For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెయిర్ కట్ చేసుకొన్న తర్వాత కేశాల గురించి జాగ్రత్త తీసుకోవడం ఎలా...?

|

మొదటి సారి, కొత్త హెయిర్ స్టైల్ మార్చాలన్నా కొత్త హెయిర్ కట్ చేయించుకొంటున్నట్లైతే, చాలా ఉత్సాహంగా ఉంటుంది. మిమ్మల్ని కొత్త లుక్ తో మార్చేయడానికి అతి త్వరగా చేసే పద్దతి ఇది. మీ పూర్తి అపియరెన్స్ ను మరయు లుక్ ను మార్చివేసే పని మేక్ఓవర్ చేతిలోనే ఉంది. మీ అందానికి హెయిర్ కట్ చాలా ముఖ్యం. అంతే కాదు కొత్తగా కురులు పెరగడానికి కూడా సహాపడుతుంది. చిట్లిన చివర్లను కట్ చేయడం వల్ల హెయిర్ లాస్ ను అరికడుతుంది. అయితే మీరు మొదటి సారి కొత్త లుక్ కోసం హెయిర్ కట్ చేసుకొనే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు హెయిర్ కట్ ఏ టైప్ లో మీకు సూట్ అవుతుంది. పొడవు ఎంత ఉంటే బాగుంటుంది అని ముందే ప్లాన్ చేసుకొని వెల్లాలి.

అలాగే హెయిర్ కట్ చేసుకొన్న తర్వాత, మీ కొత్త హెయిర్ స్టైల్ ను మెయింటైన్ చేయడానికి జాగ్రత్త తీసుకోవాలి. మరయు హెయిర్ కట్ చేసి మొదటి రోజుల్లో ఎంత గ్లామర్ గా కనిపించారో అలాగే మెయింటేయిన్ చేయాలి. హెయిర్ కట్ చేయించుకొన్న తర్వాత అలాంటి మరికొన్ని హెయిర్ కేర్ టిప్స్ మీకోసం...

Hair Care After Getting A Haircut

కురులను సర్దకోవడానికి చేతివేళ్ళను ఉపయోగించకండి: హెయిర్ డ్రెస్సర్ ఒక సారి హెయిర్ స్టైల్ మార్చిన తర్వాత, మీ కురలను సర్దుకోవడానికి మీరు మీ చేతివేళ్ళను ఉపయోగించకూడదు. అందుకు మీ హెయిర్ డ్రెస్ సలహా మేరకు హెయిర్ బ్రష్ , హెయిర్ డ్రైయ్యర్ ను ఉపయోగించాలి.

కండీషనింగ్ తప్పక పాటించాలి: హెయిర్ కట్ చేయించుకొన్న తర్వాత, హెయిర్ స్టై కొంచెం మారుతుంది. దాంతో పాటు కేశాలు, కొద్ది వంగినట్లు, ముడుచుకొన్నట్లు అనిపిస్తుంటాయి. అటువంటప్పడు తల స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా హెయిర్ కండీషనర్ ను ఉపయోగించడం చాలా అవసరం. హెయిర్ కంట్ చేసికొన్న తర్వాత కొన్ని సార్లు తలస్నానం చేసిన తర్వాత మీ హెయిర్ కట్ షేప్ మారకుండా మరియు మీ కేశాలు చిక్కుబడకుండా ఉండాలంటే తప్పనిసరిగా కండీషన్ అప్లై చేయడం చాలా అవసరం.

సెరమ్: సెరమ్ ఉపయోగించడం వల్ల మీ కేశాలు మీరు ఎలా కోరుకుంటే అలా వుండటమే కాదు, సున్నితంగా, సిల్కీగా ఉంటాయి. హెయిర్ వాష్ తర్వాత కూడా సుతిమెత్తని పట్టులాంటి కేశాలు పొందడానికి, హెయిర్ చిందరవందర కాకుండా ఉండటానికి సెరమ్ ను తప్పని సరిగా అప్లై చేయాలి.

బ్రష్ ఉపయోగించాలి: కఠినమైన టూత్ కూంబ్ ను ఉపయోగించడం కంటే. హెయిర్ బ్రష్ ను ఉపయోగించడం వల్ల మీహెయిర్ ఒకే యాంగిల్లో ఉండటానికి సహాయపడుతుంది మరియు కొత్త లుక్ పాడవదు. తలస్నానం చేసిన తర్వాత కూడా హెయిర్ బ్రష్ చేసుకోవడం వల్ల మీకు కావల్సిన స్టైల్లో హెయిర్ సెట్ చేసుకోవడానికి సులభతరం అవుతుంది. మీ హెయిర్ సెట్ చేసుకోవడానికి బ్లో డ్రై అవసరం.

మీ కేశాలను ముడి వేయకూడదు: హెయిర్ కట్ చేయించుకొన్న తర్వాత మీ కేశాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ముడి వేయకూడదు. అలా చేయిడం వల్ల మీ హెయిర్ కట్ స్పాయిల్ అవుతుంది. దాంతో చిందరవందగా తయారై మీ హెయిర్ స్టైల్ ను మార్చేస్తుంది.

ఇంకా మరికొన్ని చిట్కాలు మీరు హెయిర్ కట్ చేయించుకొన్న తర్వాత పాటించవల్సిన చిట్కాలు ఉన్నాయి. హెయిర్ కట్ చేయించుకొన్న తర్వాత మీ హెయిర్ డ్రెస్సర్ ను అడిగి తెలుసుకోండి . హెయిర్ కట్ తర్వాత మీ కేశ తత్వాన్ని బట్టి ఎటువంటి హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించాలో అడిగి తెలుసుకోండి.

English summary

Hair Care After Getting A Haircut | హెయిర్ కట్ చేయించుకొన్న తర్వాత కేశ సంరక్షణ ...!


 Getting a new haircut can be really exciting and is the fastest way to get a new appearance. A makeover changes your entire appearance and look. A haircut is important for your hair as it promotes new hair growth, cuts down splitends, nourishes hair and prevents hair loss. But, there are few things that you must keep in mind before getting a haircut. For example, considering the type of your hair and the length would be of great help.
Story first published: Friday, March 15, 2013, 8:58 [IST]
Desktop Bottom Promotion