For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పెద్దగా తెరచుకుని ఉన్న చర్మ రంధ్రాలను, మూసివేయడం ఎలా ?

  |

  బయటవైపుకు తెరవబడిన మరియు పెద్దగా ఉన్న చర్మ రంధ్రాలనేవి, జిడ్డు చర్మం కలిగి ఉన్న వ్యక్తులు అనుభవించే సాధారణమైన సమస్యగా చెప్పవచ్చు. కానీ పొడి చర్మము మరియు ఇతర రకాల చర్మాలను కలిగి ఉన్న ప్రజలలో ఇది సంభవించదని కాదు. చర్మము దానియొక్క లక్షణాలను కలిగి ఉన్న రీతిలోనే, చర్మ సమస్యలను కూడా కలిగి ఉంటాయి.

  ఉదాహరణకు, పొడి చర్మం కలిగి ఉన్నవ్యక్తులు ఎక్కువ వయస్సును కలిగి ఉన్నట్లుగా కనబడతారు ఎందుకంటే వారి యొక్క చర్మం తేమను కోల్పోవడం వల్ల ముడతలుగా ఏర్పడడానికి ప్రధాన కారణంగా ఉంది. అదేవిధంగా, పెద్దగా బయటకు తెరచుకొన్న చర్మ రంధ్రాలనేవి వారి యొక్క ముఖచర్మం చాలా జిడ్డుగా ఉండటం వల్ల అనుభూతిని చెందే ఒక సాధారణమైన చర్మసమస్య.

  బయటవైపుకు తెరవబడిన మరియు పెద్దగా ఉన్న చర్మ రంధ్రాల దశ కారణంగా మోటిమలు మరియు నల్లని మచ్చల వంటి సమస్యలకు దారితీస్తుంది. అలా ఎదురైనా వాటిని నివారించడానికి బదులుగా, ఈ విధమైన సమస్యకు కారణమైన "పెద్దగా ఉన్న చర్మ రంధ్రాలను" పరిష్కరించడానికి మనము ఎందుకు ప్రయత్నించకూడదు ??

  How To Shrink Large Pores Naturally

  వంటి క్రొవ్వు పదార్ధాల కారణంగా, గాలిలో విహరించే ధూళి మరియు బ్యాక్టీరియాలను ముఖము ఆకర్షించటం వల్ల, అవి చర్మం పైనే అతుక్కుపోయి మరియు బయటవైపుకు తెరుచుకున్న చర్మ రంధ్రాలను అడ్డుకుంటాయి, అలా క్రమక్రమంగా చిన్నగా ఉన్న చర్మరంధ్రాలను పెద్దగా కనబడేలా చేస్తాయి.

  ఈ రోజుల్లో మార్కెట్లలో అందుబాటులో ఉన్న అనేక సౌందర్య సాధనాలు పెద్దగా తెరుచుకుని ఉన్న చర్మ రంధ్రాలను తగ్గిస్తాయి, కానీ మీ ఇంట్లోనే సహజమైన పద్ధతుల ద్వారా మంచి చిట్కాలను తయారు చేయవచ్చు. మరొక చిట్కా ఏమిటంటే, మీ ముఖాన్ని బాగా కడిగి, శుభ్రపరచిన తర్వాత స్కిన్ టోనర్ను ఉపయోగించడం వల్ల మీ చర్మ రంధ్రాలు పెద్దవి కాకుండా నిరోధించబడతాయి.

  పెద్దగా తెరచుకొన్న చర్మ రంధ్రాలు మీ యొక్క వయస్సును పెంచేవిగా కూడా ఉంటాయి. కాబట్టి, మీ చర్మ రంధ్రాలు మరింత పెద్దవి కాకుండా నివారించేందుకు అనుసరించవలసిన కొన్ని సహజమైన మార్గాలను ఇక్కడ చూపబడినవి.

  1. గుడ్డులో తెల్లని సొన :

  1. గుడ్డులో తెల్లని సొన :

  మీ ముఖ చర్మం పై ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నా 'కొవ్వుతో కూడిన శ్లేష్మమును' నివారించడానికి గుడ్డులో ఉన్న తెల్లనిసొన బాగా ఉపయోగపడుతుంది. మెరుగైన ఫలితాలను పొందడానికి ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటించాలి. గుడ్డును పగలగొట్టి న తరువాత అందులోనుండి పచ్చసోనను వేరు చెయ్యగా, మిగిలివున్న తెల్లని సొనలో కొద్దిగా నిమ్మరసాన్ని చేర్చి మీ ముఖానికి ప్యాక్లా అప్లై చేసుకోండి. అలా ఆ పదార్థం పొడిగా మారడానికి కనీసం 15 - 20 నిమిషాల సమయం పడుతుంది, ఆ తర్వాత మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగండి. ఇలా వారంలో ఒకసారి చేయండి.

  2. మంచు (ఐస్) గడ్డలు :

  2. మంచు (ఐస్) గడ్డలు :

  ఒక చేతి రుమాలులో కొన్ని ఐస్ గడ్డలను ఉంచి మీ ముఖంపై మెల్లగా నొక్కుతూ ఉండండి. ఇది మీ ముఖం పైన రంధ్రాలు పరిమాణాన్ని తగ్గించడమే కాకుండా, మీ ముఖం పైన రక్తప్రసరణను కూడా పెంచుతుంది. ఇది మీ ముఖానికి మేకప్ వేసుకునే ముందు ఆచరించవలసిన మంచి చిట్కా. ఈ చిట్కాతో మీరు మరిన్ని ప్రయోజనాలను పొందేందుకు, మీరు రోజ్ వాటర్తో ఐస్ గడ్డలను తయారుచేయండి. ఈ రకమైన పద్ధతిని రోజులో ఎప్పుడైనా అనుసరించవచ్చు. అలా చేయడంవల్ల మీరు ఉపశమనాన్ని పొందటమే కాకుండా, మీ చర్మ రంధ్రాల సైజును తగ్గించుకోవచ్చు.

