Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
వేగంగా బరువు తగ్గి నాజూగ్గా తయారవ్వాలంటే....!

ఆకలి: ఆకలి వేయడానికి సుమారు అరగంట ముందే మెదడు ఆహారం కావాలన్న సూచనలను అందిస్తుంది. అలా అనిపించిన వెంటనే తినేయాలి. ఏ మాత్రం గమనించకుండా ఆకలి అనిపించిన గంటో, అరగంట తర్వాతో ఆహారం తినడంవల్ల ఫలితం ఉండదు. అలాగే కడుపు నిండినట్లు అనిపించగానే తినడం ఆపేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
భోజనం: ఎంత తిన్నా, ఏది తిన్నా, భోజనానికి సరికాదు అంటారు. ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. బరువు తగ్గాలనుకునేవారు భోజనం అస్సలు మానేయకూడదు. అయితే మీరు తీసుకునే భోజనాన్ని తగ్గించుకొని ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ పెద్ద మొత్తంలో తీసుకోవాలి. మధ్యాహ్నాం, రాత్రి భోజనంలో బియ్యంతో వండిన అన్నంకు బదులు రాగులు, గోధుమలు, సజ్జలూ ఉపయోగించుకోవాలి. రాత్రి పడుకోవడానికి నాలుగు గంటలు ముందే భోజనం ముగించడం ఉత్తమమైన పద్దతి.
క్రమం తప్పకుండా వ్యాయామం: వ్యాయామం తప్పనిసరి. రోజులో కనీసం కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. అలా కేటాయించడం కుదరని వారు ఇంట్లోని మెట్లు ఎక్కడం, దిగడం, ఇంట్లోనే ఇటూ అటూ అరగంట పాటు ఆపకుండా నడవడం లాంటివి చేయాలి. నిద్ర లేచిన వెంటనే ఇలాంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వీలుంటే ఉదయం, సాయంత్రం ఓ అరగంట పాటు నడవడం అలవాటు చేసుకోవాలి.
ఒత్తిడికి, ఆందోళన దూరంగా: బరువు తగ్గే క్రమంలో ఉన్నవారు తప్పనిసరిగా ఆందోళన, ఒత్తిడికి దూరంగా ఉండాలి. పై రెండిటి కారణంగా అధికంగా తినేయడంతో బరువు పెరిగే అవకాశం ఉందని పరిశోధనల్లో రుజువైంది.
చక్కెరకు దూరంగా: బరువు తగ్గాలనుకునే వారు తీపి పదార్థాలకు తప్పనిసరిగా దూరంగా ఉండాల్సిందే. వీరు చక్కెరకు బదులు బెల్లం లేదా తేనెను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు తీపి ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి.
నిద్రలేమి: కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర ఆరోగ్య రహస్యాలు అంటారు. నిద్ర లేమి కూడా ఊబకాయానికి ఓ కారణం. ఏడెనిమిది గంటలు నిద్ర తప్పనిసరి.



Click it and Unblock the Notifications
