For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకే ఒక నెలలో మీచేతులు సన్నబడేలా చేసే ఫుడ్ హ్యాబిట్స్..!

|

సహజంగా బాడీ సన్నగా ఉన్నంత వరకూ ఎలాంటి సమస్యలుండవు. అదే బాడీ కాస్తా బొద్దుగా తయారైతే మాత్రం, చూడటానికి అసహ్యంగా ఉంటుంది. నలుగురిలో చాలా ఇబ్బందిగా ఉండటమే కాదు, నచ్చిన డ్రెస్సులో అందంగా వేసుకోలేరు. కాబట్టి, వెంటనే చేతులను నాజూగ్గా మార్చుకోకపోతే కష్టమే. భుజాల దగ్గర నుండి మోచేతుల వరకూ ఫ్యాట్ ఎక్కువగా చేచడం వల్ల చేతులు లావుగా అందవిహీనంగా కనబడుతాయి. చేతులు , అండర్ ఆర్మ్ వద్ద కొవ్వు ఎక్కువ చేరడం వల్ల స్లీవ్ లెస్ టాప్ లు, అందమైన డ్రెస్సులను ధరించలేరు. మోచేతుల పైన కొవ్వు ఎక్కువగా చేరి, వేలాడుతూ కనిపించే స్కిన్, చేతుల అందాన్ని పాడుచేస్తుంది.

అందవల్ల మీరు చేతుల దగ్గర కొవ్వును కరిగించుకోవాలంటే కొన్ని ఉత్తమ మార్గాలున్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. కొన్ని ఆహారపు అలవాట్లు అనుసరించడం వల్ల ఒక నెలలో అండర్ ఆర్మ్ లో కొవ్వు కరిగించడానికి కొన్ని ఆహారాలు సహాయపడుతాయి.

చేతుల్లో కొవ్వు పెరుగుతున్నట్లు గమనించిన వెంటనే చేయాల్సిన పని, వ్యాయామం. రెగ్యులర్ వ్యాయామాలు చేయడం వల్ల కొంత కొవ్వును కరిగించుకోవచ్చు. అదే విధంగా మనం రెగ్యులర్ గా తినే ఆహారాలతో మరికొంత కొవ్వును ఎఫెక్టివ్ గా కరిగించుకోవచ్చు. కాబట్టి వ్యాయామం ఒక్కటే సరిపోదు, రెగ్యులర్ డైట్ లో ఎక్సెస్ క్యాలరీ, ఫ్యాట్ చేరకుండా జాగ్రత్త పడాలి. రెగ్యులర్ గా వ్యాయామంతో పాటు బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం ఒక ఉత్తమ మార్గం . ఒక నెలలో అండర్ ఆర్మ్ ఫ్యాట్ కరిగించుకోవడానికి కొన్ని సర్ ప్రైజింగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

1. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ను తినడం నివారించుకోవాలి :

1. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ను తినడం నివారించుకోవాలి :

హై టెంపరేచర్ లో డీఫ్ ఫ్రై చేసిన ఆహారాల్లో అక్రిలిమైడ్స్ అధికంగా ఉంటాయి. దీన్ని కార్సినోజెన్ అని పిలుస్తారు. ఇది శరీరంలో ఎక్కువ ఫ్యాట్ చేరడానికి కారణమవుతుంది. దాంతో హార్ట్ డిసీజ్, కొలెస్ట్రాల్, ఓబేసిటి, మరియు క్యాన్సర్ రిస్క్ లను పెంచుతాయి .

2. వెజిటేబుల్స్ ను ఎక్కువగా చేర్చుకోవాలి :

2. వెజిటేబుల్స్ ను ఎక్కువగా చేర్చుకోవాలి :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు, బ్రొకోలి వంటి వాటిలో విటమిన్స్ ఎక్కువ , క్యాలరీలు తక్కువ. ఇది శరీరంలో ఫ్యాట్ చేరకుండా నివారిస్తుంది. అండర్ ఆర్మ్ లో కూడా ఫ్యాట్ చేరదు. కొవ్వు చేరకుండా నివారించడానికి డైలీ డైట్ లో వెజిటేబుల్స్ చేర్చుకోవడం ఒక నేచురల్ మార్గం.

