For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లెమన్ పీల్ పౌడర్‌తో డిఫరెంట్ ఫేస్ ప్యాక్స్‌తో అమేజింగ్ బ్యూటి బెనిఫిట్స్

By Lekhaka
|

చర్మసంరక్షణ కొరకు ఎన్నో హోం రెమెడీస్ ను ఫాలో అవుతుంటారు, అలాంటి వాటిలో నిమ్మరసం ఒకటి. అయితే నిమ్మరసం మాత్రమే కాదు, నిమ్మతొక్క కూడా బ్యూటిని మెరుగుపరుస్తుందని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు. నిమ్మరసంలోలాగే, నిమ్మ తొక్కలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది హెల్తీ అండ్ యూత్ ఫుల్ స్కిన్ ను అందిస్తుంది. అయితే నిమ్మచెక్కను ఫేస్ మాస్క్ గా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ఆ ఆర్టికల్. .

Different Lemon Peel Face Masks You Should Try

నిమ్మతొక్కలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి అద్భుతమైన చార్మింగ్ ను అందిస్తుంది. కాబట్టి, నెక్ట్స్ టైమ్ నిమ్మరసాన్ని ఉపయోగించి తొక్క పడేయకుండా దాన్ని కూడా ఉపయోగించుకోండి. నిమ్మతొక్క ఫేస్ మాస్క్ తో అనేక ప్రయోజనాలున్నాయి అవేంటో తెలుసుకుందాం..


నిమ్మరం మరియు నిమ్మ చెక్క

నిమ్మరం మరియు నిమ్మ చెక్క

నిమ్మ తొక్క, నిమ్మరసం రెండింటి కాంబినేషన్ చర్మానికి మంచిదే. ఇందులో ఉండే విటమిన్ సి, గ్రేట్ గా సహాయపడుతుంది. వీటిలో బ్లీచింగ్ లక్షనాలు కూడా అధికంగా ఉండటం వల్ల చర్మం ను లైట్ గా బ్రౌైట్ గా మార్చుతుంది. నేచులర్ స్కిన్ టోన్ అందిస్తుంది. ఒక నిమ్మకాయ తీసుకుని రసం పిండేసి, తొక్కలను ఎండలో ఎండబెట్టాలిజ రెండు మూడు రోజులు ఎండిన తర్వాత వీటిని మెత్తగా పౌడర్ చేయాలి. తర్వా తఒక టీస్పూన్ నిమ్మరసం తీసుకుని, నిమ్మపౌడర్లో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

శెనగపిండి , నిమ్మరసం

శెనగపిండి , నిమ్మరసం

శెనగిపండి, నిమ్మతొక్క మాస్క్ ఆయిల్ స్కిన్ వారికి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. శెనగపిండి చర్మంలోకి డీప్ గా వెళ్ళి చర్మాన్ని శుభ్రం చేస్తుంది, నిమ్మతొక్క నేచురల్ బ్లీచింగ్ లక్షణాలను చర్మానికి అందిస్తుంది. 3 టీస్పూన్ల శెనగపిండికి రెండు స్పూన్ల నిమ్మరసం పౌడర్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

కివి మరియు నిమ్మతొక్క

కివి మరియు నిమ్మతొక్క

కివీ ఫ్రూట్ తీసుకుని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వత ఇందులోకి కొద్దిగా నిమ్మ తొక్క పౌడర్ ను మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. నిమ్మతొక్క, కివి ఫ్రూట్ కాంబినేషన్ ఫేస్ మాస్క్ వల్ల డల్ అండ్ డ్రై స్కిన్ నివారించబడుతుంది. ఈ మాస్క్ ను ఉపయోగించడం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. హెల్తీ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది.

కీరదోసకాయ మరియు నిమ్మ తొక్క:

కీరదోసకాయ మరియు నిమ్మ తొక్క:

వేసవిలో ఈ రెండింటి కాంబినేసన్ చర్మానికి తగిన హైడ్రేషన్ అందిస్తుంది. చర్మానికి ఎప్పుడూ మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఒక కీరదోసకాయ తీసుకుని పేస్ట్ చేసి అందులో నిమ్మరసాన్ని ఒక టీస్పూన్ నిమ్మ చెక్క పౌడర్ ను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

గందం పొడి, నిమ్మతొక్క పౌడర్

గందం పొడి, నిమ్మతొక్క పౌడర్

శాండిల్ ఉడ్ పౌడర్, నిమ్మతొక్క పౌడర్ తో చేసుకునే ఈ ఫేస్ మాస్క్ హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను అందిస్తుంది. ఈ మాస్క్ చర్మంలోని మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. రెండు స్పూన్ల గందం పొడితీసుకుని అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి. అలాగే నిమ్మతొక్క పౌడర్ కూడా మిక్స్ చేసి, తర్వాత ఒక స్పూన్ పాలు మిక్స్ చేసి, పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి.

దానిమ్మ తొక్క మరియు నిమ్మ తొక్క :

దానిమ్మ తొక్క మరియు నిమ్మ తొక్క :

ఒక దానిమ్మ తొక్కను ఎండలో ఎండ బెట్టి, పొడిచేసుకోవాలి. తర్వాత రెండు స్పూలన్ల దానిమ్మ పౌడర్ కు, ఒక స్పూన్ నిమ్మ తొక్క పొడి మిక్స్ చేసి, పాలకలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి అరగం ట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని ప్రకాశంతంగా మార్చుతుంది.

 తేనె మరియు నిమ్మ తొక్క

తేనె మరియు నిమ్మ తొక్క

5 స్పూన్ల తేనెకు మూడు స్పూలన్ల నిమ్మరసం మిక్స్ చేసి రెండింటిన పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. రెండు పదార్థాలను మిక్స్ ముఖానికి ప్యాక్ వేసుకుని 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. తేనె, నిమ్మరసం మాస్క్ వల్ల మొటిమలు తొలగిపోతాయి, ముఖంలో మచ్చలు మాయమవుతాయి. డార్క్ స్పాట్స్, స్కార్స్ నివారించబడుతుంది. ఇది చర్మానికి మాయిశ్చరైజింగ్ ను అందిస్తుంది.

 పసుపు మరియు నిమ్మతొక్క

పసుపు మరియు నిమ్మతొక్క

5 స్పూన్ల నిమ్మచెక్క పౌడర్ తీసుకుని అందులో ఒక స్పూన్ పసుపు పౌడర్ మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులో ఒక టీస్పూన్ అలోవెర జెల్ మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ చర్మంలో మొటమలు, మచ్చలను నివారిస్తుంది. స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఈ ఒక్క చిట్కాతో చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

English summary

Different Lemon Peel Face Masks You Should Try

Lemon peels are storehouses of Vitamin C and hence they can help to provide a nice charming glow to the skin. So the next time you use a lemon, do not discard the lemon peel, as it is of great use as well.
Desktop Bottom Promotion