  3. నిమ్మ రసం:

  3. నిమ్మ రసం:

  నిమ్మ రసంలో ఉండే సిట్రిక్ యాసిడ్, మీ చర్మ రంధ్రాలను మూసివేయటానికి బాగా సహాయపడుతుంది. ఈ ఆమ్లము యొక్క అదనపు ప్రయోజనం ఏమిటంటే, మీ చర్మం మీద సున్నితమైన బ్లీచింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఇది చర్మం మీద ఉన్న తాన్ మరియు డార్క్ స్పాట్స్ యొక్క స్వరూపాన్ని తగ్గిస్తుంది. దీనికోసం, ఒక నిమ్మకాయ నుండి రసంను వేరుచేసి, ఆ రసాన్ని మీ ముఖం మీద అప్లై చేయండి. దానికోసం దానికోసం మీరు మీ చేతులను ఉపయోగించవచ్చు, కానీ మీరు మరింత సౌలభ్యం కోసం బ్రష్ను (లేదా) దూదిని ఉపయోగించవచ్చు. మీ ముఖానికి రాసి నా నిమ్మరసం బాగా ఎండిపోయిన తర్వాత శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఈ పద్ధతి ద్వారా మీ చర్మం కొద్దిగా బాధపడవచ్చు, అంటే నిమ్మరసం బాగా పనిచేస్తుందని దానర్ధం.

  4. ముల్తానీ మిట్టి:

  4. ముల్తానీ మిట్టి:

  ముల్తానీ మిట్టి (లేదా) ఫుల్లర్స్ ఎర్త్, అనే పద్ధతిని అత్యధిక మంది భారతీయ స్త్రీలు సాధారణంగా ఉపయోగించే ఫేస్ మాస్కుల్లో ఒకటని చెప్పవచ్చు. ఈ ముల్తానీ మట్టి మీ చర్మంపై ఎక్కువగా ఉత్పత్తి కాబడిన శ్లేష్మమును తగ్గించటంలోనూ మరియు పెద్దగా వ్యాప్తి చెందిన చర్మ రంద్రాలను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజు వాటర్తో ముల్తానీ మట్టిని కలిపి ఒక మెత్తని పేస్టులా తయారు చేయండి. ఈ పేస్ట్ని ముఖానికి ఫేస్ ప్యాక్లా అప్లై చేసి, అది బాగా పొడిగా మారడానికి కనీసం 15 - 20 నిమిషాల సమయం పడుతుంది. ఆ తర్వాత మీ ముఖాన్ని శుభ్రంగా నీటితో కడిగి, పేస్ టోనర్గా రోజు వాటర్ను చివరిగా అప్లై చేయాలి. మంచి ఫలితాలను పొందడానికి వారంలో ఒకసారి దీన్ని ప్రయత్నించండి.

  5. తేనే:

  5. తేనే:

  తేనే, బాగా తెరుచుకుని ఉన్న చర్మ రంధ్రాల పరిమాణాన్ని తగ్గించటంలో చాలా సమయాన్ని తీసుకుంటుంది, కానీ చాలా సున్నితంగా మరియు సమర్థవంతంగా పనిచేస్తుంది. మీ చర్మ రంధ్రాలను మూసివేయడం ద్వారా, మీ చర్మాన్ని తేమగా మరియు మృదువుగా ఉంచేలా చేస్తుంది. మీరు చర్మం సౌందర్యం లాంటి అదనపు ప్రయోజనాలను పొందడానికి తేనెకి కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి, అప్లై చేయడం.

  6. పెరుగు :

  6. పెరుగు :

  పెరుగులో ఉన్న లాక్టిక్ యాసిడ్ చర్మ రంధ్రాల యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది, సూర్యరశ్మి మరియు కాలుష్య ప్రభావాలను నివారించి, మీ చర్మాన్ని మరింత కాంతివంతంగా చేయటంలో సహాయపడుతుంది. ఎండలో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల మీ చర్మ గ్రంథులు బాగా పెద్దగా మారడానికి దోహదపడవచ్చు. దీనికోసం మీరు 2 టీ స్పూన్ల పెరుగు తీసుకొని - మీ ముఖానికి అప్లై చేయాలి. కొంత సమయం తరువాత, మీ చర్మాన్ని గట్టిగా మారినట్లుగా అనుభూతిని చెందుతారు. ఆ తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని కడగండి. పెరుగు మీ చర్మంపై చాలా సున్నితంగా పనిచేస్తుంది కావున ఈ చిట్కాలను ప్రతిరోజూ ఆచరించడం చాలా మంచిది.

  7. షుగర్ స్క్రబ్ :

  7. షుగర్ స్క్రబ్ :

  చర్మం పొరల రూపంలో ఊడిపోవడం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. షుగర్ యొక్క పౌడర్ను మరియు తేనెను కలిపి ఉపయోగించి ఒక మంచి స్క్రబ్ను తయారుచేసుకోవచ్చు. దీనిని వృత్తాకారంలో ఈ స్క్రబ్ను మీ చర్మం పై రుద్దుతూ ఉండటం వల్ల, చర్మం లోపల ఉన్న దుమ్మును పూర్తిగా వదిలించుకోవచ్చు.

  English summary

  How To Shrink Large Pores Naturally

  Open and large pores lead to more problems, like acne and blackheads, so instead of finding cures for the acne and blackheads, why not try to deal with the issue at its root, and that is, large pores? Home remedies are the best cure for large pores and these are the best solution.
  Story first published: Tuesday, February 20, 2018, 9:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more