రాహువు ఎక్కడ ఉన్నాడో అన్న దానిబట్టి మీ అభిరుచి తెలుసుకోవచ్చు

Posted By: Deepti
Subscribe to Boldsky

మీ అభిరుచి, ఆసక్తి ఎందులో ఉన్నాయి? రాహువు ఏ స్థితిలో ఉన్నాడో దానితో తెలుసుకోండి.

మన గురించి మనకు తెలియటం వల్ల మనకు చాలావరకు విజయం లభిస్తుంది. పోనీ వ్యక్తిగత జీవితంలోనైనా సరే.మన బలాబలాలు మనకు తెలిసివుంటే, మన బలాలు పెంచుకునే , బలహీనతలపై పోరాడి గెలిచే అవకాశం ఉంటుంది.

జ్యోతిష్యంలో మన గురించి మనకు తెలియటానికి అనేక పద్ధతులున్నాయి. వీటిని ఆధునిక పద్ధతులు వాడి తీసిపారేయలేం. ఇవి నాగరికత మొదలైన కాలం నుంచి ఉన్నవి.

మీ అభిరుచిని జ్యోతిష్యంను వాడి తెలుసుకోవటం ఎంతో సులభం. జ్యోతిష్యానికి కొత్త అయిన వారైతే, మీరు కేవలం ఒక గ్రహాన్ని చూస్తే చాలు, రాహువు. నిపుణులైన వారు రాహువును, నక్షత్రాన్ని, నక్షత్రాధిపతి స్థితిని కూడా చూడాల్సి వస్తుంది.

జ్యోతిష్యంలో రాహువును అభిరుచికి ప్రతీకగా ఎందుకు చూస్తారు? మరింత తెలుసుకోవడానికి, వేదాలు ఈ గ్రహం గూర్చి ఏం చెబుతున్నాయో తెలుసుకోండి. ప్రాచీన రుగ్వేదంలో ఇలా రాయబడి ఉంది.

రాహువు ఎక్కడ ఉన్నాడో అన్న దానిబట్టి మీ అభిరుచి తెలుసుకోవచ్చు

"అత్రి మహర్షి సూర్యుడిని పూజిస్తూ

5 ఓ సూర్య, స్వరభాను వంశస్తుడైన అసురుడిని నిర్మూలించి, చీకటిని తొలగించే స్వామి,

సకల ప్రాణులు అతన్ని, తమ స్థానం కూడా మర్చిపోయి సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు"

ఇదీ కథ. దేవతలు, రాక్షసులు అమృతం కోసం మథనం చేయడానికి వెళ్ళారు. అసురుల నాయకుడు స్వరభాను. కొద్దిసేపయ్యాక రెండు వర్గాల మధ్య మాటల ఘర్షణ మొదలవుతుంది.

అమృతం దొరికాక, దేవతలు అసురులకి అమృతం ఇవ్వకూడదనుకుంటారు. స్వరభాను అమృతాన్ని దొంగిలించి పారిపోదామనుకుంటాడు కానీ ఇంద్రుడు అతన్ని రెండుగా వధిస్తాడు.

పెళ్లి ప్రయత్నాలు సఫలం కావాలంటే ఇలా చేసి చూడండి.!

తలభాగం రాహువుగా, పొట్టభాగం కేతువుగా మారతారు. ఇంద్రుడికి అతను పారిపోతున్న సంగతి సూర్యచంద్రులు చెప్పినందున, రాహువుకి వీరంటే చాలా శత్రుత్వం.

రాహువు మీలోని రగులుతున్న శక్తికి, ఇచ్చకి ప్రతిరూపం. అదే మీ అభిరుచిని, పట్టుదలను సూచిస్తుంది. రాహువు గ్రహస్థితిని బట్టి సరిగా ప్లాన్ చేసుకుంటే మీరు విజయం కూడా సాధించవచ్చు.

పద్ధతి చాలా సులభమైనది. ప్రతి జ్యోతిష్య చక్రంలో 12 భాగాలుంటాయి. రాహువు ఎక్కడ ఉన్నాడో గుర్తించండి. వీటిని గ్రహాల ఇళ్ళు అని అంటారు. ప్రతి ఇంటికి ప్రత్యేక లక్షణాలుంటాయి.

ఆ గ్రహ ఇళ్ళ స్థితిని బట్టి మీ అభిరుచిని ఎలా తెలుసుకోవాలో రహస్యాలు తెలుసుకోండి.

