For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గాయిత్రి మంత్రం 108 సార్లు పఠించడం వల్ల పొందే ప్రయోజనాలు ఏంటో తెలుసా

|

జ్ఞాపకశక్తిని విరివిగా వినియోగించగల మనుషులమై ఉన్న కారణంగా, ఈ ప్రపంచమంతా వివిధ శక్తుల ఉనికికి, మరియు వివిధ రకాల ప్రకంపనలతో ప్రతిధ్వనిస్తోందని మనకు తెలుసు. ఈ ప్రకంపనల అనుభూతిని పొందాలంటే, మనం మన మనస్సులని ఒక స్థాయికి తీసుకుని వెళ్ళి, వాటిని అనుసంధానించడానికి, మరియు వాటిని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా కొన్ని మార్గాలను అనుసరిస్తూ ఉండాలని చెప్పబడుతుంది. ఇది జీవితంలో విభిన్న కోణాలను చూసేందుకు అనుగణంగా ఉంటుంది. కానీ, ఇది ఎంతవరకు సాధ్యం?

ఆక్రమంలో భాగంగా, ప్రకంపనలు ఉన్నచోటే ధ్వనులు కూడా ఉంటాయనే సరళమైన భావనను మనం అర్థం చేసుకోవలసి ఉంటుందని మరువకండి. మరి చుట్టూ ఉన్న శక్తులతో ఎలా అనుసంధానాన్ని ఏర్పరచుకోవాలి ? అంటే, ఇది మంత్రాల ద్వారానే సాధ్యమని చెప్పబడుతుంది.

Gayatri Mantra

మంత్రాలు పునరుచ్చారణలోనికి వచ్చినప్పుడు, అవి మన అంతర్గత మనస్సు లోతులలోనికి చొచ్చుకునిపోతాయి. బిగ్గరగా ఉచ్చరించడం, మానసికంగా పఠించడం లేదా కేవలం వినడం ద్వారా కూడా మంత్ర ప్రభావాలను పొందవచ్చు. కొన్నిసార్లు మంత్రాలు పునరుచ్చారణలోనికి వచ్చినప్పుడు, నిర్ధిష్ట ఫలితాల దిశగా వీటిని అవాహన చేసుకోడానికి సహాయపడుతుంది.

' మంత్రం ' అనే పదం ' మన్ ' అనే సంస్కృత పదం నుంచి జనించింది. మన్ అనగా 'మనసు లేదా ఆలోచించడం' అని అర్ధం. అదేక్రమంలో భాగంగా' త్రై ' అంటే ' రక్షణ ', లేదా ' విముక్తి ' అని అర్థం ఉంటుంది. కావున, మంత్రాలు మనసిక స్థాయిలను పెంచడానికి, మరియు స్వస్థతను చేకూర్చడానికి ఉపయోగపడే సాధనాలు లేదా పరికరంగా భావించబడడం జరుగుతుంది. సావిత్రీ మంత్రం అని కూడా పిలువబడే గాయత్రీ మంత్రం, ఋగ్వేదంలో పొందుపరచబడిన, ఒక ప్రాచీన మంత్రంగా చెప్పబడుతుంది. అంతేకాకుండా సూర్యభగవానుని భక్తురాలు సావిత్రికి కూడా అంకితం చేయబడిందని చెప్పబడుతుంది.

ఋషీశ్వరుడు విశ్వామిత్రుడు, గాయత్రి మంత్రాన్ని రచించినవారిగా చెప్పబడుతుంది. ఈ మంత్రాన్ని ఒక నిర్ణీత సంఖ్యలో జపించడం మూలంగా దివ్యశక్తిని, కీర్తిని, సంపదను పొందగలరని చెప్పబడుతుంది. క్రమంగా ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించడం మూలంగా కలిగే ప్రయోజనాల గురించిన వివరాలను ఈ వ్యాసంలో పొందుపరచడం జరిగింది.

గాయత్రీ మంత్రం :

"ఓం భూర్భువస్సువః తత్సర్వితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహీ ధియో యోనః ప్రచోదయాత్"

సరళమైన మాటలలో ఈ క్రింది విధంగా వివరించవచ్చు :

ఓ వేదాలకు అధిపతి అయిన తల్లీ, నీకు ఇవే మా వందనాలు. అన్ని శక్తులను ప్రసరింపజేసే దివ్య జ్యోతిని మాకు అందివ్వు; అదేవిధంగా, మా బుద్ధిని ప్రకాశింపచేసి, చీకటిని తొలగించి నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్దిస్తున్నాం.

ఈ మంత్రాన్ని ఉచ్ఛరించడం కోసంగా, ఒక స్థిరమైన ప్రత్యేక నియమమంటూ లేనప్పటికీ, ఉదయం స్నానం చేసిన తరువాత తెల్లవారుఝామున పఠించిన ఎడల, ఇది అత్యంత సమర్ధవంతమైన ఫలితాలను అందివ్వగలదని భావించబడుతుంది. గాయత్రీ మంత్రాన్ని అనుసరించేటప్పుడు ఎప్పుడూ ఒక ఆసనం మీద కూర్చుని పఠిoచడం మంచిదిగా చెప్పబడుతుంది. అంతేకాకుండా ఒక పూసల మాలను తీసుకుని పూసలు లెక్కపెడుతూ అనుసరించవచ్చునని సూచించబడుతుంది. కళ్లు మూసుకుని అత్యంత భక్తితో సర్వోత్కృష్టమైన దైవం మీద దృష్టి కేంద్రీకరించి, ఈ మంత్రాన్ని 108 సార్లు స్మరించండి.

