పద్మనాభస్వామి ఆలయంలోని చివరి గది వెనుక దాగి ఉన్న అసలు రహస్యం

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

కొన్ని రహస్యాల గురించి వింటున్నప్పుడు వాటిని ఎన్ని సార్లు విన్నా కొత్తగా ఉంటాయి. వింటున్నంతసేపు ఆశక్తిని రేకెత్తిస్తుంటాయి. అలాంటి అతి కొద్ది రహస్య విషయాల్లో పద్మనాభ స్వామి గుడిలోని చివరి తలుపు రహస్యం ఒకటి.

అతి ప్రాచీనమైన హిందూ దేవాలయాల్లో పద్మనాభ స్వామి గుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గుడిలో శ్రీ మహా విష్ణువు కొలువుతీరివుంటారు. ఇది భారతదేశంలోని తిరువనంతపురంలో ఉంది. ప్రస్తుతం ఈ దేవాలయాన్ని "ట్రావంకోర్" రాజ వంశీకుల అధీనంలో ఉన్న ట్రస్ట్ ఈ దేవాలయ వ్యవహారాలను చూసుకుంటుంది. ట్రావంకోర్ మహారాజులు గొప్ప సాధువు అయిన కులశేఖర ఆల్వార్ కు వారసులుగా ప్రసిద్ధి.

ఈ దేవాలయం దేనికి ప్రతిరూపం అంటే :

తిరువనంతపురం లో ఉన్న శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం, తిరువత్తార్ లోని శ్రీ ఆదికేశవ పెరుమాళ్ దేవాలయానికి ప్రతిరూపం. పద్మనాభ స్వామి దేవాలయంలో రహస్య ఖజానా ఉందని చాలా మంది బలంగా విశ్వసిస్తారు. అందుకు ఆ ప్రదేశం కూడా చాలా ప్రసిద్ధి గాంచింది. కానీ అక్కడికి ఏమానవుడు అంత సులువుగా వెళ్ళలేడు. మనం ఒకసారి ఈ గుడి యొక్క చరిత్రను తొంగి చూసి, ఆ రహస్య ద్వారం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.....

ప్రపంచంలో 8 అత్యద్భుతమైన ఆలయాలు

నిద్రపోతున్న భంగిమ:

నిద్రపోతున్న భంగిమ:

ఈ దేవాలయంలో అతి ముఖ్యమైన దేవుడు పద్మనాభ స్వామి. ఆయన అనంత శయనం భంగిమ (అనంత అనే పడగ విప్పిన పాము పై యోగ నిద్రలో భాగమైన శాశ్వత నిద్ర) లో పడుకొని ఉంటారు.ట్రావంకోర్ మహారాజుకి " శ్రీ పద్మనాభ దాశ (పద్మనాభ స్వామి కి సేవకుడు) " గా బిరుదు కూడా ఉంది.

PC: Offcial Site

వస్త్ర నిబంధన :

వస్త్ర నిబంధన :

ఎవరైతే హిందువులుగా జీవిస్తున్నారో, హిందుత్వాన్ని బలంగా నమ్ముతారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ ఆలయలంలోకి ప్రవేశం ఉంది. ఈ ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ప్రత్యేకమైన వస్త్ర నిబంధనలు పాటించవలసి ఉంటుంది.

ఇండియాలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు!

పవిత్ర నివాసం :

పవిత్ర నివాసం :

పవిత్రమైన 108 శ్రీ మహా విష్ణువు దివ్య ప్రదేశములలో, ఈ దేవాలయం కూడా ఒకటి. వైష్ణవులు ఈ ప్రాంతాన్ని అతి ముఖ్యమైన ప్రదేశంగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ దేవాలయం విశిష్ఠత గురించి మధ్య యుగంలో "దివ్యప్రభంద" అనే తమిళ సాహిత్యంలో తమిళ అల్వార్ ఋషులు ప్రముఖంగా ప్రస్తావించారు. సాధారణ యుగం లో, 16వ శతాబ్దంలో ఈ దేవాలయం కోసం ఎన్నో అద్భుతమైన కట్టడాలు కట్టి, అత్యద్భుతంగా అలంకరించిన ఆలయ గోపురాన్ని నిర్మించారు.

సర్ప స్థానం :

సర్ప స్థానం :

పవిత్రమైన ఈ స్థలం లో, అతి పవిత్రమైన శ్రీ పద్మనాభ స్వామి, అనంత (ఆది శేష) అనే సర్పం పై శయనించి ఉంటారు. ఈ పాముకున్న ఐదు తలలు లోపలకి చొచ్చుకొని ఉండటం వల్ల, అది ఎదో ఆలోచిస్తోంది అనే భావన కలుగుతుంది. ఆ సర్పంపై శయనిస్తున్న స్వామి తన కుడి చేతిని శివ లింగం పై పెట్టి ఉంటారు.

