For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యాట్ బర్న్ చేసే టాప్ 10 సూపర్ ఫుడ్స్

|

మీరు బరువు తగ్గించుకొని, ప్రస్తుతం ఉన్న బాడీ వెయిట్ ను మెయింటైన్ చేయాలంటే, మీ ప్లాన్ ఖచ్చితంగా సెన్సిబుల్ డైట్ గా ఉండాలి. తరచూ మీ డైట్ ను మార్చడం చాలా కష్టంగా మరియు ఫ్రస్టేటింగ్ గా ఉంటుంది. ఇలా డైట్ విషయంలో తరచూ మార్పులు చేస్తుంటే, మీరు మీ డైట్ లో కొన్ని ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ను చేర్చుతారు.

చాలా వరకూ ఆహారాలు బరువు తగ్గించడంలో మరియు ముఖ్యంగా క్యాలరీలను తగ్గించడంలో బాగా సహాయపడుతాయి. కొన్ని ఆహారాలు, జీవక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే మీ ఆహారంలో మీరు తీసుకొని పదార్థాలు రుచిని కలిగిస్తాయి, మీ శరీరం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది, మీరు ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉన్న బావనను మీలో కలిగిస్తుంది. మరియు బరువు తగ్గించేందుకు సహాయపడే కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.

టాప్ 20 ఆహారాలతో కొవ్వు కరిగించు..పొట్టతగ్గించు: క్లిక్ చేయండి

మీ డైట్ లిస్ట్ లో ఈ ఆహారాలను చేర్చుకోవడం ద్వారా, వీటితో పాటు మీ రెగ్యులర్ వ్యాయామాలు చేయడం ద్వారా మీ ఫిట్ నెస్ గోల్స్ ను మీరు చేరుకోగలరు ఇక్కడ టాప్ 10 ఫ్యాట్ బర్నింగ్ సూపర్ ఫుడ్స్ ఉన్నాయి..

పురుషుల చిరుబొజ్జను కరిగించే ఫ్యాట్ బర్నిగ్ ఫుండ్స్.:క్లిక్ చేయండి

లోఫ్యాట్ పెరుగు:

లోఫ్యాట్ పెరుగు:

లోఫ్యాట్ పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని కంట్రోల్ చేస్తుంది మరియు ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేస్తుంది. మరియు పెరుగులో అధిక శాతంలో ప్రోటీనులు మరియు విటమిన్ డి పుష్కలంగా ఉంది.ఇది మీశరీరానికి నిరంతరం ప్రసరిస్తుంటుంది. కాబట్టి లోఫ్యాట్ పెరుగుతో పాటు, లోఫ్యాట్ మిల్క్, చీజ్ వంటి వాటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.

 గ్రేఫ్ ఫ్రూట్:

గ్రేఫ్ ఫ్రూట్:

గ్రేఫ్ ఫ్రూట్ మరో ఫ్యాట్ బర్నింగ్ సూపర్ ఫుడ్స్. ఈ పండ్లలో అధికంగా ఫైబర్ కలిగి ఉంది మరియు తక్కువ క్యాలరీలను కలిగి ఉంది. నిజానికి ఒది ఒక వ్యతిరేక క్యాలరీలు కలిగి ఫుడ్ గా బాగా ప్రాచుర్యం పొందింది. అంటే వీటిని మీరు తీసుకోవడం వల్ల శరీరంలో కొన్ని పౌండ్లలలో కాలరీలను బర్న్ చేస్తుంది. మరియు గ్రేఫ్ ఫ్రూట్ ఇన్సులిన్ తగ్గించి, బ్లడ్ షుగర్ ను క్రమబద్దం చేస్తుంది మరియు జీవక్రియలు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. మీరు బరువు చాలా త్వరగా తగ్గాలనుకుంటే, మీరు తాజాగా ఉండే గ్రేఫ్ ఫ్రూట్ను తీసుకోండి .

కేయాన్ పెప్పర్:

కేయాన్ పెప్పర్:

కేయాన్ పెప్పర్ తీసుకోవడం ద్వారా ఫ్యాట్ మరియు క్యాలరీలను బర్న్ చేస్తూ మీ జీవక్రియలను వేగవంతం చేస్తుంది . కేయాన్ పెప్పర్ లో ఉండే క్యాప్ససిన్ కంటెంట్ శరీరంలో వేడిని పెంచి క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి, కేయాన్ పెప్పర్ ను మీరు అలాగే పచ్చిగా మరియు ఉడికించి , లేదా అలాగే డ్రై తీసుకోవచ్చు.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీ చల్లని లేదా వేడి ఏదైనా సరే మీరు బరువు తగ్గడానికి ఉపయోగపడే వాటిలో ఒక టాప్ బెవరేజ్. ఇది చాలా ఆరోగ్యకరమైన బెవరేజ్ ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఇది బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది మరియు శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది. అలాగే మరో ప్రయోజనం హార్ట్ రేటు పెంచుతుంది. మీ గుండె కొట్టుకోవడం పెంచుతుంది, దాంతో మరిన్ని క్యాలరీలను మీరు కరిగించుకోవచ్చు.