ఈ గాయత్రీ మంత్రాన్ని రోజులో మూడుసార్లు పఠించడం మూలంగా, మరింత లాభం చేకూరుతుందని చెప్పబడుతుంది.

Gayatri Mantra

108 సార్లు మంత్రం పఠిoచండం ఎందుకు ?

ఆద్యాత్మికంగా 108 అనే సంఖ్యకు ఎక్కువ సంబంధం ఉంటుంది. మరియు ఈ సంఖ్య అనంతశక్తి యొక్క ఉనికికి సంపూర్ణత్వంగా భావించబడుతుంది. క్రమంగా ఇది సూర్యుడిని, చంద్రుణ్ణి, భూమిని కూడా కలుపుతుందని కూడా నమ్మబడుతుంది. అలాగే, 108 శక్తి పీఠాలు, 108 ఉపనిషత్తులు, 108 మర్మ బిందువులు ఒక దేహంపై ఉండడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. జపమాల కూడా 108 పూసలు లేదా రుద్రాక్షలతో కూడుకుని ఉంటుంది. ఒక గురు పూస నుండి ఒక జపం ప్రారంభమై మీ 108వ పూస దగ్గర పూర్తవుతుంది. 108 సంఖ్య మానవులను మాత్రమే కాకుండా మొత్తం సౌరవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుందని చెప్పబడుతుంది.

108 యొక్క లెక్కింపు ఈ క్రింది విధంగా జరుగుతుంది: భారత జ్యోతిష్య గణన ప్రకారం మనకు 108 గ్రహ స్థానాలను ఇచ్చే 9 గ్రహాలు మరియు 12 నక్షత్రాలయాలు, 108 సార్లు మంత్రాన్ని పఠించినప్పుడు, అవి మనలను విశ్వశక్తితో అనుసంధానించడానికి తలుపులు తెరవగలవు అని నమ్మబడుతుంది. క్రమంగా కొన్ని ప్రత్యేక మంత్రాలను 108 మార్లు ఉచ్చరించవలసినదిగా సూచించబడుతుంది.

Gayatri Mantra

మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన చేకూరే లాభాలు :

1. మనసును శాంతపరచుట :

గాయత్రీ మంత్రం ప్రారంభం అయిన ' ఓం ' ను ఉచ్చరించడం ద్వారా ఉత్పన్నమైన ప్రకంపనలు, శరీరంలో ఆనందానికి కారణమయ్యే హార్మోనులను విడుదల చేయడం ద్వారా ప్రశాంతమైన మనస్సును పెంపొందిస్తాయని చెప్పబడుతుంది. గాయత్రి మంత్రంలోని అక్షరాలూ, వ్యక్తి ఏకాగ్రతను పెంచడంలోనే కాకుండా, అభ్యాసాల మీద దృష్టి కేంద్రీకరించడానికి కూడా సహాయపడుతుందని చెప్పబడుతుంది. మరియు నరాలకు ఉపశమనం ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది.

2. విజయవంతమైన వివాహం మరియు ఉన్నతమైన సంబంధాలకు దారితీస్తుంది :

వివాహంలో ప్రతికూల స్థానాల ప్రభావాలను తొలగించడంలో గాయత్రీ మంత్రం శక్తివంతమైనదిగా చెప్పబడుతుంది. క్రమంగా వివాహ విజయావకాశాలను పెంచుతుంది. వివాహంలో జాప్యం, లేదా సంబంధంలో ఆటంకాలు తలెత్తినా, క్రమం తప్పకుండా గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చునని చెప్పబడుతుంది.

3. ఒత్తిడిని జయించడంలో సహాయపడుతుంది మరియు మీ శ్వాసను మెరుగుపరుస్తుంది

గాయత్రీ మంత్రాన్ని పఠించడం ద్వారా మీరు మరింత బలమైన రోగనిరోధక వ్యవస్థను ఏర్పరుచుకోవడానికి దోహదపడుతుంది. మీరు లోతైన నియంత్రిత శ్వాసలను తీసుకోవడానికి సాధ్యపడుతుంది. మరియు క్రమం తప్పకుండా చేసినప్పుడు మీ ఊపిరితిత్తుల విధులను కూడా మెరుగుపరుస్తుందని చెప్పబడుతుంది. కాలక్రమేణా, ఇది మీ హృదయ స్పందనలను సమకాలీకరించడానికి, తద్వారా మీ గుండెను ఆరోగ్యవంతంగా చేయడానికి కూడా సహాయపడుతుంది. మంత్రాన్ని క్రమంతప్పకుండా పఠించడం ద్వారా మీరు మరింత తేజోవంతం అవుతారు.

గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉండగా, ఆ మంత్రం యొక్క ప్రభావం మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం ఆహార దేవత అయిన అన్నపూర్ణగా గాయత్రీ దేవిని భావించడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని తరచుగా పఠించడం మూలంగా జీవితంలో ఆర్ధిక సంవృద్ధి, సంతోషం మరియు అభివృద్ధిని తీసుకురావడానికి దోహదపడుతుంది. మీ నమ్మకమే మీ ప్రయోజనాలకు పునాదిగా ఉంటుందని మరువకండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Benefits of chanting Gayatri Mantra 108 times

conscious human beings we are aware that the whole existence is a reverberation of different energies, different levels of vibrations, isn't it? To feel these vibrations, we should be able to take our minds to a level where we are able to connect to and make use of them in certain ways. This can possibly open up different dimensions within one's life.
Story first published: Friday, May 31, 2019, 12:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more