For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కడుపులో పుండ్లను తగ్గిస్తుంది+ కొత్తిమీర యొక్క 6 ఇతర ఆరోగ్య లాభాలు

ప్రతి భోజనం తర్వాత మీ కడుపులో మంటగా అన్పిస్తుందా? తరచుగా ఉబ్బరంగా కూడా అన్పిస్తుందా?అవునైతే, మీరు గ్యాస్ట్రైటిస్ తో బాధపడుతూ ఉండవచ్చు మరియు ఇది సాధారణ వచ్చే జీర్ణసమస్య. దీని వల్ల అన్ని సమయాల్లో అసౌకర్

|

ప్రతి భోజనం తర్వాత మీ కడుపులో మంటగా అన్పిస్తుందా? తరచుగా ఉబ్బరంగా కూడా అన్పిస్తుందా?

అవునైతే, మీరు గ్యాస్ట్రైటిస్ తో బాధపడుతూ ఉండవచ్చు మరియు ఇది సాధారణ వచ్చే జీర్ణసమస్య. దీని వల్ల అన్ని సమయాల్లో అసౌకర్యంగా అన్పిస్తుంది!

గ్యాస్ట్రైటిస్ అంటే ప్రేగులు మరియు కడుపు గోడలు వాచిపోవటం. ఇది ఇలా ఎక్కువ జీర్ణాశయ యాసిడ్లు ఉత్పత్తి అవటం వలన జరుగుతుంది. ఆ ఉత్పత్తికి కారణాలు అనేకం ఉండవచ్చు.

కడుపు ఉబ్బరం, అధికంగా గ్యాస్ కడుపులో పేరుకోవడం, ఆగకుండా త్రేన్పులు మరియు ఫార్టింగ్, యాసిడ్ వెనక్కి తన్నడం, వికారం, కడుపునొప్పి, ఆకలి లేకపోవటం, వాంతులు మొదలైనవి ఇవన్నీ గ్యాస్ట్రైటిస్ లక్షణాలు.

సరైన సమయాల్లో సరైన ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం తీసుకోకపోతే అది కడుపులో పుళ్ళకి( గ్యాస్ట్రైటిస్) దారితీయవచ్చు. ఇతర కారణాలు మానసిక వత్తిడి, స్థూలకాయం, కొన్ని మందుల దుష్ప్రభావాలు మొదలైనవి కావచ్చు.

చాలాకాలం పాటు ఈ స్థితికి చికిత్స లేకుండా వదిలేస్తే , అది కడుపులో క్యాన్సర్ కి కూడా దారితీయవచ్చు.

అందుకే ఈ కడుపులో పుండ్లని శాశ్వతంగా తగ్గించే వంటింటి చిట్కా మీకోసం.

గ్యాస్ట్రైటిస్ ను తగ్గించే వంటింటి దినుసు ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది ఏమిటంటే మన వంటింట్లో సాధారణంగా వాడుకునే కొత్తిమీర ఆకులకు కడుపులో పుండ్లను తగ్గించే శక్తి ఉందని,అది కూడా శాశ్వతంగా నయం చేయగలవని తేలింది.

కొత్తిమీర ఇలా చికిత్స చేస్తుంది

కొత్తిమీరలొ పొటాషియం మరియు విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు కడుపులో అధికంగా యాసిడ్లు ఉత్పత్తి కానీయకుండా చూసి, కడుపు మరియు ప్రేగుల గోడలను మంట నుండి ఉపశమించేలా చేస్తాయి. అలా గ్యాస్ట్రైటిస్ లక్షణాలు తగ్గుతాయి.

ఈ చిట్కా ఎంత శాశ్వతమైనది?

ఈ చిట్కా ఎంత శాశ్వతమైనది?

ఈ కొత్తిమీర ఆకుల చిట్కాను క్రమం తప్పక మీరు తీసుకుంటే,దాని సానుకూల ప్రభావాలు మీకు శాశ్వతంగా గ్యాస్ట్రైటిస్ నుంచి విముక్తి కలిగించి, దాని లక్షణాలను నియంత్రణలో ఉంచుతాయి.

ఎలా తయారుచేయాలి

ఎలా తయారుచేయాలి

చేతిలో పట్టినన్ని కొత్తిమీర ఆకులను నీటిలో వేసి మరిగించండి. తర్వాత ఆ ఆకులను నీటిలోనే 2 గంటలపాటు మూతపెట్టి వదిలేయండి. తర్వాత నీటిని వడగట్టి ఒక గ్లాసులోకి తీసుకోండి. ఈ నీటిని ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముందు తాగండి.

