For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెల్లీ ఫ్యాట్ కరిగించే ఈజీ రెమిడీస్

By Nutheti
|

పొట్ట చుట్టూ ఉండే కొవ్వు ఎక్కువైతే.. నడుము భాగం పెరుగుతుంది. చూడటానికి లావుగా అందవిహీనంగా కనిపిస్తారు. ఆకట్టుకునే ఆకృతి కోల్పోతారు. చూడగానే అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. దీంతో నలుగురిలోకి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఫీలవ్వాల్సి వస్తుంది. దీనికి హార్మోనల్ ఇమ్ బ్యాలెన్స్, శారీరక శ్రమ లేకపోవడం కారణంగా బెల్లీ ఫ్యాట్ సమస్య మొదలవుతోంది.

READ MORE: బాన పొట్టను తగ్గించే 20 సూపర్ ఫుడ్స్...!

బెల్లీ ఫ్యాట్ వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. హైపర్ టెన్షన్, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు, డెమెంటియా వంటి అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. బెల్లీ ఫ్యాట్ కారణంగా టైప్ టు డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం అంత ఈజీ కాదు. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం ఫ్యాషన్ మాత్రమే కాదు.. ఇది మెరుగైన ఆరోగ్యానికి కూడా చాలా అవసరం.

బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి కేవలం జిమ్ లో గంటల తరబడి గడిపితే సరిపోదు. సరైన డైట్ ఫాలో అవడం చాలా అవసరం. జిమ్ లో ఎంతకష్టపడినా.. ప్రణాళిక ప్రకారం ఆహారం తీసుకోకపోతే ప్రతిఫలం ఉండదు. కాబట్టి ఎలాంటి ఆహార పదార్థాలు రోజు వారి డైట్ లో చేర్చుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చో చూద్దాం...

లెమన్

లెమన్

ఒక గ్లాసు లెమన్ వాటర్ మీ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి చాలా సహకరిస్తుంది. అయితే ఇక్కడో టిప్ ఫాలో అవ్వాలి. ఒక గ్లాసు నీళ్లలోకి ఒక నిమ్మకాయ రసం పిండాలి. దాన్ని ఉదయాన్నే పరగడపున తాగితే మంచి ఫలితం ఉంటుంది.

క్రాన్ బెర్రీ జ్యూస్

క్రాన్ బెర్రీ జ్యూస్

క్రాన్ బెర్రీ జ్యూస్ రెండు టేబుల్ స్పూన్లు తీసుకుని ఒక క్లాస్ వాటర్ లో మిక్స్ చేయాలి. ఈ జ్యూస్ ని భోజనానికి ముందు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

తెల్ల నువ్వుల నూనె

తెల్ల నువ్వుల నూనె

నువ్వుల నూనె ఒక టీ స్పూన్, అల్లం జ్యూస్ 1 టీ స్పూన్, గోరువెచ్చని నీళ్లు ఒక కప్పు తీసుకుని వీటిని బాగా కలపాలి. ఈ జ్యూస్ ని రెండుసార్లు తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది.

అవిసె గింజలు

అవిసె గింజలు

అవిసె గింజలు పొడి ఒక స్పూన్, తేనె ఒక స్పూన్, గోరువెచ్చని నీళ్లు ఒక కప్పు తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు తాగితే.. బెల్లీ ఫ్యాట్ చాలా తక్కువ సమయంలో తగ్గిపోతుంది.

పార్ల్పీ లీవ్స్

పార్ల్పీ లీవ్స్

పార్ల్సీ లీవ్స్ నుంచి జ్యూస్ తీయాలి. దీనికి ఒక నిమ్మకాయ రసం, అరకప్పు నీళ్లు కలపాలి. దీన్ని ఐదు రోజులపాటు వరుసగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. మళ్లీ కంటిన్యూ చేయాలనిపిస్తే.. ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఐదు రోజులు తాగాలి.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

గ్రీన్ టీ 1 టేబుల్ స్పూన్, లెమన్ 1/4 స్పూన్, హనీ 2 స్పూన్లు, ఒక గ్లాసు నీళ్లు. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి 3 నిమిషాల పాటు కలపాలి. ఈ జ్యూస్ ని రోజుకి రెండుసార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

తేనె

తేనె

తేనె రెండు టేబుల్ స్పూన్లు, గోరువెచ్చని నీళ్లు ఒక గ్లాసు తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగితే బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.

English summary

Quick Ways To burn Belly Fat in telugu

Belly fat is the cause of embarrassment for a number of people around the globe. It is the stubborn fat around the abdomen which is very easily visible whenever you wear tight-fitted clothes.
Story first published: Saturday, October 31, 2015, 16:51 [IST]
Desktop Bottom Promotion