For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్వే! పడకగదిలో పార్ట్ నర్ పక్కనే ఉన్నా.. పురుషులు ‘ఆ’ కార్యంపై ఆసక్తి చూపలేదట...!

|

సరిగ్గా సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్న జంటలు కాసేపు కలిసి గడపాలంటే.. అస్సలు తీరిక దొరికేది కాదు. ఒకవేళ ఇద్దరు కలిసినా అదంతా హడావుడిగా ఉండేది. చాలా మంది ఉరుకుల పరుగుల జీవితంలో పడిపోయి తమ పర్సనల్ లైఫ్ కు కావాల్సినంత టైమ్ కేటాయించలేకపోయేవారు.

అయితే కరోనా మహమ్మారి వచ్చిన మొదట్లో లాక్ డౌన్ కారణంగా కపుల్స్ కు కావాల్సినంత సమయం దొరికేలా చేసింది. దీంతో చాలా మంది జంటలు దొరికిందే ఛాన్స్ అన్నట్టు తొలి రెండు.. మూడు నెలలు పడకగదిలో రతి మన్మథుల్లా రెచ్చిపోయారు.

ఆ సమయమంతా అంతా సజావుగానే సాగింది. లేక లేక దొరికిన ఈ సమయాన్ని చాలా మంది భార్యభర్తలు బాగానే ఆస్వాదించారు. అయితే ఇదంతా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్ర పోయేంత వరకు దంపతులిద్దరూ ఎదురెదురుగా ఉండటంతో వారికి కలయిక విషయంతో పాటు చాలా విషయాల్లో ఆసక్తి తగ్గిపోయింది.

అసలు రొమాన్స్ అంటేనే చాలా బోరింగ్ గా మారిపోయిందట. దీంతో కలయికలో కూడా చాలా దూరం పెరిగిందని ఓ సర్వే సంస్థ తెలిపింది. ఆ సర్వేలో ఇంకా ఏయే విషయాలు వెలుగులోకొచ్చాయి.. ఎందుకని ఆలుమగలిద్దరూ 'ఆ' కార్యంపై ఆసక్తి తగ్గించుకున్నారనే వివరాలను ఇప్పడు తెలుసుకుందాం...

నా గర్ల్ ఫ్రెండ్ అప్పటి నుండి అంతా ఫోన్లేనే చేద్దామంటోంది... నాకేమి చేయాలో అర్థం కావట్లేదు'

ఖాళీ టైమ్ కోసం..

ఖాళీ టైమ్ కోసం..

ఒకప్పుడు పెళ్లి అయిన జంటలు తమకు ఎప్పుడెప్పుడు ఖాళీ సమయం దొరుకుతుందా ఎంతో ఆశగా ఎదురుచూసేవారు. ఎందుకంటే కరోనాకు ముందు చాలా మందిది ఉరుకులు, పరుగుల జీవితం. మనలో ఎంతో మందికి కనీసం ప్రశాంతం కూర్చుని తినే తీరిక కూడా ఉండేది కాదు.

కలయిక విషయంలో..

కలయిక విషయంలో..

ఇక రొమాన్స్ విషయానికొస్తే.. ఎప్పుడెప్పుడు ఖాళీ సమయం దొరుకుతుందా ఎంతో ఆత్రుతగా ఎదురుచూసేవారు. దొరికిన కాస్త సమయాన్ని బాగా వినియోగించుకుని.. కలయికలో పాల్గొని జంటలిద్దరూ ఆస్వాదించేవారు.

లాక్ డౌన్ తర్వాత..

లాక్ డౌన్ తర్వాత..

అయితే కరోనా లాక్ డౌన్ తర్వాత భార్యభర్తలిద్దరి పరిస్థితుల్లో పూర్తిగా మార్పులొచ్చాయి. చాలా మంది ఇంట్లో నుండే ఉద్యోగం చేయడం.. ఇంట్లో నుండి బయట అడుగు పెట్టడం కూడా కష్టంగా ఉండటంతో.. ఆవాలు గింజల నుండి ఆలివ్ ఆయిల్ వరకు.. సూది గుండు నుండి ఇతర వస్తువులన్నీ ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చేవారు.

ఇలాంటి పర్సనాలిటీ ఉండే మగవారిని మహిళలు ఎక్కువగా ఇష్టపడతారట...!

మొదట్లో మంచిగా..

మొదట్లో మంచిగా..

అయితే కరోనా పుణ్యమా కపుల్స్ కు కలయికలో పాల్గొనేందుకు కావాల్సినంత సమయం దొరికిందని భావించారు. అందుకు తగ్గట్టుగానే తొలి రెండు.. మూడు నెలలు ఆలుమగలిద్దరూ రతి, మన్మథుల్లా రెచ్చిపోయారు. ఇలాంటి ఛాన్స్ మళ్లీ మళ్లీ రాదనుకుని బాగా ఎంజాయ్ చేశారు కొందరు. అయితే ఆ తర్వాత రొమాన్స్ అంటే ఆసక్తి మొత్తం తగ్గిపోయింది.