సుఖ సంపదలను ప్రసాదించే దేవత :

సుఖ సంపదలను ప్రసాదించే దేవత :

సుఖ సంపదలను ప్రసాదించే దేవత శ్రీదేవి, ఈ సమస్త లోకాన్ని తన బుజాల స్కంధాల పై మోసే భూదేవి. మహా విష్ణువుకి భార్యలైన వీరిద్దరూ ఆయనకీ ఇరుపైవులా కొలువుతీరి ఉన్నారు. తామర పుష్పం పై బ్రహ్మ ఆసీనులై ఉంటారు. అది చూడటానికి, అప్పుడే మహా విష్ణువు నాభి నుండి బ్రహ్మ ఉద్భవించారా అన్నట్లు గోచరిస్తుంది. ఇక్కడ కొలువు తీరి ఉన్న దేవ దేవుణ్ణి పన్నెండు వేల శిలలను ఉపయోగించి తయారు చేశారు.

ఈ శిలలను ఎక్కడ నుండి తెచ్చారంటే:

ఈ శిలలను ఎక్కడ నుండి తెచ్చారంటే:

ఈ శిలలను నేపాల్ దేశంలోని గండకి నది ఒడ్డు నుండి తీసుకొచ్చారు. పశుపతి నాధ దేవాలయంలో చేసే కొన్ని ప్రత్యేకమైన పూజలకు గుర్తుగా వాటిని అక్కడ నుండి తెచ్చారు. ఇక్కడ కొలువు తీరి ఉన్న శ్రీ పద్మనాభ స్వామిని "కటుసర్కార యోగం "తో కప్పబడి ఉంచారు. ఈ "కటుసర్కార" యోగం అనేది ఆయుర్వేద పద్ధతుల్లో తయారు చేసిన మిశ్రమం. ఇది ఎప్పుడు ఆ దేవున్నిపరిశ్రుభంగా ఉంచుతుంది. ప్రతి రోజు పూలతో పూజిస్తారు. అభిషేకానికి మాత్రం కొన్ని ప్రత్యేక పద్దతులను పాటిస్తారు.

తిన్నెలు(వేదిక) :

తిన్నెలు(వేదిక) :

స్వామి విశ్రాంతి తీసుకుంటున్న ప్రదేశానికి ఎదురుగా కొన్ని వేదికలు ఉన్నాయి. అవి అత్యద్భుతమైన శిల్పకళలకు ప్రతిరూపాలు. ఎంతో సుందరంగా ఒకే శిల పై ఆ శిల్పాలన్నింటిని చెక్కారు. ఆ దేవ దేవుడ్ని మూడు ద్వారాల నుండి మనం చూడవచ్చు. మొదట ద్వారం నుండి స్వామి ముఖంతో పాటు, పడుకొని శివ లింగంపై చేయి పెట్టి ఉన్న భంగిమను చూడవచ్చు. శ్రీ దేవి మరియు దివాకర ముని కటు సర్కార లో ఉన్నారు.

ఈ దేవాలయం పేరు :

ఈ దేవాలయం పేరు :

ఈ దేవాలయం పేరు, మహా విష్ణువు నాభి నుండి ఉద్భవించిన, తామర పువ్వు పై కూర్చొని ఉన్న బ్రహ్మ భంగిమను స్ఫూర్తిగా ఆవిర్భవించింది.

భారత దేశంలో ప్రసిద్ది చెందిన 7 శ్రీకృష్ణ దేవాలయాలు...

దేవాలయం లో ఉన్న రహస్య గది :

దేవాలయం లో ఉన్న రహస్య గది :

దేవాలయంలో మొత్తం ఆరు గదులున్నాయి. "భారతక్కొణ్ కళ్లారా " అనే గది పద్మనాభ స్వామికి అతి సమీపంలో నిర్మించబడి ఉంది. ఇది దేవాలయ కోశాగారము క్రిందకు రాదు. ఈ పవిత్రమైన గది లో శ్రీ చక్రం ఉంది. దీనితో పాటు పద్మనాభస్వామి విగ్రహం మరియు మరెన్నో విలువైన వస్తువులు ఆ గది లో ఉన్నాయని, అవి దేవుడి యొక్క మహత్యాన్ని తెలియజేస్తామని చెబుతారు.

PC: Kamaljith K V

రహస్య ఖజానాను తెరవడానికి :

రహస్య ఖజానాను తెరవడానికి :

2011 సంవత్సరంలో భారతదేశ సుప్రీం కోర్టు ఏడు మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసి ఈ దేవాలయానికి పంపింది. ఈ దేవాలయ ప్రధాన ధర్మ కర్త సమక్షంలో, దేవాలయానికి చెందిన రహస్య గదులను తెరిచారు.

దాగి ఉన్న ఖజానా :

దాగి ఉన్న ఖజానా :

ఆ రహస్య గదులను తెరవగానే, ఎంతో విలువైన వజ్ర వైడూర్యాలు, బంగారంతో చేసిన వస్తువులు, ఆయుధాలు, బంగారు విగ్రహాలు, బంగారు ఏనుగు విగ్రహాలు, 500 వందల కిలోల బరువు 18 అడుగుల పొడువు ఉండి వజ్రాలతో పొదిగిన పూల హారాలు మరియు సంచుల కొద్దీ ఎన్నో దేశాలకు చెందిన బంగారు నాణేలు లభించాయి.