1వది

ఈ ఇల్లు ఎవరి శక్తియుక్తులకు సంబంధించినది. అందుకని మీ శక్తిసామర్థ్యాలను వాడే ఏ పని అయినా మీకు అదృష్టం తెస్తుంది. రాజకీయాలు, నాయకత్వ పాత్రలు అలాంటివి. ఇక్కడ రాహువు మీకు ఎక్కువ సమూహాలను నియంత్రించే శక్తిని కలిగిస్తాడు. మీ శక్తిని అందరిపై ప్రభావం చూపే విధంగా మార్చుకుంటారు.

2వది

ఈ ఇల్లు డబ్బు, భౌతికావసరాలు, కుటుంబం, భాష, దృష్టి, పౌష్టికతకి సంబంధించినది. మీ అదృష్టాన్ని ఛెఫ్, ఫుడ్ కోర్టు యజమానిగానో, డబ్బును చూసుకునే వ్యక్తిగానో, వక్తగానో, గాయకుడిగానో పరీక్షించుకోండి. జీవనశిక్షకుడిగా కూడా ప్రయత్నించవచ్చు.

3వది

ఈ ఇల్లు ధైర్యానికి సంబంధించినది.ఇందులో రాహువు ఉంటే మీ సొంత వ్యాపారం మొదలుపెట్టమని అర్థం. అది రచనారంగం, మీడియా, సోషల్ మీడియా, జర్నలిజం, బుల్లితెర ఇలాంటి మీ వ్రాత నైపుణ్యాలు కావాల్సిన రంగం మీకు అనుకూలిస్తుంది.

4వది

ఈ ఇల్లు భౌతిక, మానసిక సౌకర్యాలకి చెందినది. అందుకని మీరు వైద్యునిగా, నర్సుగా లేదా ఆస్పత్రి వ్యాపారంలోనో, ఇంటీరియర్ డెకొరేటర్ గానోఓ, రియల్ ఎస్టేట్ డీలర్, వ్యవసాయవేత్తగానో, రైతుగానో ఇలా ప్రయత్నించడం మంచిది.

5వది

ఈ ఇల్లు సృజనాత్మకతకి, వ్యాపారం, పిల్లలకు సంబంధించినది. మీరు ఎప్పుడన్నా సృజనాత్మక ప్రాజెక్టులు, మీ సొంత వ్యాపారం లేదా పీడియాట్రిషియన్ వంటి పిల్లలకు సంబంధించి ఏమన్నా చేయాలనుకున్నారేమో గుర్తుచేసుకోండి.

మీ జాతకంలో దోషాలుంటే అక్షయ త్రితీయ రోజున ఈ మంత్రాలను పఠించండి..!

6వది

ఈ ఇల్లు శత్రువులు, ఘర్షణ సంఘటనలకు చెందినది. మీ మనస్సు ఆర్థిక లావాదేవీలు, సమస్యలను తీర్చడం, ఆరోగ్య పరిశ్రమల్లోకి కూడా వెళ్ళాలనిపించవచ్చు.

7వది

ఇది మీ వ్యతిరేకుల ఇల్లు. ఇక్కడ రాహువు ఉంటే దాని అర్థం మీకు పెద్ద సమూహాలతో ప్రవర్తించడం బాగా వచ్చనే అర్థం. అందుకని మీరు మధ్యవర్తిగా బాగా వ్యవహరిస్తారు. మీరు మీ శక్తులను ఇతరులకు దారి చూపటంలో, వారికి నాయకత్వం వహించడంలో వాడటం మంచిది.

8వది

ఈ గ్రహపు ఇల్లు పూర్తిగా చేతబడులకు, పన్ను, బీమా, సముద్ర సంబంధ ఆసక్తులకు సంబంధించినది. మీకు సముద్రజీవనం ఇష్టమో కాదో ఆలోచించండి. లేదా ఆధ్యాత్మిక గురువులుగా కూడా ఆలోచించవచ్చు.

9వది

ఒకవేళ రాహువు 9వ ఇల్లులో ఉన్నట్లయితే, మీరు 9వ ఇల్లు అంటే ఏంటో తెలుసుకోవాలి ముందు. ఈ ఇల్లు పూర్తిగా పెద్ద పర్యటనలు, అంతర్జాతీయ సంబంధాలు, ఉన్నతజ్ఞానం, మీడియా, ప్రచురణ, అధ్యాపక వృత్తి, బోధన, కౌన్సెలింగ్, న్యాయం, ఆధ్యాత్మిక రంగాలకి చెందినది. మీకు ఏది ఇష్టమో అది ఎంచుకోండి. ట్రావెల్ ఏజెంట్ గా కూడా మారవచ్చు.

