For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకున్న అలవాట్లే - మీ కంటి కింద నల్లటి వలయాలకు కారణం కావచ్చు !

మీ కంటి కింద ఏర్పడే నల్లటి వలయాలకు కారణమైన అలవాట్లను గూర్చి, ఒక జాబితాను సిద్ధం చేసి "బోల్డ్ స్కై" మీ ముందుకు తీసుకువచ్చింది. అవేమిటో మీరు గమనించండి. మీ కంటి కింద ఉన్న చర్మంలో వచ్చే మార్పులను బట్టి మీ

|

అన్ని రకాల వయస్సులు కలిగిన మహిళలందరూ కంటి కింద నల్లటి వలయాలతో ఇబ్బందులు పడటం సర్వసాధారణమైపోయింది. కంటి కింద ఏర్పడిన ఈ పరిస్థితి ఆ వ్యక్తి యొక్క చర్మం నిస్తేజంగానూ మరియు నిస్సారంగానూ కనబడుతుంది.

హార్మోన్లలో మార్పులు సంభవించడం, ఆరోగ్యపరమైన సమస్యలు, సమతుల్యమైన ఆహారం అందకపోవడం మొదలైన వంటి కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణం కావచ్చు.

అయితే, చాలా తరచుగా ఈ నల్లటి వలయాలనేవీ మన అలవాట్ల వల్లనే సంభవిస్తున్నాయి. అవును, మీరు చదివింది నిజమే ! మీరు పడుకునే తీరు నుండి ముఖానికి వేసుకున్న మేకప్ను తొలగించే వరకూ కలిగి ఉన్న అనేక అంశాలు ఈ పరిస్థితిని ప్రభావితం చేసేవిగా వుండవచ్చు.

మీ కంటి కింద ఏర్పడే నల్లటి వలయాలకు కారణమైన అలవాట్లను గూర్చి, ఒక జాబితాను సిద్ధం చేసి "బోల్డ్ స్కై" మీ ముందుకు తీసుకువచ్చింది. అవేమిటో మీరు గమనించండి.

మీ కంటి కింద ఉన్న చర్మంలో వచ్చే మార్పులను బట్టి మీరు కొనసాగించే అలవాట్లను పూర్తిగా మానుకోవలసి అవసరం ఉంది.

అలా మీ చర్మాన్ని దెబ్బతీసే అలవాట్లను ఈ క్రిందన వివరించబడాయి. అదేమిటో మీరు కూడ గెలుచుకోండి.

(గమనిక : కళ్లకింద నల్లటి వలయాలు అనారోగ్య సమస్యలను సూచించే సూచకంగా కూడా ఉండవచ్చు, కాబట్టి మీ అలవాట్లలో మార్పు చేసుకునే ముందు డాక్టర్ను సంప్రదించడం మంచిది)

1. సరైన నిద్ర-లేకపోవడం :

1. సరైన నిద్ర-లేకపోవడం :

సరైన నిద్రలేకపోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ నవ దించడానికి కారణమవుతుంది, అందువల్ల మీ కంటి క్రింద నల్లని వలయాలు ఏర్పడటానికి కారణమవుతుంది. ఇది మీ కంటి కింద ఏర్పడే నల్లటి వలయాల నల్లటి వలయాల కే కాకుండా ఇతర చర్మ సమస్యలతో కూడా కారణమవుతున్నాయి.

2. కంటి చుట్టూ వేసుకున్న మేకప్ను తొలగించకపోవడం :

2. కంటి చుట్టూ వేసుకున్న మేకప్ను తొలగించకపోవడం :

మీరు కలిగి ఉన్న రోజువారి అలవాట్లలో కంటి చుట్టూ వేసుకున్న మేకప్ను తొలగించకపోవడం కూడా ఒకటి. నిదురించే ముందు, మీ కళ్ళకు ఉన్న మేకప్ను సరైన మార్గంలో తొలగించకపోవడం వల్ల కంటి కింద వలయాలు ఏర్పడటానికి కారణమవుతున్నాయి.

3. డీహైడ్రేషన్ :

3. డీహైడ్రేషన్ :

కొన్ని అధ్యయనాల ప్రకారం డీహైడ్రేషన్కు మరియు కంటి కింద ఏర్పడిన నల్లటి వలయాలు మధ్య సంబంధం ఉందని కనుగొనబడినది. ఇది హైడ్రేషన్ వల్ల మీ కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడటమే కాకుండా మీ కంటి చుట్టూ ఉన్న చర్మం పొడిగాను మరియు గరుకుగా ఉన్నట్లు కనిపించేలా చేస్తుంది.

