For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా బరువు తగ్గడానికి సహాయపడే 10 ఆహారాలు

|

బరువు పెరుగడం కంటే బరువు తగ్గడం కూడా సులభమంటారు, అది కొన్ని విధాలు నిరూపించబడ్డాయి కూడా, త్వరగా బరువు తగ్గడానికి మీరు ఆరోగ్యకరమైన మరియు మంచి ఆహారాలను తీసుకోవల్సి ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, మీ చుట్టూ ఉన్న, మీరు ప్రతి రోజూ చూస్తున్న ఆహారాలే మీ బరువును చాలా సులభంగా తగ్గిస్తాయి!ఇవి ఎప్పటికీ మిమ్మల్ని బరువు పెరగనియ్యవు. అటువంటి ఆహారాలను కొన్నింటిని ఈ క్రింది విధంగా లిస్ట్ తయారుచేయడం జరిగింది. ఇవి చాలా త్వరగా మరియు తేలికగా బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

ప్రోటీనులు, లీన్ కార్బోహైడ్రేట్స్ మరియు న్యూట్రీషియన్స్ కలిగినటువంటి అటువంటి ఆహారాలను మీ డైలీ డైట్ లో చేర్చుకుంటే మీరు మంచి ఆరోగ్యకరమైన పద్దతిలో బరువు తగ్గుతారు. త్వరగా మిమ్మల్ని నాజూగ్గా మార్చే అటువంటి ఆహారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిలో ఎక్కువ ప్రోటీనులు మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండి, మీలో వ్యాధినిరోధకతను పెంచుతాయి...

టమోటో

టమోటో

చెర్రీ టమోటోలు తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. ఇవి చాలా త్వరగా బరువు తగ్గించడానికి సహాయపడుతాయి.

గ్రేప్ ఫ్రూట్

గ్రేప్ ఫ్రూట్

సిట్రస్ ఫ్రూట్ అయినటువంటి గ్రేప్ ఫ్రూట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల, వేసవిలో ఇది శరీరాన్ని కూల్ గా ఉంచతుంది. గ్రేప్ ఫ్రూట్ లో 120క్యాలరీలున్నాయి కాబట్టి, ఆకలిగా ఉన్నప్పుడు ఇటువంటి ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం. గ్రేఫ్ ఫ్రూట్ లో ఫ్యాట్ బర్నింగ్ ఎంజైమ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతాయి .

గుడ్డు

గుడ్డు

గుడ్డులోని తెల్లని పదార్థం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు బరువు తగ్గించే ప్లాన్ లో ఉన్నట్లైతే గుడ్డును మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. గుడ్డును ఉడికించి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు తీసుకోవడం మంచిది.

కీరదోసకాయ

కీరదోసకాయ

ఈ రాఫుడ్ ను దాదాపు అన్ని సలాడ్లులో కనబడుతుంది. బరువు తగ్గించే ప్లాన్ లో ఉన్నప్పుడు, ఈ కీరదోసను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఒక ఉత్తమ పరిష్కార మార్గం. ఇందులో అధిక మొత్తంలో నీరు కలిగి ఉండి, మీ కడుపు నింపడానికి సహాయపడుతుంది. డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గవచ్చు.

సాస్

సాస్

మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే, మీ ఆహారాల్లో స్వీట్స్ కంటే హాట్ సాస్ ను చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడానికి ఇవి గొప్పగా సహాయపడుతాయి . త్వరగా బరువుతగ్గాలనుకొనే వారు చిల్లీ సాస్ ను ప్రాధాన్యత ఇవ్వండి.

ప్రాన్స్

ప్రాన్స్

ష్రింప్/ప్రాన్స్ వీటిలో 8 కాలరీలను మాత్రమే కలిగి ఉంటుంది. త్వరగా బరువు తగ్గాలనుకొనే వారు రొయ్యలకు ప్రాధాన్యత ఇచ్చి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

చెర్రీస్

చెర్రీస్

చెర్రీస్ లో అధికంగా విటమిన్స్ మరియు లోప్రోటీన్స్ కలిగి ఉంటాయి. చెర్రీస్ ను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలోని పొటాషియం లెవల్స్ ను తగ్గించేదుకు సహాయపడుతుంది. అంతే కాదు, చాలా త్వరగా బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది . బరువుతగ్గడానికి సహాయపడేందుకు అవసరం అయ్యే క్యాలరీలను ఇది కలిగి ఉంటుంది.

బ్రొకోలీ

బ్రొకోలీ

గ్రీన్ వెజిటేబుల్స్ లో ఇది ఒక బెస్ట్ వెజిటేబుల్. ఉడికించిన బ్రొకోలీని ఒక కప్పు తీసుకోవడం వల్ల మంచిది. బరువు తగ్గాలనుకొనే వారు ఈ హెల్తీ గ్రీన్ వెజిటేబుల్ ను డైలీ డైట్ చేర్చుకోవాలి. 95కాలరీలున్న ఈ గ్రీన్ వెజిటేబుల్ రెగ్యులర్ గా తీసుకుంటే అతి త్వరగా బరువు తగ్గవచ్చు.

క్యాబేజీ

క్యాబేజీ

చాలా వేగంగా బరువు తగ్గించే వెయిట్ లాస్ ఫుడ్స్ లో క్యాబేజ్ ఒక ఉత్తమ ఆహారం. క్యాబేజ్ లో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి అధికంగా ఉంటుంది మరియు ఇది శరీరానికి ఒక గొప్ప వ్యాధి నిరోధకతను అధించే బూస్టర్ ఫుడ్. త్వరగా బరువు తగ్గడానికి ఒక ఉత్తమ ఆహారం.

రాస్బెర్రీస్

రాస్బెర్రీస్

బెర్రీస్ లో వివిధ రకాలున్నాయి. వాటిలో ఎక్కువగా ఎంపిక చేసుకొనేది రాస్బెర్రీస్. వీటిలో అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. రాస్బెర్రీస్ లో 72క్యాలరీలు మాత్రమే కలిగి ఉన్నాయి. ఇవి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతాయి. వీటిని మీ 100కాలరీ డైట్ చార్ట్ లో చేర్చుకోవడం వల్ల అదనపు పౌండ్ల బరువు తగ్గించుకోవచ్చు.

English summary

10 Foods That Make You Thin Fast

Losing weight is just as easy as putting on weight, provided you have the willpower to do so. To lose weight fast, you need to have a smart and healthy diet. According to experts, there are a number of foods which you can close your eyes and binge on and guess what! It never lets you put on weight! Boldsky shares with you list of such foods that not only make you thin but help you lose weight quickly.
Story first published: Saturday, May 3, 2014, 17:12 [IST]
Desktop Bottom Promotion