ఒకరిపై ఒకరికి

ఒకరిపై ఒకరికి

కలయిక, రొమాన్స్ అనే పేర్లు ఎత్తితేనే ఇద్దరికి చిరాకు వచ్చేసింది. సెక్స్ అంటేనే చాలా బోరింగ్ వచ్చేసింది. దీంతో కలయిక విషయంలో ఇద్దరి మధ్య ఆటోమేటిక్ గా దూరం పెరిగిపోయింది. అంతేకాదు ఆలుమగలిద్దరి మధ్య ఆప్యాయతలు, అనురాగం, ప్రేమ కూడా తగ్గిపోయింది.

విస్తుపోయే వాస్తవాలు..

విస్తుపోయే వాస్తవాలు..

లాక్ డౌన్ సమయంలో భార్యభర్తల మధ్య కలయిక గురించి United Kingdom(UK)లో ఇటీవల నిర్వహించిన సర్వేలో కొన్ని విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. ఈ సమయంలో చాలా మంది కపుల్స్ అతి తక్కువ సమయమే ఆ కార్యంలో పాల్గొన్నారని ఈ సర్వే స్పష్టం చేసింది.

మగువల నుండి మగవారు ఎక్కువగా ‘అవే'ఆశిస్తున్నారంట...!

విపరీతమైన ఒత్తిడి..

విపరీతమైన ఒత్తిడి..

అయితే అందుకు ప్రధాన కారణం ఏంటంటే.. కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది జంటల్లో విపరీతమైన ఒత్తిడి, ఆందోళన ఉండేవని ఆ సర్వేలో వెల్లడైంది. దీంతో కపుల్స్ మధ్య కలయిక విషయంలో విముఖత ఏర్పడిందని ఆ సర్వే ద్వారా తెలిసింది.

అందుల్గొనలేదట.కే పా.

అందుల్గొనలేదట.కే పా.

మరోవైపు పెళ్లి అయిన జంటలకు బోరింగ్ గా ఉంటే.. ప్రేమికులకు లాక్ డౌన్ కారణంగా సరైన వసతులు లేకపోవడం.. ఇతర కారణాలతో కలయికలో పాల్గొనలేకపోయామని సర్వేలో పాల్గొన్న వారు చెప్పారట. లాక్ డౌన్ వల్ల ఒంటరిగా ఉండటంతో చాలా మందిలో ఆందోళన, కోపం, చిరాకు వంటి లక్షణాలు పెరిగిపోయాయని, అందుకే దానిపై అంతగా ఆసక్తి చూపలేకపోయారని నిపుణులు చెప్పారు.

మరో పరిశోధనలో..

మరో పరిశోధనలో..

అయితే ఎన్ని సమస్యలున్నా.. జంటలు కలయికలో పాల్గొన్న సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్ అనే హార్మోన్ వల్ల మనలో ఏర్పడే ఒత్తిడి, ఆందోళన ను దూరం చేస్తుందని పరిశోధనలు స్పష్టం చేశాయి. అలాగే, వారంలో కనీసం ఒకట్రెండు సార్లు కలయికలో పాల్గొంటే ఒత్తిడి, చిరాకు వంటి వాటిని సులభంగా ఎదుర్కోవచ్చని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ స్కాట్లాండ్ పరిశోధనలో తేలింది.

కరోనా అప్ డేట్స్ వల్ల..

కరోనా అప్ డేట్స్ వల్ల..

మరోవైపు కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉన్న సమయంలో కలయిక కొంచెం కష్టం అవుతుందని కొందరు చెప్పగా.. కరోనా గురించి నిరంతరం వస్తున్న సమాచారం తెలుసుకోవడం ద్వారా, అనవసరమైన ఆందోళనకు గురై కలయిక పట్ల ఆసక్తి తగ్గించుకున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.

మగవారికే అయిష్టత..

మగవారికే అయిష్టత..

ఆలుమగలిద్దరిలో కలయిక గురించి ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా ఆ పరిస్థితి మొత్తం పూర్తిగా మారిపోతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సర్వేలో మహిళల కన్నా మగవారే ఆ కార్యంపై ఆసక్తి చూపలేదని ఫలితాల ద్వారా తెలుస్తోంది.

English summary

Love Under Lockdown: How Couples Can Cope During COVID-19 In Telugu

Here we talking about the love under lockdown : how couples can cope during covid-19 in Telugu. Read on.
Story first published: Monday, January 4, 2021, 16:11 [IST]