For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిక్ పేషంట్స్ నీళ్ళు ఎక్కువగా తాగడానికి గల ముఖ్య కారణాలు

|

ఇంట్లో కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఎక్కువగా నీళ్ళు దాహమేస్తోందని తరచూ అంటుండగా మీరు వింటున్నారా? అయితే మీరు వారి గురించి ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సిందే. కంపల్సరీ డాక్టర్ ను కలవాల్సిందే . ఇటువంటి లక్షణాలు కనబడినప్పుడు ఖచ్చితంగా డయాబటిక్ లక్షణాల్లో ఒకటిగా గుర్గించాలి.

డయాబెటిస్ టెస్ట్ చేయించుకున్న తర్వాత లక్షణాలు లేదా సంకేతాలను బట్టి డయాబెటిస్ నిర్ధారణ అయిన తర్వాత ఖచ్చితంగా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిక్ సమస్య ఉన్న వారి శరీరంలో గ్లూకోజ్ లేదా బ్లడ్ షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ పేషంట్స్ లో టిష్యులలోని నీరును ఎక్కువగా గ్రహించడం వల్ల వీరు ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురి అవుతారు .

డయాబెటిక్ వారిపై రీసెంట్ గా జరిపిన కొన్ని పరిశోధనల ప్రకారం, డయాబెటిక్ లక్షణాలు ఉన్నవారు లేదా డయాబెసిస్ తో బాధపడుతున్నవారు ఎక్కువగా నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్ తో పాటు, నీరు సరిగా తాగకపోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. బాడీ డీహైడ్రేషన్ వల్ల ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

ఎవరైనా సరే తీసుకోగలిగిన స్వచ్చమైన ద్రవం వాటర్ . నీళ్లలో క్యాలరీలు, సోడియం, ఫ్యాట్, కొలెస్ట్రాల్, లేదా కెఫిన్లు వంటివి ఏవి ఉండవు . కాబట్టి, సాధారణ వ్యక్తులు మాత్రమే కాదు, డయాబెటిక్ పేషంట్స్ ఎక్కువగా నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ ను నివారించుకోవచ్చు. అంతే కాదు వాటర్ ఎక్కువగా తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు .

డయాబెటిస్ తో బాధపడుతున్న వారు, వారి రెగ్యులర్ డైట్ లో వాటర్ ను ఎక్కువగా తీసుకోవాలి. ఇది డయాబెటిస్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అదెలాగో తెలుసుకోవాలంటే ఈక్రింది పాయింట్స్ చదవాల్సిందే...

Why Do Diabetics Need To Drink Lots Of Water

1. సరిపడా నీరు తాగడం వల్ల షుగర్ లెవల్స్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది
డయాబెటిక్ పేషంట్స్ లో బ్లడ్ షుగర్ లెవల్స్ తో పాటు గ్లూకోజ్ లెవల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల డయాబెటిక్ పేషంట్స్ నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. షుగర్ ను కంట్రోల్ చేస్తుంది.

Why Do Diabetics Need To Drink Lots Of Water

2. డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది :
డయాబెటిస్ పేషంట్స్ బాడీలో బ్లడ్ షుగర్ లెవల్స్ మరియు గ్లోకోజ్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల టిష్యులలోని నీరు త్వరగా కోల్పోవడం జరగుతుంది. తరచూ మూత్ర విసర్జన వెళ్ళాల్సి వస్తుంది. అందువల్ల డయాబెటిక్ పేషంట్స్ రోజుకు సరిపడా నీళ్ళు తాగడం వల్ల దప్పిక తగ్గుతుంది. శరీరం హైడ్రేషన్ లో ఉంటుంది. శరీరంలో వాటర్ లెవల్ బ్యాలెన్స్ అవుతుంది.

Why Do Diabetics Need To Drink Lots Of Water

3. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:
డయాబెటిక్ పేషంట్స్ లో సహజంగా కనిపించే సమస్య స్కిన్ ఇన్ఫెక్షన్ . డయాబెటిక్ పేషంట్స్ లో బ్లడ్ షుగర్ లెవల్స్ మరియు గ్లూకోజ్ లెవల్స్ ఎక్కువగా ఉండటం వల్ల, టిష్యుల నుండి నీరును ఎక్కువగా గ్రహించడం వల్ల డీహైడ్రేషన్ కు గురికావల్సి వస్తుంది. శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు, స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది. . చర్మం రఫ్ గా , డ్రైగా మారడం వల్ల చర్మం మీద దురద కలుగుతుంది. దాంతో వివిధ రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి. స్కిన్ హైడ్రేషన్ లో ఉంచాలంటే, తగినన్ని నీరు తాగాల్సిందే. రోజుకు సరిపడా నీళ్ళు తాగడం వల్ల స్కిన్ కు తగినంత హైడ్రేషన్ అందుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి .

Why Do Diabetics Need To Drink Lots Of Water

4. అలసటను తగ్గిస్తుంది:
డయాబెటిక్ పేషంట్స్ లో అలసట సాధరణ సమస్య . డయాబెటిక్ పేషంట్స్ ఎండకు ఎక్కువగా తిరడగం లేదా ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో కోల్పోవడం జరుగుతుంది. క్రమంగా బాడీ డీహైడ్రేషన్ కారణంగా అలసట మరియు నీరసంకు దారితీస్తుంది . కాబట్టి, డయాబెటిక్ పేషంట్స్ సరిపడా నీళ్ళు తాగడం మంచిది . దాంతో వారు రోజంతా ఉత్సహాంగా ఉంటారు.

English summary

Why Do Diabetics Need To Drink Lots Of Water?

Many experts have pointed out that drinking water in large amounts is necessary for a diabetic person as even a small amount of dehydration in these people would lead to other severe health hazards.
Desktop Bottom Promotion