For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ratha Saptami 2021:సూర్య దేవుని రథానికి ఏడు గుర్రాలు ఎందుకుంటాయో తెలుసా...

|

హిందూ పురాణాల ప్రకారం, ప్రతి ఒక్క దేవుడికి, దేవతకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే మనకు తెలిసిన దేవుళ్లలో చాలా మందికి ఒక వాహనం.. ఒక జంతువు రథసారథిగా ఉంటుంది.

ఉదాహరణకు శివుడికి నంది, పార్వతీ దేవికి సింహం, అయ్యప్పకు పులి, వినాయకుడికి మూషికం. అయితే మనందరం ప్రత్యక్ష దైవంగా భావించే ఒక్క సూర్య భగవానుడికి మాత్రం ఒకటి, రెండు కాకుండా ఏకంగా ఏడు గుర్రాలు ఎందుకని ఉంటాయి.

ఈ ఏడు గుర్రాల వెనుక ఏదైనా కారణం ఉందా? ఈ ఏడు గుర్రాలు దేన్ని సూచిస్తాయి.. వీటి ప్రాముఖ్యత ఏంటి.. ఏడు గుర్రాల ఎందుకంటాయనే విషయాలతో పాటు రథసప్తమి గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Ratha Saptami 2021 :రథసప్తమి నాడు స్నానం చేసే వేళ ఈ శ్లోకాలను పఠిస్తే సమస్త పాపాలు నశిస్తాయి...!

త్రిమూర్తుల స్వరూపం..

త్రిమూర్తుల స్వరూపం..

హిందూ క్యాలెండర్ ప్రకారం, మాఘ మాసంలోని శుక్ల పక్ష సప్తమి నాడు వచ్చే పర్వదినాన్ని రథసప్తమి అని లేదా అచల సప్తమి అని అంటారు. ఈ సమస్త లోకానికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడిని ప్రత్యక్ష నారాయణుడిగా.. త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు, మహేశ్వర) స్వరూపంగా పురాణాలు చెప్పబడుతాయి.

ఏడు వర్ణాల కలయిక..

ఏడు వర్ణాల కలయిక..

మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు సత్యాస్వ రథంపై సూర్యుడు సంచరిస్తాడు. సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని నిపుణులు చెబుతుంటే.. ఆ ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.

ఏడు గుర్రాలివే..

ఏడు గుర్రాలివే..

1) గాయత్రి

2) త్రిష్ణుప్పు

3) అనుష్టుప్పు

4) జగతి

5) పంక్తి

6) బృహతి

7) ఉష్ణిక్కు

వీటినే ఛందస్సులంటారు. గుర్రం వేగానికి చిహ్నం. సూర్యుని ఏడు గుర్రాలూ ఏడు రకాల కాంతి కిరణాల్ని ప్రసరిస్తూ ఉంటాయి. కాబట్టి సూర్య కిరణాల్లో ఏడు రంగులుంటాయి.

రథ సప్తమి 2021 : ఈరోజున ఇలా చేస్తే ఏడు జన్మల పాపం పోతుందట...!

12 నెలలకు ప్రత్యేకత..

12 నెలలకు ప్రత్యేకత..

హిందూ క్యాలెండర్ ప్రకారం, ఏడాదిలో ప్రతి నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు. చైత్ర మాసంలో ‘దాత'గా, వైశాఖంలో ‘అర్యముడు'గా, జ్యేష్ట మాసంలో ‘మిత్రుడు'గా, అషాఢంలో ‘వరుణుడి'గా, శ్రావణ మాసంలో ‘ఇంద్రుడి'గా, భాద్ర పద మాసంలో ‘వివస్వంతుడు'గా, అశ్వీయుజ మాసంలో ‘త్యష్ట'గా, కార్తీక మాసంలో ‘విష్ణువు'గా, మార్గశిర మాసంలో ‘అంశుమంతుడు'గా, పుష్య మాసంలో ‘భగుడు'గా, మాఘ మాసంలో ‘పూషుడు'గా, ఫాల్గుణ మాసంలో ‘పర్జజన్యుడు'గా ఆయా నెలల్లో తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని పండితులు చెబుతుంటారు.

ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం..

ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం..

భూమి నుండి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని నేరుగా చేరడానికి పట్టే కాలాన్ని ఎనిమిది నిమిషాలుగా అంచనా వేశారు నిపుణులు. సూర్య కాంతి ఏడు వర్ణాల కలయిక అని సైంటిస్టులు చెబుతుంటే.. ఆయన ఏడు గుర్రాలున్న రథంపై నుండి లోక సంచారం చేస్తాడని వేద వాజ్మయం చెబుతోంది. వీటి రూపాలు సప్త వర్ణాలకు కూడా సరి పోలుతాయని పండితులు చెబుతుంటారు.

సూర్య రథానికి..

సూర్య రథానికి..

సూర్యుని రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రి సమయాలకు ప్రతీకగా భావిస్తారు. చక్రాలకు ఉండే ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో చెప్పబడింది. అందుకే సూర్యుడు జన్మించిన రోజున ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అనే పేరుతో వేడుకలు జరుపుకుంటారు. ఈరోజున ఆ భానుడి కిరణాల శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది.

లోకబాంధవ ధర్మానికి..

లోకబాంధవ ధర్మానికి..

మరో పురాణ కథ ప్రకారం, సూర్య జయంతిని రథ సప్తమిగా జరుపుకుంటారని అందరికీ తెలుసు. అయితే సూర్యుడు పుట్టిన రోజు కాకుండా.. భానుడు తన ఉష్ణ చైతన్యాన్ని లోకానికి పంచిపెట్టేందుకు రథమెక్కి విధులలో చేరిన రోజు ఈరోజు. ఇక్కడ రథారోహణమే ప్రధాన పని. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కాబట్టి ఇది రథ సప్తమిగా మారింది.

English summary

Ratha Saptami 2021 : The True story of Ratha Saptami in Telugu

Here we are talking about the true story of ratha saptami in Telugu. Read on
Story first published: Friday, February 19, 2021, 6:00 [IST]