలమందికి ఉత్తరాల ద్వారా విఙ్ఞానం అందిస్తూనే ఉన్నారు. ఇదంతా ఒక ఉద్యమం లాగానే చేశారు.

  కో ఆపరేషన్ ఉండాలి

  కో ఆపరేషన్ ఉండాలి

  "మగవాడు అనగానే ఆడదానితో.. మొదటిసారి అయినా సరే రతి జరపాలి; అమ్మాయి అనగానే.. సిగ్గుపడి, భయపడాలి. అని నూరిపోసింది మన పితృస్వామ్య సమాజం. ఫలితం.. మగవాళ్ళలో పెర్ఫార్మన్స్‌ యాంగ్జయిటీ, ఆడవాళ్ళలో వాజినైస్మస్‌ (రతి పట్ల భయం). కాస్త ఎడ్యుకేషన్‌, కౌన్సెలింగ్‌, భార్యాభర్తల మధ్య కో ఆపరేషన్‌ ఉంటే ఈ సమస్యల్ని తీర్చవచ్చు. అంటారు సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం.

  లైంగిక విజ్ఞానం అవసరం

  లైంగిక విజ్ఞానం అవసరం

  " అసలు ఇలాటి భయాలు లేకుండా పోవాలి అంటే.. పిల్లలకు లైంగిక విజ్ఞానం అందించండి. అందరూ కులం, మతం ప్రసక్తి లేకుండా ప్రేమించి, పెళ్ళిళ్ళు చేసుకోండి. సగం పైన సెక్స్‌ సమస్యలు తగ్గిపోతాయి." అంటారు సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం.

  రక్తం సేకరించాం

  రక్తం సేకరించాం

  " మేము నడుపుతున్న నాస్తిక కేంద్రానికి ఇప్పుడు నేనే ఛైర్మన్‌. దాదాపు ఎనభై ఆరువేల యూనిట్లకు పైగా రక్తం రక్తదానం ద్వారా సేకరించగలిగాం. ‘స్వేచ్చ ఐ బ్యాంక్‌' ద్వారా తొమ్మిదివందల మందికి కళ్ళు ఇప్పించగలిగాం. " అని అంటారు సమరం.

  ఎవ్వరైనా ఛైర్మన్‌ కావొచ్చు

  ఎవ్వరైనా ఛైర్మన్‌ కావొచ్చు

  " పోలియో కరెక్టివ్‌ సర్జరీలు, హెచ్‌.ఐ.వి. అవగాహన క్యాంపులు ఎన్నో చేశాను. ప్రజల్లో ఉన్న జ్యోతిష్యం, వాస్తు, బాణామతి లాంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. రేపు నేను కాకుండా ఈ నాస్తిక కేంద్రానికి ఎవ్వరైనా ఛైర్మన్‌ కావొచ్చు. ఇది శాస్త్రీయంగా ఆలోచించేవారి అందరి ఆస్తి." అంటారు సరం.

  డబ్బులు లేక..

  డబ్బులు లేక..

  " డబ్బులు లేక సమరం గారి దగ్గర చూపించుకోలేకపోయాను అనే మాట నా హాస్పిటల్లో వినడానికి వీలు లేదు. ఈ రోజుకీ చాలా తక్కువ ఖర్చుకే వైద్యం, ఆపరేషన్లు చేస్తాను. నా జీవితంలో బద్ధకించడం కానీ, టైం వేస్ట్‌ చేయటం కానీ అసలు ఉండవు." అంటారు సమరం.

  ఆదివారం కూడా ..

  ఆదివారం కూడా ..

  " సెలవు, అలసిపోవడం అనేవి ఉండవు. ఆదివారం కూడా నాస్తిక కేంద్రం పనులు చూస్తాను. విపరీతంగా పుస్తకాలు చదువుతాను. భగవద్గీత, మహాభారతం, రామాయణం, బైబిల్‌, ఖురాన్‌ సహా... చాలా మతగ్రంథాలు చదివాను. నేను అందరికి చెప్పేది ఒక్కటే.. ఏదైనా సరే సైంటిఫిక్‌గా ఆలోచించండి. సైన్స్‌ మాత్రమే సమాజాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఇదే నేను నమ్మేది, చెప్పేది." అంటారు సమరం.

  జననాంగాలని పరిచయం చేయం

  జననాంగాలని పరిచయం చేయం " మనం చిన్న పిల్లలకి ‘ఇది కాలు’, ఇది తల’ అంటూ శరీరంలోని ఒక్కో భాగాన్నీ పరిచయం చేస్తాం. కానీ మన జననాంగాలని మాత్రం పరిచయం చేయం. ఎందుకు? ప్రతి తల్లి తండ్రి ఈ ప్రశ్న వేసుకోవాలి. సెక్స్‌ ఎడ్యుకేషన్‌ అంటే కేవలం పునరుత్పత్తి, రతి కాదు. మన శరీరంలో భాగాల గురించి, వాటిలో జరిగే మార్పుల గురించి చెప్పి తీరాలి." అంటారు సమరం.

  " మనం చిన్న పిల్లలకి ‘ఇది కాలు', ఇది తల' అంటూ శరీరంలోని ఒక్కో భాగాన్నీ పరిచయం చేస్తాం. కానీ మన జననాంగాలని మాత్రం పరిచయం చేయం. ఎందుకు? ప్రతి తల్లి తండ్రి ఈ ప్రశ్న వేసుకోవాలి. సెక్స్‌ ఎడ్యుకేషన్‌ అంటే కేవలం పునరుత్పత్తి, రతి కాదు. మన శరీరంలో భాగాల గురించి, వాటిలో జరిగే మార్పుల గురించి చెప్పి తీరాలి." అంటారు సమరం.

  రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పుట్టారు

  రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పుట్టారు

  అయితే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పుట్టారు కాబట్టి ‘సమరం' అనే పేరు పెట్టారట..సమరం తండ్రి గోరా. నిజానికి సమరం మగజాతి ఆణిముత్యమే.

  English summary

  interesting facts about dr samaram

  interesting facts about dr samaram
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more