For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆకలిని కంట్రోల్ చేసి,బరువు తగ్గించే 20 సూపర్ ఫుడ్స్

|

ప్రస్తుత రోజుల్లు అధిక బరువు, ఊబకాయంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మీరు ఒక్కరే కాదు, అనేమంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికీ సలహా ఏంటంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని మరియు చాలా తక్కువగా తీసుకోవాలి. మీ ఆకలి అణిచివేయడం అనంత సులభం కాదు. కాబట్టి, మీరు క్రమంగా ఒక ఆరోగ్యకరమైన విధంగా మీ ఆకలి తగ్గించాలి. బరువు తగ్గించుకోవడానికి చాలా మంది, భోజనం తినడం మానేస్తుంటి. భోజనం మానేయడం వల్ల శరీరానికి అవసరం అయ్యే పోషకాంశాలు మరియు మినిరల్స్ లోపించి అనేక ఆరోగ్య సమస్యలకు ముక్యంగా కడుపుకు సంబంధించన సమస్యలకు దారితీస్తుంది.

మీరు బరువు తగ్గించుకోడానికి మీ ఆకలిని అణిచివేసేందుకు మరియు ఆకలి తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఇది ఒకటి లేదా రెండు రోజుల్లో జరిగేపనికాదు. అందుకు మీరు కొన్ని ఆహారాలు తీసుకొని మరియు మీ ఆకలి తగ్గించడానికి, కొన్ని ఆహారాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. అధిక బరువు ఉన్నవారు, బరువు తగ్గించుకోవాలనుకుంటున్నవారికి ఇది ఒక అవసరమైన బరువు తగ్గించే చిట్కా.

ఎప్పుడైతే మీరు ఆకలి తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారో, అప్పుడు మీలో కొంత ఓపిక మరియు వ్యక్తిగత నియంత్రణ కలిగి ఉండాలి. కడుపు సులభంగా మారుతుంది మరియు మీకు ఆకలి కలుగుతుంది. ఇలా కొన్ని రోజులు క్రమం తప్పకుండా చేయాలి. కాబట్టి వ్యక్తిగత నియంత్రణ వల్ల ఆకలి తగ్గించుకోవచ్చు. ఆకలిని తగ్గించేందుకు మరియు మీరు బరువు కోల్పోయేందుకు సహాయపడే అనేక రకాల ఆహారాలున్నాయి. ఉదాహరణకు, ఆపిల్స్, అవొకాడో, గ్రీన్ టీ, ఫ్లాక్స్ సీడ్స్, డార్క్ చాక్లెట్, కాఫీ, సలాడ్స్, బాదం, కాటేజ్ చీజ్, ఓట్ మీల్, మరియు మాసం మరియు మరికొన్ని ఇతర ఆహారాలు మీ ఆకలిని తగ్గించేందుకు సహాయపడుతాకి. మీరు బరువు తగ్గాలని కోరుకుంటున్నట్లైతే, ఈక్రింది స్లైడ్ లో ఇచ్చిన ఆహారాలను తిని ఆకలిని తగ్గించుకోండి. ఈ ఆహారాలు ఆరోగ్యకరమం మరియు లోక్యాలరీలను కలిగి ఉండి, బరువును తగ్గించేందుకు సహాయపడుతాయి.

1. అవొకాడో:

1. అవొకాడో:

ఈ పండులో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండి, ఆకలిని తగ్గించి, జీర్ణక్రియను నిధాన చేస్తుంది. ఇది కడుపు ఫుల్ గా ఉండే అనుభూతిని కలిగిస్తుంది.

2. ఓట్ మీల్:

2. ఓట్ మీల్:

ఆరోగ్య స్పృహ కలిగి ప్రజలకు ఓట్ మీల్ ఒక ఆరోగ్యకరమైన హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిపిపి. అందువల్లనే ఓట్ మీల్ పొట్టను ఫుల్ గా ఉండాలా చేస్తుంది మరియు దీర్ఘకాలం ఆకలి కాకుండా నియంత్రిస్తుంది. ఇందులో ఆకలి తగ్గించే ఫైబర్ వీటిని బీటా గ్లూకాన్స్ వంటివి పుష్కలంగా ఉండి తిన్న ఆహారం నిధానంగా జీర్ణం అయ్యేలా చూస్తుంది. దాంతో ఆకలి తగ్గుతుంది.