గమనిక#1

గమనిక#1

ఈ కొత్తిమీర చిట్కా కేవలం మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మొదలుపెడితేనే పనిచేస్తుంది. నూనె మరియు మసాలాలు ఎక్కువున్న పదార్థాలు తింటూ పోతేకాదు. భోజనం మానేయటం కూడా దీనికి పనికిరాదు. పొగతాగడం, మద్యం సేవించడం కూడా మానేయండి లేకపోతే గ్యాస్ట్రైటిస్ ఇంకా పెరుగుతుంది.

గమనిక #2

గమనిక #2

ఒకవేళ మీకు తీవ్రంగా గ్యాస్ట్రైటిస్ లక్షణాలుంటే, మీరు వెంటనే వైద్యసాయం తీసుకోవాల్సి ఉంటుంది! తీవ్రమైన కేసుల్లో ఈ చిట్కా బాగా పనిచేయకపోవచ్చు. గర్భవతులు ఈ చిట్కా పాటించే ముందు డాక్టర్లను సంప్రదించాలి.

కొత్తిమీర యొక్క ఇతర లాభాలు ఇక్కడ ఉన్నాయి, చదవండి.

1.మధుమేహం తగ్గిస్తుంది

1.మధుమేహం తగ్గిస్తుంది

కొత్తిమీరలో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి, ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిని కూడా సమతుల్యం చేస్తుంది. దీనివల్ల డయాబెటిస్ లక్షణాలు అదుపులో ఉంటాయి.

2.కీళ్ళవాతానికి మంచిది

2.కీళ్ళవాతానికి మంచిది

ఆర్థరైటిస్ అంటే శరీరంలో కీళ్ళు అన్నీ గట్టిగా మారి కదలకుండా, కదిలితే నొప్పి వచ్చే స్థితి. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన కీళ్ళకు, కార్టిలేజెస్ కు రక్తం సరఫరా అయ్యేట్టు చూసి కీళ్లవాతాన్ని సహజంగా నయం చేస్తుంది.

3.నొప్పులను తగ్గిస్తుంది

3.నొప్పులను తగ్గిస్తుంది

మనం కొత్తిమీర ఎలా కడుపునొప్పి మరియు కీళ్ళలో నొప్పిని నయం చేస్తుందో చూసాం కదా? అలాగే, కొత్తిమీర ఇతర భాగాల్లో నొప్పులను కూడా తగ్గిస్తుంది.ఎందుకంటే ఇందులో వాపు వ్యతిరేక లక్షణాలున్నాయి.

4.కిడ్నీలో రాళ్ళకు మంచి చికిత్స

4.కిడ్నీలో రాళ్ళకు మంచి చికిత్స

కిడ్నీలో రాళ్ళు కిడ్నీలో పేరుకున్న వ్యర్థపదార్థాలైన ఖనిజలవణాలు మరియు చెత్త ముద్దలు. ఇవి నొప్పి మరియు ఇతర లక్షణాలను కలిగిస్తాయి. కొత్తిమీర సహజంగా డైయూరిటిక్ కావటం వలన ఇది కిడ్నీలోంచి అనవసర వ్యర్థాలను బయటకి తరిమివేసి మరియు కిడ్నీలో రాళ్ళను సహజంగా తగ్గిస్తుంది.

5.రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది

5.రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది

కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు మరియు పొటాషియం ఎక్కువగా ఉండి శరీరంలో ప్రతి కణాన్ని బలంగా మారుస్తాయి.అలా అన్ని వ్యాధులతో పోరాడే శక్తి పెరిగి మీ రోగనిరోధక వ్యవస్థ బలంగా,శరీరం ఆరోగ్యంగా మారుతుంది.

6.క్యాన్సర్ ను నివారిస్తుంది

6.క్యాన్సర్ ను నివారిస్తుంది

అనేక అధ్యయనాల్లో తేలింది ఏమిటంటే కొత్తిమీరలోని యాంటీఆక్సిడెంట్లు మరియు ఫ్లేవనాయిడ్లు కొన్ని సాధారణ రకాల క్యాన్సర్లను, కాన్సర్ కారకమైన కణాలు అభివృద్ధి చెందకుండా అడ్డుకుని నివారిస్తాయి.

ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి!

మీకు ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా అన్పిస్తే, మీ స్నేహితులు కూడా దీన్ని చదవవచ్చు.

English summary

Reduce Gastritis + 6 Other Health Benefits Of Parsley

Gastritis is a common ailment caused by the inflammation of the stomach lining. And it can affect your health severely. Parsley can help relieve these symptoms.
Desktop Bottom Promotion