For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెడిటేషన్ వల్ల పొందే శక్తి సామర్థ్యాలు

By Super
|

ధ్యానం అంటే ఏమిటి? సరే, ధ్యానంలో అనేక రకాలు, దాని ఆలోచనలకు అనేక పాఠశాలలు ఉన్నాయి. ధ్యానానికి అనేక అభిప్రాయాలూ, అనేక చిట్కాలు ఉన్నాయి. అటువంటి కష్టమైన చిట్కాల జోలికి పోకుండా, ధ్యానం వల్ల పొందే అన్ని ప్రయోజనాలను పొందడానికి ఏదైనా తేలికైన మార్గం ఉందా?

సరే, అందరూ తమతమ లక్ష్యాలను సాధించడానికి బిజీగా ఉన్నారు. మన ఔత్సాహిక ప్రకృతి, మన దైనందిన జీవితంలోని కష్టాలు అలసిపోయిన మనసు ప్రశాంతతను పొందడానికి చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాము. దానినుండి బైటికి రావడానికి ఏదైనా మార్గం ఉందా? ధ్యానం మీ మనసుకి శాంతిని కలిగిస్తే, దానిని చేయడానికి ఏదైనా తేలిక మార్గం ఉందా? ఒక చదువులేని వ్యక్తి కష్టాల గురించి తెలియకుండా ధ్యానాన్ని చేయవచ్చా?

The Power Of Meditation

పతంజలి యోగ సూత్రాలు
పతంజలి యోగాలోని మొట్టమొదటి వరుసలో ఇలా చెప్పబడింది ‘యోగాష్ చిత్త వ్రిత్తి నిరోధః’ అంటే అన్ని మానసిక చర్యలను నియంత్రించేది యోగా.

మనసుని శాంత పరచడానికి ఏదైనా మార్గం ఉందా?
మీరు సమయ౦ చూసుకుని, మీ ఇంట్లో నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చోండి. ఆటంకాలు, పరధ్యానంగా ఉన్నపుడు, మీరు మీ కళ్ళను మూసుకుని, మీ శ్వాసపై దృష్టి పెట్టండి.

ఆటంకపరిచే ఆలోచనలు వస్తే ఎలా?

మీరు ఆలోచనలనే పరిశీలిస్తూ ఉండాలని గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మీకు ఆలోచనలు వస్తున్నై అనిపిస్తే, ప్రకృతి మిమ్మల్ని ఆటంక పరచడం లేదు, దీనివల్ల క్రమంగా ప్రసాంతత కలుగుతుంది అని. మీరు లోపల ప్రసాంతంగా ఉంటె ఏమి సాధిస్తారు? ధ్యానం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఆందోళన, నిరాశ, వత్తిడి వంటి వాటినుండి దూరంగా ఉండొచ్చు. కానీ ధ్యానం వల్ల కలిగే శక్తివల్ల చిన్న చిన్న ప్రయోజనాలే కాకుండా చాలా పొందవచ్చు. ఒక వ్యక్తిగా, జీవితంలో లోతైన ఆలోచనలను సాధించే ఉంటారు. జీవితంలోని చాలా అంశాలపై మీకు కొంత అనుభవం పొందే ఉంటారు.

కళ్ళు మూయకుండా ఎవరైనా ధ్యానం చేయవచ్చా?
అవును, మనసంతా ధ్యనంవైపే ఉంటె కేవలం కూర్చుని, శ్వాసపై దృష్టిపెట్టి ధ్యానం చేయవచ్చు. మీరు మీ దైనందిన జీవితంలో ప్రతి పనిని శ్రద్ధతో చేసి, అదొక అందమైన అనుభవంగా ఏర్పరచుకోవచ్చు.

లోతుగా పరిశీలిస్తే

ధ్యానంలో చాలా లోతుగా వెళ్ళాలనే ఆశ కలవారు. సాధారణ స్థాయిని దాటి ఒక వ్యక్తీ చైతన్యంలో ఉంటె, నిజమైన ఏకత్వాన్ని గ్రహిస్తారు. మనందరం ప్రకృతితో ముడిపడి ఉన్నాము. మన జీవితాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. వ్యక్తిగత అహం లేదా నేనే అనే పరిధి, ప్రతిచోటా సార్వత్రిక స్పృహ ఉంది. స్వేచ్చ అనేది ఈ అంశాలలో పరిపూర్ణత్వం లాంటిదే. ఒకసారి ఒకవ్యక్తి కొంత ఎత్తుకు ఎదిగితే, తన మనసులో భయంకానీ, దురాశ కానీ ఉండవు. అలాంటి వ్యక్తీ తన జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందుతాడు. అదే ధ్యానం యొక్క నిజమైన శక్తి.

English summary

The Power Of Meditation

What is meditation? Well, there are many methods of meditation and many schools of thought. There are many opinions and many techniques to meditate. Without going into the complexity of those techniques, is there any simple way in which we can reap all the benefits of meditation?
Story first published: Monday, February 23, 2015, 17:59 [IST]
Desktop Bottom Promotion