3. బాదం:

3. బాదం:

బాదంలో ఆరోగ్యకరమైనవి. ఎందుకంటే వీటిలో హెల్తీ ఫ్యాట్ కలిగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల, అనవసరపు బరువును తగ్గిచుకోవచ్చు. భోజనానికి అరగంట ముందు గుప్పెడు బాదంలను తింటే ఆకలిని నింయత్రించుకోవచ్చు.

4. కాఫీ:

4. కాఫీ:

ఆకలిని నియంత్రించే వాటిలో కెఫెన్ కూడా ఒకటి. మీరు బరువు తగ్గించుకోవాలంటే, మీ కాఫీలో పంచదారను వేసుకోకండి. మరియు రెండు కప్పుల కంటే ఎక్కువగా తీసుకోకండి. కాఫీ ఎక్కువగా త్రాగడం వల్ల శరీరంలో అత్యధిక శాతం నీటిని కోల్పోవల్సి వస్తుంది.

5. డార్క్ చాక్లెట్:

5. డార్క్ చాక్లెట్:

బిట్టర్ స్వీట్ ఫ్లేవర్ కలిగిన చాక్లెట్ ఆకలి తగ్గించే అద్భుత పదార్థంగా పనిచేస్తుంది. డార్క్ చాక్లెట్ తినడ వల్ల శరీరంలోనిఆకలిని తగ్గించే గార్లిన్ ను తగ్గిస్తుంది.

6. ఫ్లాక్ సీడ్స్:

6. ఫ్లాక్ సీడ్స్:

ప్లాక్స్ సీడ్స్ లో ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఫైబర్, పుష్కలంగా ఉన్నాయి. ఫ్లాక్స్ సీడ్స్ ఆకలి తగ్గిస్తుంది మరియు బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

7. కాటేజ్ చీజ్:

7. కాటేజ్ చీజ్:

ఇతర చీజ్ లతో పోల్చితే, కాటేజ్ చీజ్ లో చాలా తక్కువ ఫ్యాట్స్ కలిగి ఉంటుంది. అందువల్ల ఇది డైటర్స్ మరియు బాడీ బిల్డర్స్ కోసం ఒక హెల్తీ స్నాక్. కాటేజ్ చీజ్ లో ఉండే కేసిన్ ఆకలిని తగ్గించే ఒక అద్భుతమైన పదార్థం.

8. నీళ్ళు:

8. నీళ్ళు:

ఎక్కువగా నీళ్లు త్రాగడం వల్ల మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచడమే కాదు, మీ పొట్ట ఫుల్ గా ఉండే భావన కలిగిస్తుంది. మరియు బరువు తగ్గించేందుకు ఆకలి తగ్గిస్తుంది.

9. గ్రీక్ యోగట్ర్:

9. గ్రీక్ యోగట్ర్:

చిక్కగా, క్రీమ్ నిర్మాణంలో ఉండే క్రీక్ యోగ్రట్ మిమ్మల్నిపొట్ట ఫుల్ గా ఉన్న భావన కలిగిస్తుంది. దీన్ని ఒక హైప్రోటీన్ వెయిట్ లాస్ ఆప్టిటైట్ బూస్టర్ గా భావిస్తారు.

10. స్వీట్స్:

10. స్వీట్స్:

స్వీట్స్ ను తినడం కూడా ఒక రంగా ఆకలి తగ్గించుకోవచ్చు. మీ భోజనానికి అరగంట ముందు ఒక చిన్నస్వీట్ ముక్కను తినండి.

11. సూప్:

11. సూప్:

ఆకలి ఎక్కువగా ఉన్నవారు, ఎక్కువ ఆహారాన్ని తినడాన్ని తగ్గించాలి. అటువంటప్పుడు మీ ఆకలిని తగ్గించే ఒక గ్రేట్ ఫుడ్ సూప్స్, బోజనానికి అరగంట ముందు సూపులను తీసుకోవాలి.