4. మీ కళ్ళను ఎక్కువగా రుద్దటం :

4. మీ కళ్ళను ఎక్కువగా రుద్దటం :

ఇలా చేయడం వల్ల మీ కంటి చుట్టూ ఉన్న చర్మాన్ని దెబ్బతీయడమే కాకుండా, రంగు మారడానికి కూడా కారణమవుతుంది. కళ్లను రుద్దే అలవాటు కారణంగా మీ సున్నితమైన చర్మానికి హాని కలిగించడమే కాకుండా, శోధ-నిరోధకతలో ప్రతిచర్యలను కలిగి మీ చర్మం నల్లబడడానికి దారితీస్తున్నాయి.

5. మీ చర్మం, సూర్యరశ్మి బారిన పడటం వల్ల :

5. మీ చర్మం, సూర్యరశ్మి బారిన పడటం వల్ల :

సూర్యకాంతి నేరుగా మీ సున్నితమైన చర్మాన్ని తాకటం వల్ల కంటి కింద ఉన్న చర్మాన్ని ప్రభావితం చేయవచ్చు. మీ కంటి కింద ఉన్న చర్మం రంగు మారడానికి మరియు వృద్ధాప్య ఛాయలు కనబడటానికి ఇదే కారణం కావచ్చు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండడానికి మీ కంటి కింద ఉన్న చర్మాన్ని సన్స్క్రీన్ లోషన్ను ఉపయోగించడం వల్ల సూర్యకాంతి ప్రభావం నుండి బయటపడతారు.

6. వేడినీటితో శుభ్రం చేయటం :

6. వేడినీటితో శుభ్రం చేయటం :

మీ కళ్ల చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితమైనది మరియు మృదువైనది కావడం వల్ల, వేడి నీటితో చర్మాన్ని కడగటం వల్ల, దాని యొక్క సహజమైన ఛాయను కోల్పోతుంది. మీరు ఈ విధమైన అలవాట్లను కలిగి ఉండటం వల్ల చర్మం పై ప్రతికూల ప్రభావాన్ని చూపించడమే కాకుండా, నల్లటి వలయాలు ఏర్పడటానికి దారితీస్తుంది.

7. మేకప్ను కఠినమైన రీతిలో తొలగించటం వల్ల :

7. మేకప్ను కఠినమైన రీతిలో తొలగించటం వల్ల :

మీ కంటికి వేసుకున్న మేకప్ను కఠినమైన రీతిలో తొలగిస్తున్నారా ? మీరు అలా చేసినట్లయితే, మీ కంటి కింద ఉన్న చర్మం దెబ్బతినడానికి మరియు దాని యొక్క సహజమైన రంగుని కోల్పోవడానికి కారణం కాగలదు. సున్నితమైన పద్ధతిలో కంటికి వేసుకున్న మేకప్ను తొలగించే ప్రయత్నం చేయడం వల్ల మీ చర్మానికి ఏ విధమైన నష్టము జరగకుండా ఉంటుంది.

8. కడుపు మీద పడుకోవడం వల్ల :

8. కడుపు మీద పడుకోవడం వల్ల :

ఇలాంటి అలవాటును కలిగి ఉండటం వల్ల మీ కళ్ల కింద ద్రవాన్ని నిలుపుదల చేయడానికి ఆస్కారం ఉంది అలా, మీ చర్మం వికారంగా మారటానికి మరియు నల్లటి వలయాలు ఏర్పడటానికి దారితీస్తుంది. కాబట్టి, మీరు ఈ అలవాటును మాని వేసి, ఎడమవైపు తిరిగి నిద్రించడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి, నల్లటి వలయాలు మరియు కళ్లు ఉబ్బెత్తుగా ఉండటం వంటి సమస్యలను నిరోధించవచ్చును.

9. ప్రభావం చూపని, కంటి సౌందర్య సాధనాలను వాడటం :

9. ప్రభావం చూపని, కంటి సౌందర్య సాధనాలను వాడటం :

చిట్టచివరిగా, కంటి సౌందర్యానికి సంబంధించిన సౌందర్య సాధనాలను ఉపయోగించడం వల్ల మీ కళ్ళ కింద ఉన్న చర్మము నల్ల బడటానికి కారణం కావచ్చు. స్మెర్లింగ్ (లేదా) స్లేవరింగ్స్ క్రీములను వాడటం వల్ల, మీ సున్నితమైన చర్మానికి హాని కలగవచ్చు. అందువల్ల, మీ కంటి కింద వున్న చర్మం సంగ్రహించగలిగే సమర్థవంతమైన ఉత్పత్తి సాధనాలను ఉపయోగించుకోవటం అన్నింటికన్నా ఉత్తమం.

Read more about: dark circles eyes
English summary

Everyday Habits That Cause Dark Circles Under Your Eyes

Dark circles is an exceedingly common skin problem that women of different age groups are plagued with. This under-eye condition can make a person's skin appear dull and lifeless.A variety of factors like hormonal changes, health-related issues, unbalanced diet, etc., can cause darkening of the skin under your eyes.
Story first published:Monday, February 12, 2018, 15:37 [IST]
Desktop Bottom Promotion