For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహమా ? అయితే.. ఆహార నియమాలేంటో తెలుసుకోండి

By Nutheti
|

మధుమేహం ఈ రోజుల్లో సాధారణమైన వ్యాధి. సరైన ఆహార నియమాలు, ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే.. మధుమేహం మరింత ఇబ్బంది పెట్టవచ్చు. మధుమేహానికి ఒబేసిటీ ప్రధాన కారణం. మధుమేహంతో బాధపడే వాళ్లు ఖచ్చితంగా ఆహార నియమాలను పాటించాలి. ప్రణాళికాబద్దంగా డైట్ ఫాలో అవ్వాలి.

బెల్లీ ఫ్యాట్ ఉన్నవాళ్లు షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళలకు నడుము భాగం 35 ఇంచులు అంతకంటే ఎక్కువ ఉంటే వాళ్లకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే పురుషుల్లో 40 ఇంచులు అంతకంటే ఎక్కువ ఉంటే.. ఈజీగా మధుమేహం బారిన పడతారు.

ప్రాణాంతకమైన మధుమేహం నుంచి బయటపడాలంటే.. చాలా మార్గాలున్నాయి. సరైన ఆహార నియమాలు పాటించడం వల్ల మధుమేహాన్ని చాలా వరకు అరికట్టవచ్చు. కాబట్టి షుగర్ వ్యాధితో బాధపడేవాళ్లు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి.. వాళ్ల రోజువారీ ఆహారంలో ఎలాంటి పదార్థాలు చేర్చుకోవాలో తెలుసుకుందాం..

పండ్లు

పండ్లు

రోజూ తాజా పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాలి. యాపిల్స్, పియర్స్, బెర్రీస్, బొప్పాయి వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఈ పండ్లలో కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

కూరగాయలు

కూరగాయలు

మరో ముఖ్యమైనది కూరగాయలు. మధుమేహంతో బాధపడేవాళ్లు.. నిత్యం తాజా కూరగాయలు తీసుకోవాలి. బీన్స్ వంటి కూరగాయలు ఎక్కువగా తినాలి. వీటిల్లో తక్కువ కొవ్వు శాతం, ఎక్కువ ఫైబర్ ఉంటుంది.

ధాన్యాలు

ధాన్యాలు

ధాన్యాలకు ఎక్కవ ప్రాధాన్యత ఇవ్వాలి. బ్రౌన్ రైస్, జొన్నలు, బార్లీ వంటివి నిత్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు.

గ్రీన్ లీఫీ వెజ్జీస్

గ్రీన్ లీఫీ వెజ్జీస్

రోజూ తీసుకునే ఆహారంలో గ్రీన్ లీఫీ కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. కేల్, పాలకూర, బచ్చలికూర, క్యాబేజీ వంటి వాటిని నిత్యం తీసుకోవడం మంచిది.

బ్రెడ్

బ్రెడ్

డయాబెటిక్ పేషంట్ రెగ్యులర్ బ్రెడ్ కి దూరంగా ఉండాలి. మల్టీ గ్రెయిన్ బ్రెడ్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

ఓట్స్

ఓట్స్

షుగర్ వ్యాధిగ్రస్తులకు ఓట్స్ సరైన ఆహారం. వీటిని నిత్యం ఏ రూపంలోనైనా తీసుకుంటూ ఉండాలి.

నట్స్

నట్స్

వాల్ నట్స్, బాదాం, వేరుశనగ వంటి నట్స్ ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

కాఫీ, టీ

కాఫీ, టీ

చక్కెర లేని కాఫీ, టీ డయాబెటిక్ పేషెంట్లు తీసుకోవచ్చు. అయితే పాలల్లో కొవ్వు శాతం తక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. సోడాలకు దూరంగా ఉండటం మంచిది.

ఫ్యాట్స్

ఫ్యాట్స్

వెజిటబుల్ ఆయిల్స్, వెన్న వంటి వాటిని తీసుకోవచ్చు. కాకపోతే కొవ్వు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రొడక్ట్స్ నిత్యం ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే వీటిలో మినరల్స్, ప్రొటీన్స్, క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి తక్కువ ఫ్యాట్ ఉన్న ఆహార పదార్థాలు సేవించాలి.

మాంసం

మాంసం

చేపలు, కోడిగుడ్లు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. కానీ.. డీప్ ఫ్రై చేయని ఆహారాలే తీసుకోవాలి. మటన్ ని ఉడకబెట్టిన రూపంలో తీసుకోవాలి. బేక్ చేసినవి, ఫ్రై చేసిన వాటికి మధుమేహ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండాలి.

షుగర్ వ్యాధిగ్రస్తులు మూడు మీల్స్, రెండు స్నాక్స్ ని రోజూ ఫాలో అవ్వాలి. పైన చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ.. రోజువారీ ఆహారం తీసుకోవడం వల్ల డైయాబెటిస్ నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు.

English summary

Foods Diabetics Must Consume Everyday: health tips in telugu

Diabetes is becoming a common disease these days. If proper attention is not paid, it can lead to several complications. It is thereby, considered one of the deadly diseases. One main reason behind diabetes is obesity.
Story first published: Monday, October 12, 2015, 9:58 [IST]
Desktop Bottom Promotion