For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మసోయగానికి హెల్తీ ఫ్రూట్స్ టిప్స్

|

సాధారణంగా గమనించినట్లైతే కొందరి చర్మం నున్నగా, సుతిమెత్తగా, బేబి స్కిన్ లా మెరిసిపోతూ, ఆరోగ్యంగా వుంటుంది. మరి కొందరిది పాలిపోయినట్లు ముఖంలో తేజస్సు లేకుండా కనిపిస్తుంది. ఎన్నో రకాల క్రీములు, ఎన్నో రకాల చిట్కాలు పాటించినా కూడా ఫలితం ఉండదు సరికదా.... మరిన్ని సమస్యలు గురిఅవుతుంటారు.

దీనికి కారణం బయటి సమస్య మాత్రమే కాదు.. లోపలిది కూడా.. కాబట్టి పైపై రంగులు, మేకప్‌ మాత్రమే కాకుండా అంతర్గతంగా కూడా కాస్త జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మెరిసే చర్మం కోసం కూరగాయలు, పండ్లతో తయారు చేసేటటు వంటి జ్యూసులు ఎక్కువగా తీసుకోవాలి.

fruits

నారింజ/బత్తాయి: నారింజలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్‌ ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది. రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్ సి అవసరమవుతుంది. నారింజ జ్యూస్‌ తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది.

Best Fruits for Healthy and Glowing skin

పుచ్చకాయ : పుచ్చకాయలో శక్తి చాలా తక్కువ. ప్రోటీన్ తక్కువ. కొవ్వు తక్కువ. కొలెస్టరాల్ అసలు ఉండదు. పిండి పదార్థాలు ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువ. సోడియం తక్కువ. విటమిన్లలో విటమిన్-ఎ, ఫోలేట్, విటమిన్-సిలు ఎక్కువ. 90 శాతం నీరు వుండే కాయ పుచ్చకాయ. దాహార్తిని తీర్చడం తోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి చలువను ఇస్తుంది. అందాన్ని ఇనుమడింపజేస్తుంది. పుచ్చకాయ జూసును తీసుకోవడం వల్ల చర్మం మరింత తేటగా మారుతుంది.

Best Fruits for Healthy and Glowing skin

ఆపిల్‌ : యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది. రోజూ ఒక ఆపిల్‌ తీసుకోవడం వల్ల అనారోగ్యానికి కారణమయ్యే వాటిని చాలా వరకు దూరం చేసుకోవచ్చు. ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది. యాపిల్‌లోని గుణాలు చర్మానికి మృదుత్వాన్ని ఇచ్చి మెరిసేలా చేస్తాయి.

Best Fruits for Healthy and Glowing skin

జామకాయతో : జామకాయలో విటమిన్‌ 'ఏ' మరియు విటమిన్‌ 'సి' నిల్వలు అధికంగా ఉంటాయి. వీటి గింజలు కూడా ఒమేగా-3, ఒమేగా-6 కరుగని కొవ్వు ఆవ్లూలు, పీచు పదార్థాలు ఎక్కవగా కలిగి ఉంటాయి. ఒక జామపండులో విటమిన్‌ 'సి' నిల్వలు ఒక నారింజపండులో కన్నా నాలుగురెట్లు అధికంగా ఉంటాయి. జామకాయలో వుండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తా యి. ఆరోగ్య సంబంధిత వ్యాధులు నయమవుతాయి. క్రమంగా చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

Best Fruits for Healthy and Glowing skin

బొప్పాయి: చూడగానే నోరూరించే బొప్పాయి పండులో తక్కువ కేలరీలుంటాయి. విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. తిరోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే మంచిది.

Best Fruits for Healthy and Glowing skin

నిర్జీవమైన చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. బొప్పా యి గుజ్జు తో ఫేస్‌ ప్యాక్‌ కూడా వేసుకోవచ్చు. బొప్పాయి గుజ్జు, యాపిల్ గుజ్జు, అరటిపండు గుజ్జు, కమలాఫలం తీసుకొని అందులో అరచెంచా తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగినట్లైతే చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

English summary

Best Fruits for Healthy and Glowing skin

Best Fruits for Healthy and Glowing skin ,The body's largest excretory organ is our skin so taking care of the skin can be easy with a diet which consists of eating healthy nutritional foods along with fresh pressed juices.
Story first published: Saturday, December 12, 2015, 17:39 [IST]
Desktop Bottom Promotion