బ్లాక్ హెడ్స్, మొటిమలు, అనేక చర్మ సమస్యలకు నిమ్మరసం ఉపయోగించే పద్ధతులు

Posted By:
Subscribe to Boldsky

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో నిమ్మకాయ ఒకటి. ప్రతి ఒక్కరి వంటింట్లో తప్పనిసరిగా ఉండే చౌకైన కాయగూరల్లో నిమ్మకాయ ఒకటి. నిమ్మరసం వంటలకు మాత్రమే కాదు, నిమ్మరసాన్ని బ్యూటీ కోసం కూడా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా చర్మ సంరక్షణలో ఎక్కువగా నిమ్మరసాన్ని ఉపయోగిస్తారు. చర్మ సౌందర్యానికి వివిధ రకాలుగా నిమ్మరసం ప్రయోజనాలను అందిస్తుంది. నిమ్మకాయలో సౌందర్యాన్ని పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. నిమ్మలో క్లీనింగ్ లక్షణాలతో పాటు, విటమిన్స్, ప్రోటీన్స్ మరియు ఆస్ట్రిజెంట్ లక్షణాలు కూడా అధికంగా ఉండటం వల్ల బ్యూటీ కోసం నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు .

అనేక చర్మ సమస్యలకు నిమ్మరసం

కాయగూరల్లో ఒకటైన నిమ్మపండు, చౌకైనది మాత్రమే కాదు, మార్కెట్లో అతి సులభంగా అందుబాటులో ఉండే ఒక క్లీనింగ్ ఏజెంట్ దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించుకోవచ్చు. నిమ్మరసాన్ని కేవలం చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం మాత్రమే కాదు, చర్మ సమస్యలను, జుట్టు సమస్యలను నివారించడం కోసం కూడా నిమ్మరసంను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు.

పొట్ట చుట్టూ కొవ్వు కరిగించే మన వంటింటి నేస్తాలు: పసుపు+నిమ్మరసం.!

నిమ్మరసంలో ఉండే విటమిన్ సి చర్మ సమస్యలను నివారించి, సౌందర్యాన్ని పెంచడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మరి అలాంటి విలువైన సౌందర్య గుణాలు కలిగిన నిమ్మరసంను చర్మం, జుట్టు కోసం ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఈ నిమ్మరసం చర్మం మరియు జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందో కూడా తెలుసుకుందాం..

నిమ్మరసం నేచురల్ స్కిన్ బ్లీచర్

నిమ్మరసం నేచురల్ స్కిన్ బ్లీచర్

నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇది చర్మాన్ని నేచురల్ గా తెల్లగా మార్చుతుంది. ఇందులో ఉండే నేచురల్ బ్లీచింగ్ లక్షణాలు వల్ల చర్మంను తెల్లగా మార్చుతుంది. చర్మంలోని డార్క్ ప్యాచెస్ ను తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కేవలం ముఖానికి మాత్రమే కాదు, నల్లగా మారిన మోకాళ్ళు, మోచేతులకు అప్లై చేసుకోవచ్చు. చర్మంలో డార్క్ ప్యాచెస్ మీద కూడా నిమ్మరసాన్ని నేరుగా అప్లై చేసుకోవచ్చు.

బ్లాక్ హెడ్స్ ట్రీట్మెంట్ లో నిమ్మరసం

బ్లాక్ హెడ్స్ ట్రీట్మెంట్ లో నిమ్మరసం

నిమ్మరసంతో బ్లాక్ హెడ్స్ ను సులభంగా తొలగించుకోవచ్చు. నిమ్మరసంలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు బ్లాక్ హెడ్స్ ను సులభంగా తగ్గించడంతో పాటు స్మూత్ అండ్ బ్రైట్ స్కిన్ అందిస్తుంది. నిమ్మరసంను తీసుకుని, అందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

స్కిన్ క్లీనింగ్ కోసం నిమ్మరసం

స్కిన్ క్లీనింగ్ కోసం నిమ్మరసం

నిమ్మరసంలో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ మరియు సిట్రిక్ యాసిడ్ వల్ల చర్మంను శుభ్రం పడుతుంది. ముఖంలో ఉండే మురికిని తొలగిస్తుంది. ఇది నేచురల్ టోనర్ గా పనిచేస్తుంది. ఇది చర్మం మెరవడానికి మరియు అందంగా మార్చడానికి సహాయపడుతుంది. కొద్దిగా నిమ్మరసం తీసుకుని అందులో కొద్దిగా నీరు మిక్స్ చేసి కాటన్ ను అద్ది ముఖమంతా నిమ్మరసం అప్లై చేస్తూ రుద్దాలి. ఇలా రుద్దడం వల్ల స్కిన్ క్లీన్ అవుతుంది. అలర్ట్ : ఈ వ్యాధులను నివారణకు మెడిస్స్ అవసరం లేదు..ఒక్క గ్లాస్ లెమన్ జ్యూస్ చాలు..

