For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆహ్లాదకర జీవితానికి ఏడు సూత్రాలు

By B N Sharma
|

Seven Principles of Happy Living
మనకు ఎంత ఐశ్వర్యం వుంది? నెల తిరిగేటప్పటికి ఎంత ఆదాయం వస్తుంది ? అనేవి కాదు ముఖ్యం. మనం ఎంత ఆరోగ్యంగా, ఎంత నాజూకుగా ఉన్నామనేది ఆరోగ్యాన్ని పొందటంలో కల రహస్యం. మన ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషించేది ఆహారం. ఆహారం విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి దినం వ్యాయమం చేస్తూ వుంటే బంగారం లాంటి జీవనం మన సొంతం అవుతుంది. అందుకోసం నిపుణులు సూచిస్తున్న మార్గాలు చూడండి.

1. ప్రతి రోజు మూడు పూటలా కొద్ది మోతాదులో అవసరం మేరకే ఆహారం తీసుకోవాలంటున్నారు.రోజుకు రెండు సార్లు లేదా మూడు సార్లు భోజనం చేయడంతో పాటు డ్రై ఫ్రూట్స్ లేక తాజా పండ్లు లేక ఉడక పెట్టని కూరగాయలు స్నాక్స్ గా తీసుకోవాలని తెలుపుతున్నారు.
2. ఆహారంలో రోజుకు కనీసం 500 గ్రాముల పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. ఇందులో రెండు నుంచి నాలుగు తాజా పండ్లు ఉండాలి. పెసలు, శనగలు, మొదలగు తృణ ధాన్యాలతోపాటు పెరుగు, ఫ్రూట్ సలాడ్లను కూడా తీసుకోవచ్చు.
3. ఆహారంలో పీచు పదార్ధాలు అధికంగా వుండేలా చూసుకోండి. దిని వలన రోజంతా మీరు శక్తివంతంగా ఉండగలుగుతారు. పీచు పదార్ధాలు తీసుకోకుండా వుంటే మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశముంది. నూనెలో వేయించిన ఆహార పదార్ధాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.
4. కొవ్వు చేరని ఆహార పదార్ధాలు తీసుకోండి. 100 గ్రాముల పాల ఉత్పత్తులలో మూడు గ్రాముల కొవ్వు ఉంటుంది. అందువల్ల కొవ్వు తక్కువ ఉన్న పాల పదార్ధాలతో పాటు స్కిన్ లేని చికెన్ లాంటివి తీసుకుంటే మంచిది.
5. మాంసాహారులయితే, వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు చేపలు తీసుకోండి. శాకాహారులు చిరుధాన్యాలు అధికంగా తీసుకోవచ్చు. దీనికి మించిన పోషకాహారం మరోటి లేదని కూడా చెప్పవచ్చు.
6. మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు, చక్కెర అతి తక్కువగా ఉండేలా చూడండి. సోడియం రోజుకు 2,300 మిల్లీగ్రాములు అంటే ఒక టీ స్పూన్ కు మించకుండా వుండేలా జాగ్రత్త పడండి. ఉప్పు అధికంగా వుండే పదార్ధాలు తినకపోవడం మంచిది.
7. అన్నిటిని మించి ప్రతి దినం ఒక గంట పాటు శారీరక వ్యాయామం చేయాలి.
పైన తెలిపిన పనులన్నీ చేయడం ద్వారా ఏ వయసు వారైనా సరే, రోజంతా చురుగ్గా ఉండటమే కాక నాజూకుగా, ఆరోగ్యంగా తిరుగుతూ అందరిని ఆశ్చర్య పరచవచ్చు.

English summary

Seven Principles of Happy Living | ఆహ్లాదకర జీవితానికి ఏడు సూత్రాలు

Food occupies major role in our health. Choose balance food with fruits, vegetables, pulses, etc. One should also daily exercise for an hour to have physical fitness. Both the food and the exercise to the body will make you a happy man through out the day.
Story first published:Wednesday, August 10, 2011, 15:40 [IST]
Desktop Bottom Promotion