Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
మహిళల బరువును తగ్గించే 10 సీక్రెట్ ఫుడ్స్...
మనం చేయవలసిన ముఖ్యమైన పనుల్లో ప్రధానమైనది బరువు తగ్గడం. కొంత బరువు పెరిగినా కూడా ఏ జిమ్ కో వెళ్ళి బరువు తగ్గించుకోవాలనుకొంటారు. ఈ వింటర్ సీజన్ లో పెద్దగా సెలబ్రేట్ చేసుకొనే క్రిస్మస్ మరియు న్యూఇయలర్ పార్టీలు మిమ్మల్ని ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటాయి. దాని తర్వాత సంక్రాంతి పండుగ తెలుగు వారికి అతి పెద్ద పండుగ. మరి క్రిస్మస్ ఇచ్చే క్రిస్మస్ కేకులు, న్యూయిర్ కేకులు, సంక్రాంతి పండుగా రోజున చేసే పిండి వంటలు, నాన్ వెజ్ రుచులు, ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ మీ అందమైన ఆకృతిని హరించేసి మిమ్మల్ని కాస్త బొద్దుగా మార్చేయవచ్చు.

అందుకోసం ఈ వింటర్ లో బరువు పెరగకుండా ఉండాలంటే ముఖ్యంగా పండుగల సమయ్యంలో మీరు గమనించాల్సింది. గుర్తుంచుకోవాల్సిందేంటంటే మీరు కరెక్ట్ ఫుడ్ తీసుకుంటున్నారా లేదా అన్నది. అయితే ఇది మనం ఖచ్చితంగా కనుక్కోలేం ఎందుకంటే మన బందువుల ఇల్లకు, ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళినప్పుడు అది సాద్యం కాదు. దాంతో వారు మీకు ఇచ్చే విందులో హై క్యాలరీ కలిగిన ఆహారాలను తిని మీ బరువును అమాంతంగా పెంచుకోక తప్పదు. అటువంటప్పుడు మీరు తప్పనిసరిగా మీరు తీసుకొనే ఆహారంలో బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ ఫుడ్ ను రెండింటినీ తీసుకోవాలి. అంటే ఫ్యాట్ కరిగించే ఆహారాలు కూడా మీ డైయట్ లో ఉండేలా చూసుకోవాలి.
కొన్ని పదార్థాలు, ఫ్యాట్ కరిగిస్తాయి. అవి ముఖ్యంగా మహిళలకు చాలా ఉపయోగపడుతాయి. పురుషులతో పోల్చితే మహిళలకు న్యూట్రిషినల్ సప్లిమెంట్స్ చాలా అవసరం. ఫ్యాట్ బర్నింగ్ ఆహారాల్లో విటమిన్స్ మరియు న్యూట్రిషియన్స్ అధికంగా ఉండటం వల్ల అవి బరువు తగ్గించడానికి, మహిళలను ఆరోగ్యంగా ఉంచడాని బాగా ఉపయోగపడుతాయి. ఉదాహరణకు రాస్ బెర్రీస్, ఆకుకూరలు, సిట్రస్ పండ్లు మరియు ధాన్యాలు ఇవన్నీ లోక్యాలరీ ఫుడ్స్. ఇవన్నీ కూడా కొవ్వు కరిగించడానికి బాగా సహాయపడుతాయి. అయితే ఈ ఆహారాలను పురుషులు కూడా తినవచ్చు. మహిళలకు, పురుషులకు ఇద్దరికీ వీటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి.
ఈ ఫ్యాట్ బర్నీంగ్ ఫుడ్స్ తో పాటు కొన్ని రెగ్యులర్ వ్యాయామాలను చేయడం వల్ల మీ హెల్తీ లైఫ్ స్టైల్ ను పొందవచ్చు. మరి మహిళలకు ఉపయోగపడే ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందామా...

సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లు అంటే ద్రాక్ష, ఆరెంజ్, బత్తాయి వంటివి వీటిలో ఎక్కుగా విటమిన్ సి. శరీరంలోని జీర్ణక్రియ బాగా పనిచేయాలంటే సిట్రస్ పండ్లు తీసుకోవడం తప్పనిసరి. సి విటమిన్ కొవ్వును కరిగించడమే కాకుండా, బాడ్ కొలెస్ట్రాల్ లెవల్ ను తగ్గిస్తుంది. మరో అద్భుతమైన ఉపయోగం క్యాన్సర్ కు దారితీసే లిమినాయిడ్స్ మరియు లైకోపినె పై దాడి చేస్తాయి.

ఆకుకూరలు: ఆకు కూరలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాల్సినటువంటి హెల్తీ ఫుడ్. ముఖ్యంగా మహిళల డైయట్ లిస్ట్ లో గ్రీన్ లీఫ్స్ కు, గ్రీన్ వెజిటేబుల్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. బ్రొకోలి, ఆస్పరాగస్ వంటి వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉండి లో కాలరీలను కలిగి ఉంటుంది. ఇది బాడీ ఫ్యాట్ ను తగ్గిస్తుంది.

గోధుమలు: మహిళల డైయట్ లిస్ట్ లో తప్పనిసరిగా ఉండాల్సినవి గోధుమలు. ఎందుకంటే వీటిలో ఎక్కుగా ఫైబర్, యాంటియాక్సిడెంట్స్ మరియు విటమిన్స్ కలిగి ఉంటాయి. ఈ ధాన్యాలు త్వరగా జీర్ణ అవ్వడానికి కూడా ఉపయోగపడుతాయి. లోక్యాలరీలను కలిగి న్యూట్రీషియన్స్ ను శరీరానికి అందిస్తుంది.

రెడ్ చిల్లి: స్పైస్ ఫుడ్ ఐటమ్స్ ఖచ్చితంగా బరువును తగ్గిస్తాయి. బాడీ ఫ్యాట్ ను తగ్గించానుకొంటే రెడ్ చిల్లి, బ్లాక్ పెప్పర్, చిల్లీ పెప్పర్ ఇటువంటి స్పైసీ ఫుడ్స్ కు ప్రాధాన్యతను ఇవ్వండి. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి బరువును తగ్గిస్తుంది.

రాస్ బెర్రీస్: బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేసే కీటన్స్ ఇందులో మెండుగా ఉన్నాయి. రాస్ బెర్రీస్ శరీరంలోని కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణ శక్తిని పెంచుతుంది.

నట్స్: నట్స్ లో ముఖ్యంగా బాదాం హెల్తీ స్నాక్. బాదాంలో ఎక్కువగా ఫైబర్, న్యూట్రిషియన్స్ మరియు విటమిన్స్ ఉన్నాయి. కాబట్టి మీ ఆకలి నిరోధించి బాడీ ఫ్యాట్ ను కరిగించడానికి నట్స్ తరచూ తింటుండాలి.

ఆరెంజ్: ఇది అద్భుతమైన ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్. ఈ సీజన్ లో ఎక్కువగా దొరికే ఈ పండ్లతో మీ బరువును సాద్యమైనంత వరకూ తగ్గించుకోవండి. వీటిలో లోక్యాలరీస్ తో పాటు సిట్రస్ యాసిడ్స్ కొవ్వును కరిగించడానికి బాగా సహాపడుతాయి.

వేరుశెనక్కాయలు: ఈ చిన్న నట్స్, ఆకలిని తీర్చడంతో పాటు, బరువును తగ్గించి బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

బెర్రీస్: బెర్రీస్ ఎల్లప్పుడూ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ అనే చెప్పొచ్చు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ మరియు ఇతర బెర్రీ పండ్లన్నీ ఎక్కువ యాంటిఆక్సిడెంట్స్, ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించి స్వేచ్చా రాశులుగా పోరాడుతుంది.

లెమన్: నిమ్మ మరియు తేనె మిశ్రమం మహిళల బరువు తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. నిమ్మరసంలో కొవ్వు కణాలతో పోరాడగలిగే శక్తిని కలిగి ఉన్నాయి. ఆకలిని తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది.



Click it and Unblock the Notifications