చర్మానికి ఎక్స్ ట్రా షైనింగ్ వస్తుంది:

చర్మానికి ఎక్స్ ట్రా షైనింగ్ వస్తుంది:

నిమ్మరసం చర్మానికి మంచి షైనింగ్ ను అందిస్తుంది. ఇది చర్మంలో ఎక్స్ ట్రా షైనింగ్ ను తీసుకొస్తుంది. కొద్దిగా నిమ్మరసం తీసుకుని ముఖానికి అప్లై చేసి 5 నిముషాల మసాజ్ చేయాలి. మరో 5 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసం ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంలో జిడ్డు, ఆయిల్ నెస్ తగ్గుతుంది.

డార్క్ స్పాట్స్, మచ్చలను తగ్గిస్తుంది:

డార్క్ స్పాట్స్, మచ్చలను తగ్గిస్తుంది:

అందమైన ముఖంలో నల్ల మచ్చలు ఏమాత్రం బాగుండవు కదా, మరి అలాంటి బ్లాక్ స్పాట్ప్ మరియు మచ్చలను నివారించుకోవడం కోసం నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. మచ్చలను పోగొట్టి చర్మం నేచురల్ గా వైట్ గా మార్చుతుంది. ఇంకా చెప్పాలంటే హైపర్ పిగ్మెంటేషన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మ కాంతిని పెంచుతుంది.

నెయిల్స్ ను బలోపేతం చేస్తుంది:

నెయిల్స్ ను బలోపేతం చేస్తుంది:

గోళ్ళు అందంగా మార్చుకోవడానికి నిమ్మరసం సహాయపడుతుంది. గోళ్ళకు నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని ఉపయోగిస్తే నెయిల్స్ ను బలోపేతం చేస్తుంది. గోళ్ళను హెల్తీగా మార్చుతుంది. ఈ మిశ్రమాన్ని గోళ్ళకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల గోళ్ళు స్ట్రాంగ్ గా మారుతాయి. హైడ్రేషన్ జరుగుతుంది. ఇంకా గోళ్ళు పచ్చదనం, నిర్జీవమైన గోళ్ళు పెరగకుండా నివారిస్తుంది.

పెదాల పగుళ్ళను నివారిస్తుంది :

పెదాల పగుళ్ళను నివారిస్తుంది :

అందమైన ముఖంలో పగిలిన, నల్లని, పొడి బారిన పెదాలు ముఖ అందాన్ని పాడుచేస్తాయి. కాబట్టి, రాత్రి రాత్రి పెదాలు అందంగా మారాలంటే నిమ్మరసం అప్లై చేయండి. నిమ్మరసంలో కొద్దిగా పంచదార మిక్స్ చేసి పెదాల మీద స్ర్కబ్ చేస్తే ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. కొద్దిసేటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే నిమ్మరసం పెదాల మీద ఉండే డార్క్ స్కిన్ ను సులభంగా తొలగిస్తుంది.నిమ్మరసం, తేనె మిశ్రమం తాగితే ఖచ్చితంగా బరువు తగ్గుతారా ?

డ్రైగా మరియు పొడిగా మారిన చర్మాన్ని తొలగిస్తుంది:

డ్రైగా మరియు పొడిగా మారిన చర్మాన్ని తొలగిస్తుంది:

నిమ్మరసంలో స్కిన్ మాయిశ్చరైజింగ్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇది డ్రై మరియు ఫ్లాకీ స్కిన్ ను నివారిస్తుంది. దీనికి కొద్దిగా నిమ్మరసం మరియు పెరుగును చేర్చాలి. నిమ్మరసాన్ని చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ ఉపయోగించడం వల్ల చర్మంలో డ్రై నెస్, దురద మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. డ్రైస్కిన్ నివారించడంలో ఎక్సలెంట్ హోం రెమెడీ నిమ్మరసం.

మొటిమలను నివారిస్తుంది:

మొటిమలను నివారిస్తుంది:

నిమ్మరసంలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండటం వల్ల ఇది మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. నిమ్మరసంకు కొద్దిగా తేనె మిక్స్ చేసి, మొటిమల మీద అప్లై చేసి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ హోం రెమెడీని ఉపయోగించడం వల్ల మొటిమలు, మచ్చలు ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి.

బ్లాక్ అయిన చర్మ రంద్రాలను శుభ్రం చేస్తుంది:

బ్లాక్ అయిన చర్మ రంద్రాలను శుభ్రం చేస్తుంది:

నిమ్మరసం బ్లాక్ అయిన చర్మ రంద్రాలు తెరచుకునేలా చేసి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది. నిమ్మరసంలో కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Uses Of Lemon For Skin Care in Telugu

Lemon is inexpensive fruit is easily available in the market and also can be used regularly. Hence, it finds its use in several skin care and hair care routines.
Subscribe Newsletter