12. లెగ్యూమ్స్:

12. లెగ్యూమ్స్:

లెగ్యూమ్స్ అంటే బీన్స్, పీస్, లెంటిల్స్ మరియు చిక్ పీస్ వంటి వాటిలో ఫైబర్ మరియు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండి, తిన్న ఆహారం నిధానంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. దాంతో ఆకలి అనిపించదు.

13. సలాడ్స్:

13. సలాడ్స్:

ఆరోగ్యకరమైన సలాడ్స్ లో న్యూట్రీషియన్స్ మరియు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒక ఆరోగ్యకరమైన వెజిటేబుల్ మరియు ఫ్రూట్ సలాడ్స్ ను తినడం వల్ల మీ ఆకలిని తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యంగా జీవించవచ్చు.

14. మాంసం:

14. మాంసం:

లీన్ మాసం తీసుకోవడం వల్ల ఆకలిని తగ్గించుకొనే ఆక ఆశ్చర్యకరమైన ఆహారపదార్థం. హైప్రోటీన్ మరియు ఫ్యాట్ కలిగిన మాంసాహారం జీర్ణం అవ్వడానికి కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి మీ రెగ్యులర్ ఆహారంలో లీన్ మాంసం, లోఫ్యాట్ కలిగిన మాంసం చేర్చుకోండి.

15. పైన్ నట్స్:

15. పైన్ నట్స్:

పైన్ నట్స్ లో ఉన్న పినోలినిక్ యాసిడ్, పాలీఅన్ సాచురేటెడ్ ఫ్యాట్ ఆకలిని తగ్గిస్తాయి. మీరు బరువు తగ్గించుకోవాలన్నా, మీ కండరాలను స్ట్రాంగ్ ఉండాలన్నా మీ డైట్ లో పైన్ నట్స్ ను చేర్చుకోండి.

 16. గ్రీన్ టీ:

16. గ్రీన్ టీ:

గ్రీన్ టీ బరువు తగ్గించడం మాత్రమే కాదు, ఆకలిని నియంత్రించే ఒక గొప్ప ఔషధపానియం కూడా. గ్రీన్ టీ పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మిమ్మల్ని ఫిట్ గా మరియు హెల్తీగా ఉండేందుకు సహాయపడుతుంది.

17. ఆపిల్స్:

17. ఆపిల్స్:

రోజుకు ఒక్క ఆపిల్ తినడం వల్ల అనేక జబ్బును మీ ధరిచేరనివ్వదు. అలాగే డాక్టర్ అవసరం మీకు ఉండదు. ఆపిల్స్ మీ ఆకలిని నియంత్రిస్తుంది.

18. గుడ్లు:

18. గుడ్లు:

గుడ్లలో లీన్ ప్రోటీన్స్ కలిగి ఉంటాయి. అందువల్ల తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి, ఉడికించిన గుడ్లు తిని ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించండి మరియు ఆకలి తగ్గించుకోండి.

19. లస్సీ:

19. లస్సీ:

లస్సీ స్వీట్ అండ్ హెల్తీ ఆహారంపదార్థం. ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తుంది. మీ భోజనానికి అరగంట ముందుగా ఒక గ్లాసు లస్సీని తీసుకొని, మీ ఆకలిని నియంత్రించుకోండి.

20. పఫ్డ్ సెరల్స్(బొరుగులు/మరమరాలు):

20. పఫ్డ్ సెరల్స్(బొరుగులు/మరమరాలు):

పఫ్డ్ సెరెల్స్ లైక్ పాప్ కార్న్, బొరుగులు, చిరుధాన్యాలు వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మీ పొట్ట పుల్ గా ఉండేలా చేస్తాయి. చాలా తక్కువగా తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు.

English summary

20 Foods To Decrease Appetite

If you are one of the many people who is struggling hard to shed those extra pounds, then you are not the only one. Everyone suggests to focus on a healthy diet and eat less. Well, it is not easy to suppress your appetite.
Desktop Bottom Promotion