నట్స్:

నట్స్:

నట్స్ వాల్ నట్స్, మరియు బాదం వంటి వాటిలో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఆల్ఫాలినోలిక్ యాసిడ్ మరియు మోనో సాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటాయి. ఈ మోనో సాచురేటెడ్ ఫ్యాట్ కొవ్వును కరిగించి మెటబాలిజం రేటును పెంచుతుంది. మరియు ఇది కండరాలను బలోపేతం చేస్తుంది మరియు ఆకలి తగ్గిస్తుంది . గుప్పెడు నట్స్ ను నీటిలో నానబెట్టి, స్కిన్ తొలగించి తినడం వల్ల బరువు తగ్గిస్తుంది.

సోయా బీన్:

సోయా బీన్:

శరీరానికి శక్తినిచ్చే, ఆరోగ్యకరమైన ఆహారాలు కావాలి. బాగా జీర్ణం అయ్యే మరియు ప్రోటీన్స్ కలిగిన ఆహారాలను తీసుకోవాలి. మీ జీర్ణక్రియ చాలా హార్డ్ గా పనిచేస్తూ ప్రోటీనులను విడుదల చేసే ఆహారాలను తీసుకోవాలి. ఇది కొన్ని క్యాలరీలను బర్న్ చేస్తుంది, దాంతో సులభంగా బరుతు తగ్గించుకోవచ్చు. అందుకు అధిక ప్రోటీనులున్న సోయా బీన్స్ వంటి ఆహారాలు తీసుకోవాలి . బెస్ట్ సోయా ప్రోటీన్ ఫుడ్, సోయా బీన్, సోయాబీన్ లో ఆరోగ్యకరమైన అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉన్నాయి. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

బ్రౌన్ రైస్ :

బ్రౌన్ రైస్ :

రెగ్యులర్ గా తీసుకొనే వైట్ రైస్ కు చెక్ పెట్టి, బ్రౌన్ రైస్ తీసుకోవడానికి అలవాటు పడితే , వెంటనే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ ఒక హోల్ గ్రెయిన్ ఫుడ్: ఇందులో విటమిన్ బి, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఐరన్ మరియు ఫైబర్లు ఫుష్కలంగా ఉన్నాయి. ఇది బౌల్ ను రెగ్యులేట్ చేస్తుంది తర్వాత, ఆకలిని నియంత్రిస్తుంది. జీవక్రియలను మెరుగుపరుస్తుంది.

సాల్మన్:

సాల్మన్:

సాల్మన్ వంటి చేపలను తినడం వల్ల మీ శరీరంలోని లెప్టిన్ లెవల్స్ తగ్గించుకోవడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఎవరైతే తక్కువ లెప్టిన్స్ ను కలిగి ఉంటారో, వారు వేగవంతమైన జీవక్రియల రేటు కలిగి ఉండి, బరువు తగ్గించుకోవడానికి సమాయపడుతుంది. లెప్టిన్ అనేది హార్మోను. ఇది శక్తిని అందివ్వడంలో మరియు జీర్ణక్రియలను మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

ఆపిల్స్:

ఆపిల్స్:

ఆపిల్ గ్రేట్ ఫ్యాట్ బర్నింగ్ ఫ్రూట్. ఇందులో అధికంగా కరిగే ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలాగే అత్యధికంగా యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండి చాలా తేలికగా జీర్ణం అవ్వడానికి సహాకరిస్తుంది. మరియు ఇందులో ఉండే పెక్టిన్, ఫ్యాట్ తో పాటు నీటి శాతం కూడా శోషణ చెందాలా చేస్తుంది . ప్రతి రోజూ ఆపిల్స్ తినడం వల్ల ఫ్యాట్ సెల్స్ ను తగ్గిస్తుంది. మరియు మీ పూర్తి శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఓట్ మీల్:

ఓట్ మీల్:

ఓట్ మీల్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల మీ బరువు తగ్గించడంలో మార్పులను మీరు గమనించవచ్చు. ఓట్ మీల్ ల్లో లో డైజెస్టిగ్ కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటాయి. ఇది బ్లడ్ షుగర్ మరియు ఇన్సులిన్ స్థాయిలను స్థిరంగా ఉంచి, కొవ్వును కరిగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే ఇందులో సోలబుల్ ఫైబర్ కలిగి ఉండి, ఇది కొవ్వు కరిగించడానికి సహాయపడుతుంది. ఎక్కువ సమయం ఆకలి కాకుండా సహాయపడుతుంది. ఇది బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది.

Story first published: Wednesday, January 29, 2014, 16:40 [IST]
Desktop Bottom Promotion