For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీరాముని నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన లక్షణాలివే...!

|

శ్రీ మహా విష్ణువు యొక్క ఏడో అవతారంగా రాముని అవతారమని చాలా పురాణాలు పేర్కొన్నాయి. విష్ణువు యొక్క పరిపూర్ణమైన అవతారం రాముడు అని కూడా అంటారు. హిందువులలో శ్రీరాముడు అత్యంత ప్రాచుర్యం పొందాడు. ధర్మానికి, న్యాయానికి, నీతికి, మంచికి, మర్యాదకు, విలువలకు, నైతికతకు నిలువుటద్దం శ్రీరాముడు అని చాలా మంది ప్రజల నమ్మకం. త్రేతాయుగంలోని దుష్ట శక్తులను అంతం చేయడానికే శ్రీరాముడు భూమిపై జన్మించినట్లు చాలా మంది భావిస్తారు.

అంతేకాదు రాముడిని సత్యం యొక్క స్వరూపంగా.. ఆదర్శ కుమారునిగా, ఆదర్శ భర్తగా మరియు అన్నింటికంటే ముఖ్యంగా ఆదర్శంతమైన రాజుగా పేరు తెచ్చుకున్నారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అయోధ్యకు రాజకుమారుడైన శ్రీరామ చంద్రుడు తన రాజ వైభోగాన్ని పక్కన బెట్టి తన తండ్రి మాటను జవదాటకుండా 14 సంవత్సరాల పాటు వనవాసం చేసిన గొప్ప త్యాగశీలి. ప్రస్తుతం అలాంటి కుమారులు మచ్చుకైన కనిపించడం కష్టమే. ఎంతసేపు తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టేవారే మనకు ఎక్కువగా కనిపిస్తుంటారు. చాలా మంది రాముని నుండి ఏమి నేర్చుకోవాలో తెలుసుకోలేకపోతున్నారు. ఏప్రిల్ 2వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరూ శ్రీరాముని ఏయే విషయలను నేర్చుకోవాలో మాకు తెలిసిన విషయాలను మేము మీకు తెలుపబోతున్నాం.

అబద్ధాలు చెప్పకూడదు..

అబద్ధాలు చెప్పకూడదు..

రాముని జీవితంలో ఎప్పుడూ అబద్ధం అనేది చెప్పలేదట. అయితే ప్రస్తుత జనరేషన్ వారు వారి జీవితంలో అబద్ధం చెప్పకుండా అస్సలు ఉండలేరు. ప్రతిరోజూ ఏదో ఒక విషయంలో అబద్ధం చెబుతూనే ఉంటారు. ఒక అబద్ధం చెప్పి దాన్ని కవర్ చేసుకునేందుకు ఇంకో అబద్ధం చెబుతూనే ఉన్నారు. అలా గడిపేస్తున్నారు. ఒక్కసారి నిజం చెబితే అబద్ధం అవసరం అనేదే ఉండాలని ప్రస్తుత తరం వారు గుర్తించాలి.

మర్యాదగా మాట్లాడటం..

మర్యాదగా మాట్లాడటం..

రాముని జీవితంలో ఎన్నడూ అసభ్యకరమైన మాటలను అస్సలు మాట్లాడలేదట. అయితే ప్రస్తుత తరం వారు చీటికి మాటికి పరుష పదజాలం వాడటం అనేది సర్వసాధారణమైంది. ఈ అలవాటును మానుకుంటే మీరు కూడా ఉత్తములవుతారని గ్రహించాలి.

చిరునవ్వుతో ప్రారంభం..

చిరునవ్వుతో ప్రారంభం..

రాముడు ఇతరుల నుండి ఏదీ ఆశించడు. ఎవరితో ఏదైనా విషయం మాట్లాడాలంటే చిరునవ్వుతో తన సంబంధాన్ని.. సంభాషణను ప్రారంభించేవాడట.

లక్కీని నమ్ముకోలేదు..

లక్కీని నమ్ముకోలేదు..

రాముడు తను ఎలాంటి సమయంలో అయినా.. ఏ విషయంలో లక్కీ అనే దానిని నమ్మేవాడు కాదట.

ఇతరులకు ఇచ్చినదాన్ని..

ఇతరులకు ఇచ్చినదాన్ని..