3. ప్రొసెస్ ఫుడ్స్ ను నివారించుకోవడం :

3. ప్రొసెస్ ఫుడ్స్ ను నివారించుకోవడం :

చిప్స్, కేక్స్, బిస్కెట్స్ వంటి ప్రొసెస్డ్ ఫుడ్స్, ప్రొసెస్డ్ మీట్ వంటి వాటిని నిల్వ చేయడం కోసం ఉపయోగించే కొన్ని పదార్థాలు శరీరంలో కొవ్వు చేరడానికి కారణమవుతుంది. కాబట్టి, ఇలాంటి ప్రొసెస్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది.

4. రెగ్యురల్ డైట్ లో ఎక్కువ ఫ్రూట్స్ చేర్చుకోవాలి:

4. రెగ్యురల్ డైట్ లో ఎక్కువ ఫ్రూట్స్ చేర్చుకోవాలి:

ఫ్రూట్స్ లో న్యూట్రీషియన్స్ ఎక్కువ. క్యాలరీలు మరియు ఫ్యాట్ ఉండవు. ఫ్రూట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, బాడీలో ఫ్యాట్ చేరదు .

5. త్రుణ ధాన్యాలు:

5. త్రుణ ధాన్యాలు:

త్రుణ ధాన్యాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇమ్యూనిటి పెంచడంలో ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి. ఫలితం ఏంటంటే హై క్యాలరీ ఫుడ్స్ ను చేర్చుకోకపోవడం వల్ల శరీరంలో ఫ్యాట్ ఏర్పడకుండా నివారించుకోవచ్చు.

6. రాత్రి భోజనం త్వరగా ముగించాలి:

6. రాత్రి భోజనం త్వరగా ముగించాలి:

అండర్ ఆర్మ్ ఫ్యాట్ ను కరిగించుకోవాలంటే, రాత్రి భోజనం త్వరగా తినాలి. లేట్ నైట్ డిన్నర్ వల్ల శరీరంలో కొవ్వు చేరుతుంది. అదేవిధంగా చేతుల్లో కూడా కొవ్వు చేరుతుంది. లేట్ నైట్ డిన్నర్ వల్ల తిన్న ఆహారం జీర్ణమవ్వడానికి సరిపడా సమయం ఉండదు.

7. స్వీట్ మరియు షుగర్ ఐటమ్స్ :

7. స్వీట్ మరియు షుగర్ ఐటమ్స్ :

స్వీట్స్, షుగర్ తో తయారుచేసిన పదార్థాలను తినడం వల్ల వాటిలో ఉండే ఫ్రక్టోజ్ లివర్ ను మెటబలైజ్ చేయడం వల్ల ఫ్యాట్ ఏర్పడుతుంది. లివర్ లో ఏర్పడిన ఫ్యాట్ కణాలు, శరీరం మొత్తం మరియు అండర్ ఆర్మ్ బాగాల్లో నిల్వ చేరుతుంది. కాబట్టి, స్వీట్స్ , షుగర్ ఫుడ్స్ తినడం మానేయాలి.

8. నీళ్ళు ఎక్కువగా తాగాలి:

8. నీళ్ళు ఎక్కువగా తాగాలి:

సాధ్యమైనంత వరకూ శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. అందుకు రోజుకు సరిపడా నీళ్ళు తాగాలి. సాఫ్ట్ డ్రింక్స్ మరియు కెఫినేటెడ్ డ్రింక్స్ తాగడం అవాయిడ్ చేయాలి. వీటికి బదులు, నీరు ఎక్కువగా తీసుకోవాలి.

English summary

Surprising Food Habits That Helps To Get Rid Of Underarm Fat In A Month !

That extra lump of fat accumulated under your arms makes you so embarrassed that you just want to get rid of it as soon as possible. You try wearing your favourite sleeveless top or your tank top and then because of the bulging fat under the arm, it looks odd.
Desktop Bottom Promotion