For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వికట సంకష్ట చతుర్ధి వ్రతం లేదా సంకష్ట హర చతుర్ధి

|

వినాయకుని గౌరవార్ధం భక్తులు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది ఈ సంకష్ట హర చతుర్ధి. ఈరోజుని సంకష్ట వ్రతముగా కూడా జరుపుకుంటారు. ఈ వ్రతము సంవత్సరంలోనే వినాయకునికై జరిపే వ్రతాలలో ముఖ్యమైనది. ప్రతి నెల హిందూ కాలెండర్ ప్రకారం శుక్ల పక్షం మరియు కృష్ణ పక్షముల నందు రెండు చవితులు వస్తుంటాయి. ఇందులో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్ట చవితిగానూ , అమావాస్య తర్వాత వచ్చే చవితిని వినాయక చతుర్ధి గానూ భావిస్తారు.

ఒకవేళ చవితి మంగళవారం నాడు వస్తే, ఆరోజుని అంగార్కి చతుర్ధి గా పిలుస్తారు. ఏప్రిల్ 3 వ తేదీ మంగళవారం వస్తున్న ఈ సంకష్ట చతుర్ధి కూడా అంగార్కి చతుర్ధినే అవుతుంది. అందువలనే గణేశుని భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా ఈ సంవత్సరం సంకష్ట హర చతుర్ధి అయింది.

Vikata Sankashti Vrat/Chaturthi

అంగార్కి సంకష్ట చతుర్ధి ముహూర్తం:

•చవితి ఈ సంవత్సరం 2018 లో ఏప్రిల్ 3 వతేదీన సాయంత్రం 04:43 కి ప్రారంభమవుతుంది. మరియు ఏప్రిల్ 4 వ తేదీ సాయంత్రం 05:32 కి అంతమవుతుంది.

•ఏప్రిల్ 3 వ తేదీన అంగార్కి చతుర్ధి నాడు రాత్రి 9:12 కి చంద్రుడు ఉదయిస్తాడు .

•ఈ సంకష్ట చతుర్ధి వ్రతాన్ని వికట సంకష్ట చతుర్ధిగా కూడా పిలుస్తారు.

•ఈరోజు గణపతి దేవుని వికట మహా గణపతిగా భావించి పూజిస్తారు.

Vikata Sankashti Vrat/Chaturthi

అసలు ఈ వ్రతాన్ని ఎలా చేస్తారు?

•అన్నీ సంకష్ట చతుర్ధి రోజుల వలనే, ఈరోజు కూడా భక్తులు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం తర్వాతనే భోజనాన్ని స్వీకరిస్తారు.

•సాయంత్రం ఏదైనా నదిలోకాని , సరస్సులో కానీ అభ్యంగన సాంప్రదాయక స్నానం చేసిన తర్వాత పూజకి ఉపక్రమిస్తారు. ఒకవేళ ఇంట్లో స్నానం చేయు పక్షంలో, అన్నీ నదుల జలాలు ఆ నీటిలో ఉన్నట్లుగా మంత్రోచ్ఛారణ చేసిన తర్వాతనే స్నానం ఆచరించాలి.

•పూజగదిని శుభ్రంచేసి నా తర్వాత శుభ్రంగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని, గణేశుని విగ్రహాన్ని కానీ, చిత్ర పటాన్ని కానీ ఉంచాలి.

•పటాన్ని లేదా విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించాక, కొత్తబట్టలను బహూకరించాలి.

•దేవునికి దీపారాధన చేసి హారతినివ్వండి.

•దేవునికి నైవేధ్యం పెట్టండి.

•చంద్రోదయం తర్వాత చంద్రునికి కూడా నైవేధ్యం సమర్పించండి.

•ఎవరైనా పేద వానికి లేదా బ్రాహ్మణుడి కి భోజనం పెట్టడం ద్వారా మీ ఉపవాస దీక్షని పూర్తిచేయ్యడం జరుగుతుంది.

•అంగార్కి సంకష్ట చతుర్ధి వ్రతం సంబంధించిన కథలను చదవండి.

•నైవేధ్యంగా పెట్టిన ప్రసాదాన్ని మీ ప్రియమైన వారికి పంచిపెట్టండి.

Vikata Sankashti Vrat/Chaturthi

అంగార్కి సంకష్ట వ్రతము , గుడిలో చేయు విధానం:

అత్యధికులు పండుగరోజు గుడికి వచ్చి, గుడిలో చేయు విధానం పరిశీలిస్తుంటారు.తద్వారా తాము పాటించవచ్చన్న నమ్మకం. కావున గుడిలో పూజారికి హోమాలు , వ్రతాలు చేయమని చెప్పండి. ఆర్ధవ శీర్షము, గణేషుడి అష్టోత్తరo చదవడం తప్పనిసరి. లేదా మీరు గుడిలో ఎక్కడైనా ప్రశాంత వాతావరణములో చేరి , మీరు కూడా ఈ అష్టోత్తరాలను చదవడం చేయవచ్చు. గణేశునికి ఇష్టమైన ఈ మంత్రోచ్చారణల వలన ఆయన కృపకు పాత్రులవగలరని భక్తుల విశ్వాసం.

ఒకవేళ ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్న ఎడల , పూజారిని వ్రత మార్గములగురించిన మెళకువలు తెలియజేయమని కోరండి.

చాలా అరుదుగా వచ్చే రోజు ఇది:

సంవత్సరంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే అంగార్కి సంకష్ట హర చతుర్ధి వస్తుంది. దీనికి కారణం మంగళవారం నాడు సంకష్ట హర చతుర్ధి రావడo.

ఈ అంగార్కి సంకష్ట హర చతుర్ధి ఎందుకు ప్రత్యేకమైనది అంటే?

ఈ అంగార్కి సంకష్ట హర చతుర్ధినాడు చేసిన వ్రతం కారణంగా సంవత్సరంలో వచ్చే అన్నీ సంకష్ట హర చతుర్ధిలను చేసుకున్నంత పుణ్యం వస్తుందని చెప్పబడినది. కావున ఈ రోజు ప్రత్యేకమైనదిగా భక్తులు భావిస్తారు.

English summary

Vikata Sankashti Vrat/Chaturthi

Every month in the lunar calendar followed by the Hindu community has two Chaturthi dates - one in each fortnight. The Chaturthi that comes after the full moon or the Pournami is known as Sankashti Chaturthi and the one that comes after the Amavasya is called the Vinayaka Chaturthi.Vikata Sankashti Vrat/Chaturthi
Story first published:Tuesday, April 3, 2018, 14:48 [IST]
Desktop Bottom Promotion