శ్రీరాముడు ఇతరులకు ఏదైనా సహాయం చేస్తే దాన్ని అప్పుడే మర్చిపోయేవారట. ఎందుకంటే ఇతరులకు సహాయం చేయాలి కానీ.. అందుకు గానీ ప్రతిఫలం ఆశించకూడదని చెప్పేవాడట.

తన గొప్పతనం గురించి..

తన గొప్పతనం గురించి..

శ్రీరాముడు తన గొప్పతనం గురించి ఎప్పుడూ ఆలోచించలేదట. ఎక్కడా తన కీర్తి, ప్రతిష్టల గురించి చెప్పుకోలేదట. ప్రస్తుత తరం వారు ఏదైనా చిన్న విజయం సాధించినా.. చాలా గొప్పగా చెప్పుకుంటారు.

మంచి గురించే..

మంచి గురించే..

ఎవరైనా వారి జీవితంలో ఏదో ఒక తప్పు చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు మంచి పనులు కూడా చేస్తుంటారు. అలా చేసిన మంచి పనుల గురించే శ్రీరాముడు ప్రస్తావించేవాడట.

ఎవరైనా విమర్శిస్తే..

ఎవరైనా విమర్శిస్తే..

శ్రీరాముని ఎవరైనా విమర్శిస్తే, నిరుత్సాహ పడకుండా సావధానంగా వినేవాడట. వారిలో ఉన్న అపొహలను తొలగించేవాడట. అయితే ప్రస్తుత తరం వారు ఎవరైనా విమర్శలు చేస్తే, వాటిని స్వీకరించి తమ లోపాలను అధిగమించాల్సింది పోయి ఎదురుదాడి మొదలుపెడుతుంటారు.

పర స్త్రీ గురించి..

పర స్త్రీ గురించి..

శ్రీరామ చంద్రుడు తన జీవితంలో తాను వివాహమాడిన సీతాదేవి గురించి తప్ప.. ఎన్నడూ పర స్త్రీ గురించి ఆలోచించలేదట. అందుకే చాలా మంది స్త్రీలు తమకు రాముడులాంటి ఏకపత్నీవ్రతుడు కావాలని ఇప్పటికీ కోరుకుంటూ ఉంటారు.

అందరికీ ఉపయోగపడేలా..

అందరికీ ఉపయోగపడేలా..

శ్రీరాముడు తన సంపాదించిన డబ్బును ఎప్పటికీ దుబారా ఖర్చులు చేయలేదు. తన రాజ్యంలో అందరికీ ఉపయోగపడే విధంగా ఖర్చు చేశారు.

ఆధ్యాత్మిక అభ్యాసాలను..

ఆధ్యాత్మిక అభ్యాసాలను..

తను ఓ రాజ్యానికి రాజు అయినప్పటికీ, అతను సత్యాన్నే పూర్తిగా ఆచరించేవాడు. అలాగే ఆధ్యాత్మిక అభ్యాసాలను కూడా పూర్తిగా ఆచరించేవారు.

ప్రతి జీవికి శ్రేయోభిలాషి

ప్రతి జీవికి శ్రేయోభిలాషి

శ్రీరాముడు తన ప్రజలకు మాత్రమే కాకుండా, భూమిపై ఉన్న ప్రతి జీవికి శ్రేయోభిలాషిగా ఉండేవారు.

తప్పు ఒప్పుకుంటే..

తప్పు ఒప్పుకుంటే..

తన రాజ్యంలో ఎవరైనా తప్పు చేసి.. ఆ వ్యక్తి తనకు ఎంత హాని చేసినప్పటికీ, ఆ విషయాన్ని వారు తెలుసుకుని, రాముడి వద్ద లొంగిపోతే.. వారిని మన్నించడమే తన జీవిత సూత్రంగా పెట్టుకునేవారట.

అయితే ప్రస్తుతం కలియుగంలో పరిస్థితి ఎలా మారిందంటే మహాపురుషులు చూపిన మార్గాలను, చెప్పిన మాటలను చెబుతున్నారు తప్ప ఎవ్వరూ ఆచరించడం లేదు. దీంతో అవి టీవీలలో సీరియల్స్ మాదిరిగా.. పుస్తకాలలో కథల్లా అలా ఉండిపోయాయి.

English summary

Good qualities of Lord Rama that everybody should learn

Here are the good qualities of lord rama that everybody should learn. Take a look
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more