For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకే గోత్రం వాళ్లు పెళ్లి చేసుకుంటే సంతాన లోపం కలుగుతుందా ?

By Swathi
|

హిందూ సంప్రదాయంలో పెళ్లిళ్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. వేసే ప్రతి అడుగులోనే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూస్తారని.. సినిమాల్లో చెబుతూ ఉంటారు. అది నిజమే.. హిందువుల పెళ్లి విషయంలో ఇలా చాలా విషయాలు పరిశీలిస్తారు.. అందుకే.. ఆ నానుడి వచ్చింది.

తథాస్తు దేవతలంటే ఎవరు? అసలు తథాస్తు దేవతలున్నారా..?

పెళ్లి అంటే వరుడు లేదా వధువు కుటుంబాల గురించే కాదు వాళ్ల గోత్రాలు, ఇంటిపేర్లు చాలా ముఖ్యమైనవి. అలాగే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు జాతకాలు, పేరు బలాలు, రాశులను బట్టి.. వాళ్ల వైవాహిక జీవితం ఎలా ఉంటుంది. ఇద్దరి జోడి కుదురుతుందా అని వేద పండితులను అడిగి తెలుసుకున్న తర్వాత పెళ్లి సంబంధం కుదురుస్తారు. అయితే గోత్రం ఎలా పుట్టింది ? ఒకే గోత్రం ఉన్న వాళ్లను ఎందుకు పెళ్లి చేసుకోరు ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మహర్షుల సంతానం

మహర్షుల సంతానం

భగవంతున్ని ప్రత్యక్షంగా దర్శించిన మహర్షులు యజ్ఞ యాగాదులు చేసి అందరి మంచి కోరేవాళ్లు. ప్రస్తుతం ఉన్న మనమంతా అలాంటి గొప్ప మహర్షుల సంతతిగా చెబుతారు.

మహర్షుల పేర్లే

మహర్షుల పేర్లే

కాబట్టి ఏ ఋషి వంశంలో జన్మించిన వాళ్లు ఆ ఋషి పేరు వంశంగా వచ్చింది. అలా వచ్చిన పేరునే గోత్రం అంటారు.

మహర్షులు

మహర్షులు

ఋషులలో భరద్వాజుడు, అంగీరసుడు, విశ్వామిత్రుడు, కశ్యపుడు, కౌండిన్యుడు, గౌతముడు, ఆత్రేయుడు, వసిష్టుడు, యాజ్ఞవల్క్యుడు, శాండీల్యుడు, కౌన్డీల్యుడు, పరాశర, శ్రీవత్స మహర్షులు ఉన్నారు.

వంశీకుల స్మరణ

వంశీకుల స్మరణ

ఎంతో గొప్ప సేవా గుణం, మంచి చేసే తత్వం ఉన్న మహర్షుల సంతానం కావడం వల్ల వాళ్ల పేర్లను పూజా కార్యక్రమాల్లో, సంతోషకరమైన సందర్భాల్లో స్మరించుకోవాలనే ఉద్ధేశంతో.. గోత్రాల ఆచారం వచ్చింది.

గోత్రం చెప్పే ఆచారం

గోత్రం చెప్పే ఆచారం

పూజల సమయంలో దేవుడిని ప్రార్థించేటప్పుడు, అర్చన చేయించేటప్పుడు మన గోత్రం చెప్పడం ఆనవాయితీ. ఇది తప్పకుండా పాటించాలి.

గోత్రం, ఇంటిపేర్లు

గోత్రం, ఇంటిపేర్లు

ఒకే గోత్రం, ఒకే ఇంటిపేర్లు ఉన్న కుటుంబాలతో వివాహ సంబంధం కలుపుకోరు. వేర్వేరు గోత్రాలు అయినప్పుడే బంధుత్వాన్ని కలుపుకుని వివాహం చేస్తారు.

గోత్రాల పోలిక

గోత్రాల పోలిక

సాధారణంగా ఆలయాల్లో, ఇంట్లో, పెళ్లిళ్లలో పూజలు, వ్రతాలు చేసేటప్పుడు గోత్రం అడుగుతారు. అలాగే పెళ్లి సమయంలో.. రెండు కుటుంబాల గోత్రాలను పోల్చుతారు.

సగోత్రికులు

సగోత్రికులు

ఒకే ఋషి వంశంలో జన్మించినవాళ్లను సగోత్రికులు అంటారు. సగోత్రికులు అంటే.. అన్నదమ్ముల వరుస అవుతారని అర్థం. అందుకే వివాహం సమయంలో వధూవరుల గోత్రాలు వేరుగా ఉండాలని భావిస్తారు.

సంతాన లోపం

సంతాన లోపం

ఒకే గోత్రం వాళ్లు అంటే.. ఒకే జన్యువుల కలిగిన వాళ్లు పెళ్లి చేసుకుంటే.. సరైన సంతానం కలుగకపోవచ్చని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. ఒకే గోత్రం ఉన్న వాళ్లు పెళ్లి చేసుకుంటే సంతానంలో లోపాలు ఉంటాయని.. మన పూర్వీకులు ఇలాంటి నిబంధన పెట్టారు.

గోత్రాల పేర్లు

గోత్రాల పేర్లు

గోత్రం అంటే గోవు, గురువు, భూమి, వేదం అని అంటారు. అయితే అలాంటి గోత్రాలకు మనకు సంబంధం ఏంటంటే మన పూర్వీకులు తమ ఆవుల రంగులను బట్టి అంటే తెల్ల ఆవుల వాళ్లు ఒక గోత్రం, నల్ల ఆవుల వాళ్లు ఒక గోత్రంగా, చదువు నేర్పించిన గురువులను బట్టి కూడా గోత్రాలు నిర్ణయించేవాళ్లు.

English summary

Why do some people oppose marriages within the same 'gotra'?

Why do some people oppose marriages within the same 'gotra'? There is a popular misconception about gotra, namely people of the same gotra share an ancestry originating from some legendary sage (rishi) in the distant Vedic times.
Story first published:Saturday, April 30, 2016, 13:34 [IST]
Desktop Bottom Promotion