రహస్య గదుల పేర్లు :

రహస్య గదుల పేర్లు :

ఇక్కడ జరిగిన తంతుని లిపి బద్దీకరించడానికి, అక్కడ ఉన్న ఆరు గదులకు A,B,C,D,E,F అనే పేర్లు పెట్టారు. అన్ని గదులను సంవత్సరానికి కనీసం 8 సార్లు తెరుస్తారు. కాని 'B' అనే రహస్య గదిని మాత్రం తెరవరు.అందుకు కారణం, ఈ దేవాలయ ట్రస్ట్ సభ్యులతో పాటు, భారత దేశంలోని చాలా మంది జ్యోతిష్యులు ఆ తలుపు తెరవ కూడదని, అది ఎంతో రహస్యమైన ప్రదేశం అని, అతి పవిత్రమైనదని, ఆ తలుపు ని తెరవడం చాలా అపాయకారమని, ఒకవేళ తెరిస్తే ప్రమాదం ముంచుకొస్తుంది హెచ్చరిస్తున్నారు.

రహస్య గది :

రహస్య గది :

ఈ "బి" అనే రహస్య గదిని ఎన్నో మంత్రాలు ఉపయోగించి నాగబంధం తో మూసివేశారు. నాగబంధం ని నాగ పాశం అని కూడా అంటారు. పదహారవ శతాబ్దం లో మహారాజు మార్తాండవర్మ సమక్షంలో సిద్ద పురుషులు ఉండేవారని, వాళ్ళే ఈ తంతుని మొత్తం అప్పట్లో పూర్తి చేశారని చెబుతారు.

ఎవరు ఈ గదిని తెరవగలరు :

ఎవరు ఈ గదిని తెరవగలరు :

ఈ రహస్య గదిని తెరవాలంటే, అతి పవిత్రమైన సాధువు గాని లేదా అతి శక్తివంతమైన మాంత్రికుడి వల్ల మాత్రమే అవుతుంది. అది కూడా నాగబంధనాన్ని విడిపించగలిగే జ్ఞానం ఉండాలి, ఆలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గరుడమంత్రాన్ని పట్టించాలి. ఇలా తప్ప ఆ ద్వారాన్ని, ఇంకే విధంగా ఎవ్వరు తెరవలేరు.

సామాన్య మనుష్యులు తెరిచే అవకాశం ఉందా :

సామాన్య మనుష్యులు తెరిచే అవకాశం ఉందా :

అతి పవిత్రమైన ఎంతో జ్ఞానం కలిగిన సాధువులు లేదా మాంత్రికులు, ఎంతో శక్తివంతమైన గరుడ మంత్రాలను పఠిస్తూ తెరువవలసిన ఈ రహస్య గదిని ఏ సామాన్య మానవుడైనా, ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తెరవాలని ప్రయత్నిస్తే, గుడి చుట్టూ గాని లేదా భారతదేశం అంతటా ఉపద్రవాలు ముంచుకు వస్తాయి.

మరి ఆ ద్వారాన్ని ఎలా తెరవాలి :

మరి ఆ ద్వారాన్ని ఎలా తెరవాలి :

ఇంతకు ముందు చెప్పినట్లుగా గరుడ మంత్రాన్ని పఠిస్తూ, అతి శక్తివంతమైన సాదువు లేదా యోగి చే మాత్రమే ఈ రహస్య మందిరం ద్వారం తెరుచుకుంటుంది. సామాన్య మనుష్యుల వల్ల ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు .

ఒకసారి తెరవాలని ప్రయత్నిస్తే ఏమి జరిగిందంటే :

ఒకసారి తెరవాలని ప్రయత్నిస్తే ఏమి జరిగిందంటే :

ఒకానొక సందర్భంలో భారత దేశానికి చెందిన వేద జ్యోతిష్యులు ఈ ద్వారాన్ని తెరవాలని విశ్వ ప్రయత్నం చేశారు. కాని వారి ప్రయత్నం ఫలించలేదు. ఆ ద్వారం తెరుచుకోకపోవడం తో నిరాశ చెంది తిరిగి వెళ్లిపోయారు.

ఆ మంత్రాన్ని పద్దతిగా పఠించాలి :

ఆ మంత్రాన్ని పద్దతిగా పఠించాలి :

ఈ ద్వారం తెరుచుకోవడానికి పఠించాల్సిన మంత్రాలను ఏ సాధువు అయిన పద్దతిగా పఠించాలి. అప్పుడు మాత్రమే ఈ ద్వారం తెరుచుకుంటుంది. లేదంటే ఆ ద్వారాన్ని కాపు కాచే సర్పాలు, ఆయా ద్వారాన్ని తెరవాలనుకుని వచ్చిన వ్యక్తి పై భీకరమైన దాడి చేసి తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

English summary

What is the mystery behind the last door at Padmanabhaswamy temple?

is currently run by a trust headed by the royal family of Travancore. The Maharajahs of Travancore are Cheras and descendants of the great saint Kulashekhara Alwar. పద్మనాభస్వామి ఆలయం లోని చివరి గది వెనుక దాగి ఉన్న అసలు రహస్యం
Subscribe Newsletter