Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
Ganesh Chaturthi Special:వినాయక ప్రతిమలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా...
గణేష్ నిమజ్జనం సంప్రదాయ కథ మనకు ఏమి చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో తెలిసిందే. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకల్లో యువత హడావుడి.. కుర్రకారు జోరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్సవాలన్నీ ఒక ఎత్తు అయితే.. నిమజ్జనోత్సవం మరో ఎత్తు. ఇలా వినాయకుని ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి.

ఈ సందర్భంగా వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక ఉన్న కథేంటి? ఎందుకని నీటిలోనే గణేశుడిని నిమజ్జనం చేస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వర్షాకాలంలో..
ప్రకృతి పరంగా చూస్తే.. వినాయక చవితి వర్షాకాలంలో ప్రారంభంలో వస్తుంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువుల నుంచి మట్టి సేకరించి.. ఆ మట్టితో విగ్రహాలు చేసి వాటిని పూజించిన తర్వాత తిరిగి చెరువులలో, నదులలో, ప్రవహించే నీటిలో నిమజ్జనం చేస్తారు.

అలా మట్టి తీస్తే..
చెరువులలో విగ్రహాల కోసం మట్టిని తీయడం వల్ల.. చెరువుల్లో లోతు పెరుగుతుంది. ఆ తర్వాత ఆయుర్వేద గుణాలున్న పత్రితో కలిపి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీరు సులువుగా పారే అవకాశం ఉంటంది. అదే సమయంలో అందులో ఆయుర్వేద గుణాలు కూడా కలుస్తాయి.

ఆరోగ్య సమస్యలు రాకుండా..
ఇలాంటి నీటిని తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చాలా మంది నమ్మకం. ఎందుకంటే విగ్రహాలను తయారు చేసేందుకు ఉపయోగించిన మట్టి, పత్రి, గరిక ఇతర వస్తువుల వల్ల నీటిలో ఉండే క్రిమికీటకాలన్నీ చనిపోతాయి. దీని వల్ల నీరు శుద్ధి అవుతుంది.

పౌరాణిక కథల ప్రకారం..
వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక పౌరాణిక కారణాలు కూడా ఉన్నాయి. పురాణాల ప్రకారం.. వినాయకుడు కైలాసం నుండి భూలోకానికి వచ్చి కేవలం పది రోజులు మాత్రమే ఉండి తిరిగి కైలాసానికి వెళ్లిపోతాడు.

కైలాసానికి దూరంగా..
భూలోకానికి వచ్చిన వినాయకుడు పది రోజుల పాటు కైలాసానికి దూరంగా ఉంటాడని.. పదిరోజుల పాటు నిత్యం పూజలందుకుని.. తిరిగి కైలాసానికి రమ్మని పార్వతీదేవి పంపినట్లు పెద్దలు చెబుతుంటారు. అయితే అందులో ఎంత వాస్తవం ఉందన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. దీనికి మరో కారణం కూడా ఉందంటారు.

దైవత్వం పోతుందని..
ఏ దేవుని విగ్రహం అయినా మట్టితో చేస్తే అది కేవలం తొమ్మిది రోజులు మాత్రమే పూజించడానికి అర్హత ఉంటుందని.. ఆ తర్వాత అందులో దైవత్వం పోతుందని.. అందుకే వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయాలని కూడా కొందరు చెబుతుంటారు. వినాయక నిమజ్జనంతో పాటు దుర్గామాత విగ్రహాలను కూడా నవరాత్రులు పూర్తయ్యాక నిమజ్జనం చేసే విషయం గురించి మనకు తెలిసిందే.



Click it and Unblock the Notifications