10వది

మీ అభిరుచి గుర్తింపబడుతుంది. మీకు ప్రత్యేక ఆకర్షణగా ఉండటం ఇష్టం. అందరూ గమనించే రాజకీయాలు, చిత్రాలు లేదా ఏదైనా శక్తివంతమైన రంగాలలో, పాత్రలలో ఉండటం మంచిది.

11వది

ఈ ఇల్లు మీ సొంత వ్యాపారం మరియు బంధాలు పెంచుకోటానికి చెందినది. మీకు అందరి మధ్యలోనే ఉండటం ఇష్టం. మీకు సమూహాలతో ప్రవర్తించడం బాగా వచ్చు. మీ అభిరుచి కూడా సమూహాలలో సృజనాత్మకంగా ఏదైనా చేయడం అయి ఉంటుంది.

12వది

ఈ ఇల్లు రహస్య ప్రతిభకి చెందినది. లేదా ఈ ప్రతిభ మిమ్మల్ని తెరవెనుక ఎడిటర్, వెనక ఉండి అంతా నడిపించే పాత్రల్లో ఉంచుతుంది.

ప్రాచీన గ్రంథాల ప్రకారం, రాహువు మనం ఎందుకు భూమి మీద పుట్టామో తెలియజేస్తాడు. అది మనం గతజన్మలో తీరని కోరికలను ఈ జన్మలో తీర్చుకోవాలని చూపిస్తుంది.

గతజన్మ, పునర్జన్మ వంటి వాటి గూర్చి మాట్లాడుకుని ప్రయోజనం లేదు ఎందుకంటే మనలో చాలామంది వివిధ రకాల అభిప్రాయాలతో, నమ్మకాలతో ఉంటారు. అందుకని మీరు రాహువు ఉన్న స్థితిని గమనిస్తే మీ మనసు ఆ ఇల్లు గూర్చి చెప్పిన లక్షణాల చుట్టూ తిరుగుతుంటుంది, వాటిల్లోనే ఆసక్తి కలిగి ఉంటారు.

ఇప్పుడు అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో మనం సున్నా పెట్టుబడితో కూడా మన వ్యాపారం మొదలుపెట్టవచ్చు. మనకి అనుభవం ఉన్న రంగంతో బ్లాగ్ ను మొదలుపెట్టవచ్చు. మీకు రాతలో నైపుణ్యం లేకపోతే వ్లాగ్ మొదలుపెట్టవచ్చు. జీవించడానికి ఎన్నో మార్గాలు. ఆలోచన ఎక్కడ ఉంటే మార్గం అక్కడ ఉంటుంది.

ఎన్నో ఏళ్ళుగా జ్యోతిష్యంలో ఉన్న నాకు, రాహువు ఉన్న ఇంట్లో సూచించబడ్డ రంగాలలో మీకు ఎంతో ఆసక్తి ఉంటుంది అని గమనించాను. తర్వాత మీకు కావాల్సింది ఆ రంగంలోకి ప్రవేశం. ఈ విశ్వం మీకు అనేక అవకాశాలు తెచ్చిపెడుతుంది, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొత్త జీవితం మొదలుపెట్టవచ్చు.

రాహువు 1,6, 10 వ ఇంట్లో ఉన్నవారు, మిమ్మల్ని మీరు శారీరక అందంతో కానీ, ఆన్ లైన్ లోనో మీ అస్థిత్వాన్ని పెంచుకోడానికి సందేహించకండి.మీరు ఆన్ లైన్ లో ఏదైనా ప్రారంభించాలనుకుంటుంటే ప్రపంచానికి మీరేంటో తెలియజేయడానికి సందేహపడవద్దు. మీరు ఎలా ఉన్నా ఎవరో ఏదో అనుకుంటారని ఆగిపోవద్దు.

ఎన్నో ప్రయత్నాల తర్వాత కూడా మీరు కెరీర్ లో స్థిరపడలేకపోతున్నట్లయితే, రాహువు ఎక్కడో దారుణస్థితిలో ఉండి మిమ్మల్ని ముందుకు సాగనివ్వట్లేదేమో చూడండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    How Rahu's Placement Helps You To Find Your Passion

    How Rahu's Placement Helps You To Find Your Passion,Finding your passion from astrology is such a simple task. For the beginners in astrology, you have to look just at one planet, Rahu. For experts you have to look at Rahu, then the nakshatra and nakshatra lord's placement.
    Story first published: Saturday, July 22, 2017, 18:03 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more